అందరికి ఉపాధ్యాయనోత్సవ శుభాభినందనలు.... 
మరీ ముఖ్యంగా నాకు లౌకిక విద్య నేర్పిన చిన్ననాటి టీచర్లకు / సార్లకు, కాలేజి లెక్చెరర్లకు, ప్రొఫెస్సర్లకు, విద్యా సహాయం చేసిన బంధువులైన అన్నలు / అక్కలకు, మితృలకు...... అట్లే
అలౌకిక / ఆధ్యాత్మిక విద్యను నేర్పిన/నేర్పుతున్న వివిధ మాధ్యమాలలోని బోధక,వాచక,సూచక,పరమ,కారణ గురువులకు, శ్రీవారి సేవ ప్రసాదించిన గురువులకు/భాగవతులకు, అప్పుడు పరిచయమై ఎన్నో విధాలుగా నాకు సహాయ సహకారాలు అందించిన / అందిస్తున్న ఎందరో గురుతుల్యులకు/డాక్టర్లకు/ఇతర సద్వర్తనులైన పెద్దలకు సవినయ పాదాభివందనాలు సమర్పిస్తు, ఉపాధ్యాయదినోత్సవ నమస్సుమాంజలులు...!
కొందరి పట్ల కృతజ్ఞ్యత అనేది ఎల్లపుడు సజీవంగా నిలిచిపోతుంది, ఎందుకంటే మనకు వారు చేసింది అప్పటికి చిన్న సహాయంలా ఉన్నా, ఒక్కోసారి అది అందని నాడు మన ప్రస్థానమే ఆగిపోయి ఉండి ఉండవచ్చు...!
[ ఈతిబాధలతో ఇంట్లో దుర్భరంగా ఉన్న వాతావరణంలో చదవలేక, ఎగ్జాంస్ లో ఎట్ల పాసవ్వాలో ఏమో అని మథనపడుతున్న నాడు, అక్క సహాయం చేసిన తన గత సంవత్సరం నాటి EEE లాబ్ రికార్డ్ మనకు ఆరోజు లభించిన ఏకైక సహాయం అని తెలిసినప్పుడు చెప్పుకున్న థాంక్స్, మనకి ఎప్పుడూ కృతజ్ఞ్యతా భావాన్ని కలిగిస్తున్నట్టుగా.... )
శ్రీవారిసేవలో గుడిలో సన్నిధి డ్యూటీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నప్పుడు, అది ఆ రోజు బాగా శరీర దారుఢ్యం ఉన్న కేవలం 20 మందికే అని తెలిసి ఆ లిస్ట్ లో నా పేరు లేదని చూసి బాధపడ్డప్పుడు, కరుణతో మానుష ప్రయత్నంగా మనల్ని కూడా తీసుకెళ్ళిన గురువులకు, ఆ నాడు దైవానుగ్రహం తోడై ఏదో హడావిడిలో ఆనందనిలయంలో డ్యూటీకి పింక్ పాస్ మన తెల్ల కుర్తాకి అక్కడి విజిలెన్స్ ఆఫిసర్ పిన్ చేసి క్షణాల్లో లోనికి పంపిన నాడు, ఆ గురువులో, ఆఫిసర్ లో శ్రీనివాసుని దర్శించి రాల్చిన ఆనందభాష్పాలు, మనకి ఎప్పుడూ కృతజ్ఞ్యతా భావాన్ని కలిగిస్తున్నట్టుగా.... ( ఆ గురువారం నాడు ఏకధాటిగా కొన్ని గంటలపాటు స్వామి నేత్రసౌందర్యాన్ని, శ్రీవత్సాన్ని, వక్షస్థల వ్యూహలక్ష్మి అమ్మావారిని, స్వామిని ఆపాదతలమస్తకం దర్శిస్తూ ఉండిపోయిన తన్మయత్వం, నారాయణా అంటూ కనుమూసే ఆఖరిక్షణంవరకు పదిలంగా యెదలోతుల్లో కొలువైపోయిన మాధవ మధురస్మృతి..
)
ట్రైన్ టైం అయిపోతుందని హడావుడిగా జీపులో 7 కొండలు దిగిపోతున్నప్పుడు ఒక భాగవత వైద్యుడి రూపంలో స్వామి ఇచ్చిన మందు ఆనాడు మనకి ప్రాణదానమే చేసుండొచ్చు...అప్పుడు అది తెలియకపోయినా, తర్వాత ఎప్పుడో ఆ భాగవతుల ఇంట్లోని దైవమందిరాన్ని దర్శించి, ఆ ఇంటి అన్నపూర్ణమ్మ వండిన వాళ్ళ పెరట్లోని మామిడికాయల పుళిహోర ప్రసాదం తిన్నప్పుడు మనకు ఆ " హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణి " తెలిపినప్పుడు, అప్రయత్నంగా వాళ్ళకు మనం గావించిన పాదనమస్కారం మనకి ఎప్పుడూ కృతజ్ఞ్యతా భావాన్ని కలిగిస్తున్నట్టుగా....
