Tuesday, September 25, 2018

ప్రసాదం...! :)

ప్రసాదం...! 
దేవుని విషయంలో ఎన్ని మిస్ అయినా పర్లేదుకాని ఒక్క ప్రసాదం మాత్రం దొరికితే చాలు అనుకుంటాం...
ఎవరైనా ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళొచ్చాం అంటే, ఎప్పుడు... ఏంటి... అనేవి పక్కన పెట్టి, ఫస్ట్ ప్రసాదం ఎక్కడ అని అడిగేస్తాం.... 
అసలు ఆధ్యాత్మ మార్గంలో, మనిషియొక్క సర్వతోముఖాభివృద్దికి సహాయం చేసే నిజమైన నేస్తం కేవలం ప్రసాదం మాత్రమే, అంటే అతిశయోక్తి కాదు అని నా భావన...
జిహ్వపోషణ, ఉదరపోషణ, మనోపోషణ, మేధోపోషణ, అన్నింటిని మించి ఆత్మపోషణ కలిగించే సాధనం ఏదైనా ఉందంటే అది కేవలం భగవద్ ప్రసాదం మాత్రమే అని నా ఫీలింగ్... ఎందుకంటే దైవానుగ్రహం ప్రత్యక్షంగా నెలకొనిఉండి, మనం సేవించినంత మాత్రంచేత, ఆ దైవాన్ని సేవించిన భావన తద్ ఫలము రెండూ ఏకకాలంలో సిద్ధింపచేస్తుంది ప్రసాదం....
(అంటే దేవుడు దాన్ని తాకి, లేదా దెగ్గరకు తీసుకొని, లేదా రుచి చూసి, తన శక్తిని అందులో నిక్షిప్తం చేస్తాడా అని భలే డౌట్లు వస్తాయి కొందరికి..! ఒక్క ఐరిస్ స్కాన్ తో మన కంటిపాపకు ఉన్న జీవ శక్తితో, ఆటోమేటెడ్ లాకింగ్ సిస్టం నుండి మరెన్నో కాంప్లెక్స్ సిస్టంస్ మనమే క్రియేట్ చేయగాలేనిది, ఒక్క క్రీగంటి చూపుతోమాత్రమే వాళ్ళ అనుగ్రహమంతా అందులోకి ఒలికిస్తారనుకోవడంలో అసలు ఆశ్చర్యం ఎందుకు.. )
అందునా, ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటశైల స్థిత శ్రీనివాసప్రభు ప్రసాదం ( గట్టి దిట్టపు లడ్డు..! ) అంటే, ఇంక ఆ ఆనందానికి అవధే ఉండదు... 
స్వామికి ఎంతో ఇష్టమైన భూసతి యొక్క రేవతి నక్షత్ర స్థిరవారపు ఘడియల్లో, శ్రీ వైష్ణవాచార్య కరకమలములనుండి ఆండాళ్ అమ్మ సన్నిధిలో నా కరముల్లోకి స్వామి పంపిన కబళం, ఇక తన భూరి కటాక్షం ఎప్పుడు వర్షిస్తుందో అని వేయిటింగ్...
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.PE
Audio download link : Balakrishnaprasad Archive link : ప|| ఇతనిప్రసాదమే యిన్నియును | గతి యితనిదేకన కాదనరాదు

No comments:

Post a Comment