Thursday, November 29, 2018

Kartika Puranam - 21 - ఇరవై ఒకటో అధ్యాయము

Kartika Puranam - 21

కార్తిక పురాణము - ఇరవై ఒకటో అధ్యాయము
ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను, వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీ కర్రలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరములతోను, కుంభాయుధములతోను, గొడ్డళ్ళతోను, కర్రలతోను, ఆయుధముల విక్షేపములతోను, యుద్ధము చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్దమును భటులనన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి.
ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచికట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వాలే విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వాలే పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు.
సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో యిట్లనియె.
క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధిని, ఛత్రమును వాని ధనుస్సును త్రుంచినవి. పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. రాజా! శూరుడువౌదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను.
ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి.
అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మేడలు విరిగి భూమియందు పడిరి.
అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుర్రముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి. రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలబడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడినయొకభటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో యిట్లనియె. తిరుగు వెనుకను తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ మునీ ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని జేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరములనుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించ లేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆయుద్ధమందు సూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను, భటులను బంగారపు కట్లతో గూడినవియు, స్వయముగా వాడియైనవియు, సానపెట్టబడినవియు, స్వనామ చిహ్నితములు అయిన అర్థ చంద్ర బాణములతోను, ఇనుప నారాచములతోను, ఇనుప అలుగులు గల బాణములతోను, ఖడ్గములతోను, పట్టసములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్చాదితలైన అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడునావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్దమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజుల చేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగుర్పొడిచినది. ఇట్టి యుద్దమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటియందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతోను, బ్రకాశించుచుండెను. కాంభోజరాజునకు పదమూడు అక్షౌహిణీళ సేన యున్నది. మూడు అక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తానూ యుద్ధమందోడుటకును, తన రాజ్యము శతృరాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితినేని విష్ణుమూర్తి సేవ జేయుము. ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రముతో కూడినది. కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తిక మాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను? నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది. ఇకముందు సత్ధర్మపరుడవు గమ్ము. అట్లయిన కొనియాడదగిన వాడగుదువు. ఓ రాజా! కార్తిక వ్రతమాచరింపుము. హరి భక్తుడవు కమ్ము. కార్తిక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము.
ఇతి స్కాంద పురాణే కార్తికమహాత్మ్యే ఏక వింశాధ్యాయః సమాప్తః

Kartika Puranam - 20 - ఇరవై అధ్యాయము

Kartika Puranam - 20

కార్తిక పురాణము - ఇరవై అధ్యాయము
జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయునదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెనను కోరిక కలదు గాన చెప్పుము. వశిష్టముని పల్కెను. రాజా! వినుము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమయినది దానిని నీకు చెప్పెదను. అత్రిమహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోపకారము కొరకు కార్తిక మహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పుదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మ శ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తికమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్యమునీంద్రా! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము జేసితివి. చెప్పెదను వినుము. కార్తికమాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమయిన దేవుడు లేడు. కార్తికమాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుదురు. ఈవిషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు, సూర్యవంశసంభూతుడు పురంజయుడను ఒకరాజు గలడు. ఆపురంజయుడు కొద్దికాలము ధర్మమార్గమందు ప్రవర్తించి తరుాత ఐశ్వర్యవంతుడై బుద్ధినశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును, శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడునునై బంగారమును దొంగిలించువారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడియుండెను. రాజు యీప్రకారముగా అధర్మ పరాయణుడు కాగా అతని సామంత రాజులు, కాంభోజ, కురురాజాదులు అనేకమంది సింహబలులతో గూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యాపట్టణము చుట్టును చెరకు పానకమునకు తేనెటీగలవలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగబలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయం ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను జేసినదియు, శస్త్రాస్త్ర పూరితమును, మహాచక్రయుతమును, మంచి గుర్రములతో గూడినదియునైన సూర్యదత్త రథమునెక్కి గజ, రథ, తురగ, పదాతులనెడి, చతురంగబలముతో పురద్వారమునుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడువలె ధ్వనిచేయించెను.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే వింశాధ్యాయస్సమాప్తః

