Tuesday, September 25, 2018

శ్రీ ఆదిశంకరాచార్య జయంతి శుభాభినందనలు...! - 2018

అందరికి శ్రీ ఆదిశంకరాచార్య జయంతి శుభాభినందనలు...!
ఆమ్మ, ఆలు - అనే ఇద్దరు ప్రత్యక్షంగా, గురువు, దైవం - అనే ఇద్దరు పరోక్షంగా,
ప్రతి మనిషి యొక్క జీవన సాఫల్యతకు పరిపూర్ణత్వాన్ని చేకుర్చే అతిముఖ్య జీవనరథసారధులు.....
సరిగ్గా పరికించి చూస్తే, ఈ జీవితం లోని బాంధవ్యాలన్నీ అమ్మ మరియు భార్య కల్పించినవే...
అవి ఏ మేర మనవిగా అయ్యి మన ఉన్నతికి సహాయసహకారాలుగా ఉంటాయో, అది గురువు మరియు దైవం యొక్క నిర్ణయమై ఉంటుంది అన్నది నా నమ్మకం...
జీవితం అనే నిరంతర ప్రయాణపు బండి చక్రాలకు, బాల్య కౌమారపు జీవిత తొలిసంధ్య కు అమ్మ,
యవ్వన వార్ధక్యాలనే జీవిత మలిసంధ్యకు భార్య, ఇరుసులుగా ఉండి, ఆ ప్రయాణపు ఆఖరి మజిలి ఈశ్వరైక్యం వైపుగా వెళ్ళేలా చేయడానికి ఈ ఇద్దరిదే ఐహిక కర్తృత్వం...
ఆ ఐహిక యాత్ర సక్రమంగా సాగి, అది తుదకు పారమార్దిక ఉన్నతివైపు సాగేందుకు, సద్గురువుల దర్శనాలు, మాటలు, బాటలు, మత్రమే కారణభూతమై, "తత్ త్వం అసి..",
అనే అత్యంత కష్టమైన అద్వైత స్థితిని మనకు చేకూర్చి పెట్టే సద్గురువుల అనుగ్రహానికి సాటిరాగలది, ఈ యావద్ విశ్వమందు ఉండజాలదు అన్నది మన పెద్దల మాట...!
12 శతాబ్దాలముందు అలనాడు నడయాడిన సద్గురువులు శ్రీ ఆది శంకరులు మరియు ఈ నాడు నడయాడే సద్గురువులు శ్రీ చాగంటి వారు ...
నగురోరధికం నగురోరధికం..!
నమః శంకరభానవే నమః...!!
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం... !!!

No comments:

Post a Comment