గురుః సాక్షాత్ పరబ్రహ్మ...తస్మై శ్రీ గురవే నమః...! 
అని కదా చిన్నప్పుడు రోజు ప్రార్ధించి క్లాస్ మొదలు పెట్టి చదువులు గడించింది...
కొందరు, ' ఆ...ఏదో గురువుగారంటా....అక్కడెక్కడో అల్లంత దూరంలో ఉంటూనే, నమ్ముకున్న వారికి శుభాలు కలుగజేస్తారంటా.... ఇలా కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని / పద్మావతి అమ్మవారిని వేడుకుంటే అలా వాళ్ళు పలికి కష్టాలు తీరుస్తారట...
ఇలా అరుణాచల శివ అని స్మరిస్తే అలా జీవితం ముక్తిప్రదమైపోతుందట....నేటి ఆధునిక యుగంలో కూడా ఎంటో ఇలాంటి చాదస్తాలు...' అని నిరుత్సాహ పరుస్తూ, పరులపై ట కరాలు చ కారాలు నూరడంలోనే మొత్తం జీవితం గడిపేస్తారు...దానికి హేతువాదం అని ఒక పేరు....
ఇలా అరుణాచల శివ అని స్మరిస్తే అలా జీవితం ముక్తిప్రదమైపోతుందట....నేటి ఆధునిక యుగంలో కూడా ఎంటో ఇలాంటి చాదస్తాలు...' అని నిరుత్సాహ పరుస్తూ, పరులపై ట కరాలు చ కారాలు నూరడంలోనే మొత్తం జీవితం గడిపేస్తారు...దానికి హేతువాదం అని ఒక పేరు....
మరికొందరెమో, ' ఆ గురువుగారే ఇందరి జీవితాలకు చుక్కాని లా ఉండి సరిదిద్ది వారిని సన్మార్గంలో పెట్టింది...వారు చెప్పింది నమ్మి, ఆచరించి, శివకేశవ అభేదంతో దైవాన్ని సేవించి తమ ధార్మిక సంకల్పాలన్ని సిద్ధింపచేసుకున్నారు....మీరు కూడా చేసి చూడండి అని ప్రోత్సహించే వారు..."
ఏది ఏమైనా, ఇది ధర్మభూమి...ఇందు నుడవబడిన సద్గురువుల బోధ సార్వకాలిక సత్యమై, కలి కాలపు బాధలకు హరి నామం / సద్గురు వాక్యం వినా, నాస్తి దివ్యౌషధం... అని మనకు బోధపడే జీవితానుభవాలు తరచి చూస్తే ఎన్నెన్నో... 
" మీరు బాగా విని ఎర్ర సిరాతో రాసుకొని గుర్థుపెట్టు కోవలసిన విషయం...గోవిందుడు ఇప్పటికీ, మరీ ముఖ్యంగా ప్రతి గురువారం నాడు, ప్రత్యక్షంగా కొండంతా కలియతిరుగుతూ, కేవలం ఆనందనిలయంలోనే కాదు తన దివ్య నేత్రాలతో తిరుగిరులను మొత్తం తేరిపార చూసి ఎవరెవరు ఎవరెవరికి మంచి చేస్తున్నారో....ఎవరెవరు ఎవరెవరికి తద్ విరుద్ధంగా చేస్తున్నారో చూసి, తన శ్రీపాద శరణాగతి చేసిన ప్రతి ఒక్కరిని కంటికిరెప్పవలే కాచుకుంటూ లెక్కలన్ని చక్కదిద్దే లీలా వినోది... " అని చెప్పినప్పుడు అట్లా ఎట్లాగా అని సందేహపడుతూ కూర్చునేవారు కొందరు...ఓహొ అట్లాగా అని నమ్మేసి ఆచరించి దైవదర్శనాన్ని పొంది ధన్యులైయ్యేవారు ఇంకొందరు....!
ఇంకో మాట కూడా చెప్పాలంటే, ఇల్లే ఆనందనిలయమైన నాడు, వేసుకున్న ఉత్తరీయంలోని గురుబార్హస్పత్యమే మనకు గోవిందుని వాక్కుగా మారి దిశానిర్దేశం చేసేంతగా సద్గురువాక్య శ్రవణ మనన నిధిద్యాసాదులు మనకు తోడుగాఉంటాయి అని అనడంలో కించిత్ కూడా అతిశయోక్తి అవసరంలేదు... 

No comments:
Post a Comment