ఆఫీస్లో తరచూ వందలాది హడ్సన్ ఏజెంట్స్ అన్నీ నెట్వర్క్ కనెక్టివిటి ఇబ్బందులతో డౌన్ అయిపోయి అన్ని టీంల బిల్డ్ ఎగ్జిక్యూషన్స్ ఎక్కడివక్కడే నిలిచిపోయి అదొక పెను సవాల్ గా మారిననాడు, ఒక మితృనితో చర్చలో వచ్చిన ఇడియాని ఇంఫ్లిమెంట్ చేసి, javaw తో silent auto agent restart కనిపెట్టిననాడు, కలిగిన కృతజ్ఞ్యతా భావం.....
ఇలా ప్రతి ఒక్కరికీ తమ తమ జీవితపు ప్రతి ముఖ్యమైన మజిలీలో ఎవరో ఒకరు మనకు దైవం రూపం లో / గురువుల రూపంలో సహాయం ఒనరించిన నాడు కలిగిన కృతజ్ఞ్యతా భావం ఎలప్పుడూ వారి పెద్దతనాన్ని / ఔన్నత్యాన్ని గుర్తుపరచడం కద్దు...!
"భారతరత్న", దేశ 2వ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లిరాధాకృష్ణన్ గారి జన్మదినం సెప్టెంబర్ 5 - అనగానే చిన్నప్పుడు స్కూల్లో ఒక పెద్దపండగ. పంద్రాగస్ట్, జనవరి - 26 న ఉండే కోలాహలానికి ఏ మాత్రం తగ్గని సందడి... ఎందుకంటే ఆ రోజు స్కూల్లో ఒక పోటి. ఆసక్తిగల పిల్లలందరు ఆ ఒక్కరోజు టీచర్/సార్ లాగా వేషంకట్టి, తమకంటే చిన్న తరగతులకు వెళ్ళి పాఠాలు చెప్పి, సాయంత్రం ఇచ్చే 1st, 2nd, 3rd ప్రైజ్ కోసం ఎదురుచూసే ముచ్చటైన రోజు.
( ఆటపాటలతో పాటుగా చదువులంటే ఎనలేని మక్కువైన నాకు మార్కులు ఎప్పుడు 90 లేదా 80 % ల్లోనే ఉండాలనే ఆరాటం, పట్టుదల కొంచెం ఎక్కువే. పొరపాటున ఎప్పుడైనా మార్కులు 70% లోకి జారాయి అంటే ఇంక తిండి, నిద్ర కాదు కదా, మంచినీళ్ళు సైతం మార్కుల లాగానే కనిపిస్తూ లబోదిబోమంటూ ఉండడమే ఆ వారమంతా...
ఒక్కోసారి అద్దం ముందు నిలబడి నేనే ఆ సబ్జెక్ట్ చెప్పే సార్/టీచర్ లాగా ఊహించుకొని మార్కులు ఎందుకు తగ్గాయి అని ప్రతిబింబం తో పొరాడే పప్పు లాగా ఫీల్ అయిపోవడం బాగా గుర్తు....
)
ఒక్కోసారి అద్దం ముందు నిలబడి నేనే ఆ సబ్జెక్ట్ చెప్పే సార్/టీచర్ లాగా ఊహించుకొని మార్కులు ఎందుకు తగ్గాయి అని ప్రతిబింబం తో పొరాడే పప్పు లాగా ఫీల్ అయిపోవడం బాగా గుర్తు....
అమ్మానాన్న ఇంట్లో ఏదైనా పండగకి రెండు డ్రెస్సులు కొనిస్తే / కుట్టిస్తే, నాకు ఎంతో ఇష్టమైనది Sep-5 కోసమే ఒకటి దాచుకొని పెట్టుకునే వాన్ని...
ఇక క్లాస్లో ఫ్రెండ్స్, టీచర్/సార్లు ఒక్కొక్కరు ఒక్కో సలహా / కామెంట్లతో నాకు ఆ వారమంతా మొత్తం స్కూల్లోని అన్ని క్లాసులకు సార్లాగా వెళ్ళి చెప్తున్నామా ఏంటి అన్నట్టుగ ఫీల్ అయిపోతూ ఉండేవాన్ని..!
ఇక క్లాస్లో ఫ్రెండ్స్, టీచర్/సార్లు ఒక్కొక్కరు ఒక్కో సలహా / కామెంట్లతో నాకు ఆ వారమంతా మొత్తం స్కూల్లోని అన్ని క్లాసులకు సార్లాగా వెళ్ళి చెప్తున్నామా ఏంటి అన్నట్టుగ ఫీల్ అయిపోతూ ఉండేవాన్ని..!
నా ఫేవరెట్ లెక్కల మాస్టార్, రాజారావ్ సార్ వచ్చి, "ఒరెయ్ ఈ సారైనా కొంచెం నీ కోడిబరుకుడు తగ్గించి బ్లాక్ బోర్డ్ పై స్పష్టంగా రాస్తే నీకు ఎక్కువ పాయింట్స్ వచ్చి 1స్ట్ ప్రైజ్ రావడం ఈజి ఐతది..లేకుంటే మళ్ళి మొహం ఇంతచేస్కొని అలిగి నాకు ఎందుకు 1స్ట్ ఇవ్వలేదు అని రోజు క్లాస్లో పీక్కతింటవ్...." అని జోకులు వేయడం...
తెలుగు మాస్టార్ ప్రసాద్ సార్ రావడమే ఆలస్యం క్లాస్ అంతా నవ్వులపువ్వులు విరబూసి, "అరెయ్ ఈసారి వినయ్ గాడు ఏ సబ్జెక్ట్ ఏ క్లాస్ కి తీస్కుంటడో బెట్ కడ్దామా..." అని జోకులు వేస్తూ ఆ నవ్వులవిరులపరిమళాలు ఇంకా ఎక్కువగా చేసి బోరింగ్ గా కాకుండా క్లాస్ ని ఉత్సాహంగా ఉండేలా చేసేవారు....
అందర్ని తమ హావభావవిన్యాసాలతోనే నవ్విస్తూ,
" క్యా హువా రె మహేశ్వరి(మహేశ్)... వాట్ రె నవీనా (నవీన్)...హోంవర్క్ కిదర్ హైరె ఉదయి కుమారి (ఉదయి కుమార్), క్యా పడ్రె రె అజీమా (అజీం)...ఇస్బార్ వినయ్ కుమారి (వినయ్ కుమార్, అంటే నేనే
) కౌన్సా క్లాస్ కో పఢానే జారే..." అంటూ అబ్బాయిలను అమ్మాయిలపేర్ల లాగా పిలిచి ఆటపట్టించే, ఫిసిక్స్ / కెమిస్ట్రి మాస్టార్, వెంకట్ రెడ్డి సార్ రాగానే మరొక నవ్వులహేళ......మార్కులు తగ్గినా, క్లాస్లో అల్లరి చేసినా, గట్టిగా మొట్టికాయలు వేయడం, అమ్మాయిలతో అబ్బాయిల ముక్కు పట్టించి లెంపలు వేయించి, "శరం నయ్యేరే తుంకో..నెక్ష్ట్ టైం అయిసా రిపీట్ హూవా తో లడ్కియోకే బీచ్ మె బైట్నాపడేగా....సంఝే..." అంటూ, అలా ఈ సారు బోధన తనదైన శైలిలో ఉండేది...వేరే స్కూల్లల్లో కూడా చెప్పడానికి వెళ్ళేవారు కాబట్టి, కేవలం వారానికి కొన్ని గంటలు మాత్రమే ఈ సారు స్కూల్లో ఉండేవారు... సబ్జెక్ట్ పై గట్టి పట్టు, అసలు పుస్తకం పట్టుకొనే అవసరంలేకుండానే, మొత్తం లెసన్స్ అన్నీ చెప్పేసే దిట్ట వెంకట్ రెడ్డి సార్, అని పేరు ఈ సారు కి....!
" క్యా హువా రె మహేశ్వరి(మహేశ్)... వాట్ రె నవీనా (నవీన్)...హోంవర్క్ కిదర్ హైరె ఉదయి కుమారి (ఉదయి కుమార్), క్యా పడ్రె రె అజీమా (అజీం)...ఇస్బార్ వినయ్ కుమారి (వినయ్ కుమార్, అంటే నేనే
ఇక హింది కి దుర్గా టీచర్, ఇంగ్లిష్ కి సైదులు/గిడియన్ సార్స్, బయాలజి కి జి.వి.ఎల్ (జి.విజయలక్ష్మి)/వైశాలి టీచర్స్ , సోషల్ కి సుధా టీచర్ / తిమోతి సార్ స్కూల్లో బాగా ఫేమస్.....
ఇలా అందరి టీచర్ల/సార్ల దెగ్గర నా "క్లాస్ మానిటర్", "ఫస్ట్ ఇన్ క్లాస్" / "సెకండ్ ఇన్ క్లాస్", బ్యాడ్జిలను చూపిస్తూ తిరిగే ఆ స్కూల్ డేస్ నిజంగా ఎంత మధురమైన జ్ఞ్యాపకాలో..!
అలా చదువుల్లో సహాయం చేసే గురువులే కాకుండా, జీవితానికి కూడా ఒక టీచర్/సార్ ఉండి చక్కదిద్దినప్పుడే అది ఫలవంతం అవుతుందని, స్కూల్ జీవితం గడిచాక 6 సంవత్సరాల తరువాత 21వ పడిలో శ్రీచాగంటి సద్గురువుగారి ఒక లఘు ప్రవచనావాక్యం హనుమంతుని గురించి విన్నప్పుడు, అలాంటి ఇంకో టీచర్ / సార్ జీవితంలోకి రావడం, ఆ తరువాత కొన్ని నెలలకు వారిని సికింద్రాబాద్ లో షణ్ముఖోత్పత్తి / గంగావతరనం ప్రవచనంలో మొట్టమొదటిసారి దర్శించుకోవడం, తదుపరి ఆ గురువే సద్గురువై జీవితపు ప్రతి మజిలీ లో తమ వాక్కులతో దిక్సూచియై నిలిచి, నా కుటుంబానికి అత్యంత క్లిష్టమైన సమయంలో ఆ వాక్కు నాకు పూర్వజన్మసుకృతంగా లభించి, దరి దారి తెలియని సంసారం అనే సముద్రంలో సాగుతున్న చుక్కాని లేని నావలా, ప్రారబ్ధం అనే సుడిగుండాల్లో చిక్కి సతమవుతున్న పయనాన్ని, విధి వక్రించి జడరాశిలా స్తబ్దుగా మారిన జీవితం అనే కాంత, శ్రీరామ పాదస్పర్శతో జీవశక్తి పుంజుకున్న చైతన్య రాశిగా మారి, కలి ధాటికి అపసవ్యంగా తిరోగమనం లో వెళ్తున్న బ్రతుకు బండిని, సవ్యంగా భగవద్ కైంకర్యం గా మార్చి బ్రతికే మార్గంలోకి మళ్ళించి, దశాబ్ద కాలపు నా కష్టాలన్ని ఫలించి ఇవ్వాళ ఒక చక్కని సొంత ఇంట్లో నా జీవితాన్ని సుస్థిరపరిచిన వైనం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి....
సరే, మొత్తానికి చెప్పోచ్చేది ఏంటంటే, శ్రీమద్రామాయణ, భారత, భాగవతాది ఇతిహాస, కావ్య, పురాణాలు కేవలం మంచి సంగీత సాహిత్య కథాకాలక్షేపమే కాదు, అందులోని విజ్ఞ్యానాన్ని సద్గురువులబోధాంతర్భాగంగా నిత్య జీవితానికి ఆపాదించుకున్న నాడు, మన ఇబ్బందులెన్నింటికో వాటి ద్వారా పరిష్కారములు లభించి, ఎంతో కొంత ప్రశాంతజీవనం చేకూరుతుంది అన్నది పెద్దలు / సద్గురువులచే రూఢీ పరచబడిన సర్వోన్నతమైన సత్యం...!
సరే, మొత్తానికి చెప్పోచ్చేది ఏంటంటే, శ్రీమద్రామాయణ, భారత, భాగవతాది ఇతిహాస, కావ్య, పురాణాలు కేవలం మంచి సంగీత సాహిత్య కథాకాలక్షేపమే కాదు, అందులోని విజ్ఞ్యానాన్ని సద్గురువులబోధాంతర్భాగంగా నిత్య జీవితానికి ఆపాదించుకున్న నాడు, మన ఇబ్బందులెన్నింటికో వాటి ద్వారా పరిష్కారములు లభించి, ఎంతో కొంత ప్రశాంతజీవనం చేకూరుతుంది అన్నది పెద్దలు / సద్గురువులచే రూఢీ పరచబడిన సర్వోన్నతమైన సత్యం...!
"విధి బలీయమైంది.." అని పెద్దలు చెప్పేది సత్యమే అయినా.... గురుబలం / దైవబలం / అనుగ్రహం అంతకంటే బలీయమైనది అని నా ధృడ విశ్వాసం...! 
పాపంధకారార్క పరంపరాభ్యం, తాపత్ర్యాహీంద్రఖగేశ్వరాభ్యం, జాడ్యాబ్ధి సంశోషణవాడవాభ్యం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం...!!!
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215261344900267


No comments:
Post a Comment