Kartika Puranam - 19 - పంతొమ్మిదవ అధ్యాయము

Kartika Puranam - 19

కార్తిక పురాణము - పంతొమ్మిదవ అధ్యాయము

జ్ఞాన సిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింబపడిన వానిని గాను, గుహ్యమైనవాని గాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను, దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీపాదపద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగాని వాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయు సమర్ధుడవు. జన్మసంసార సముద్రందున్న శివాదులచేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచరప్రాణులచే స్తుతింపబడినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీవిభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచుచున్నది. త్రాడు నందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణా! నీవు ఆదిమధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూప చతుర్విధాన్నరూపుడవు నీవే. యజ్ఞరూపుడవు నీవే. నీసంబంధియు, పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈజగము వెన్నెలయందు సముద్రమువలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీవలననే సమస్తము జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మ స్వరూపుడవు. అఖిలవంద్యుడవు. మనస్సు చేతను చూడ శక్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు? ఓ కృష్ణా! నీకు నమస్కారము. ఓయీశ్వరా! నీకు నమస్కారము. ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్ను ధన్యునిజేయుము. మీదర్శనఫలము విఫలము చేయకుము. ఓ పరమపురుషా! నీకు మాటిమాటికీ నమస్కారము. ఓదేవేశా! నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరతపడదు గదా! నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు. కృపా సముద్రుడవు. నేను సంసారసముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందుబడియున్న నన్ను రక్షించుము. శుద్ధ చరితా, ముకుందా! దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథా నమస్కారము. త్రిలోకవాసీ నమస్కారము. అనంతా, ఆదికారణా, పరమాత్మా నమస్కారము. పరమాత్మరూపుడవు, పరమహంస పతివి, పూర్ణాత్ముడవు. గుణాతీతువు, గురుడవు, కృపావంతుడవు. కృష్ణా నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్ధిని వాసివి, స్వర్గమోక్షప్రదుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మనివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణా! నీకు నమస్కారము.

ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా! నీకు నమస్కారము. వైకుంఠనిలయా! వ్యాసాదులచేత కొనియాడబడు పాదములు గల కృష్ణా! నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియను పడవచేత సంసారసముద్రమును దాటి తేజోమయమైన నీరూపమును బొందుదురు. అనేక బోధలచేతను, తర్కవాక్యములచేతను, పురాణములచేతను, శాస్త్రములచేతను, నీతులచేతను మనుష్యులు నిన్ను చూడలేదు. నీపాదభక్తి యను కాటుకను ధరించి నీరూపమును జూచి దానినే యాత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓహరీ! నీకునమస్కారము. నీనామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము. ఒక్కమారు నీనామ సంకీర్తన చేయువాడు నీపదసన్నిధికి చేరును. కేశవా, నారాయణా, గోవిందా, విష్ణూ, జిష్ణూ, మధుసూదనా, దేవా, మహేశా, మహాత్మా, త్రివిక్రమా, నిత్యరూపా, వామనా శ్రీధరా, హషీకేశా, పద్మనాభా, దామోదరా, సంకర్షణా! నీకు వందనములు, ఓ కృపానిధీ! మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతిజేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతోనిట్లనియె. ఓ జ్ఞానసిద్ధా! నీస్తోత్రమునకు సంతోషించితిని. నామనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను. కోరుకొనుము. అని విష్ణువు పల్కెను. జ్ఞానసిద్ధుడిట్లడిగెను. గోవిందా నాయందు దయయున్నయెడల నీస్థానమును యిమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడిట్లు చెప్పెను. ఓజ్ఞానసిద్ధా! నీవు కోరినట్లగును. కాని ఇంకొకమాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై యున్నారు. బుద్ధిహీనులయి ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగెడి ఉపాయమును జెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా! మీరందరు వినుడు నేజెప్పెడి మాట ప్రాణులకు సుఖదాయకము.

నేను ఆషాఢశుక్ల దశమినాడు లక్ష్మితో గూడ సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశినాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రా సుఖము ఇచ్చెడి ఈమాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదులనాచరించువారికి పాపములు నశించును. నా సన్నిధియు కల్గును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈమాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా! నా ఆజ్ఞమీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమయిన ఈవ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేకమాటలతో నేమి పనియున్నది? ఎవ్వడు మూఢుడై ఈచాతుర్మాస్య వ్రతమును జేయడో వాడు బ్రహ్మహత్యఫలమును బొందును. నాకు నిద్రగాని, మాంద్యముగాని, జాడ్యముగాని, దుఃఖముగాని, జన్మజరాదులు గాని, లాభాలాభములు గాని లేవు. అనగా యీనిద్రాదులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో భక్తి లేనివారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంకపెట్టుకుని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞననసరించి నాకిష్టమయిన ఈచాతుర్మాస్య వ్రతమును జేయువారు విగతపాపులగుదురు. నాకు ఇష్టులగుదురు. నీచే చేయబడిన యీ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠింు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నాలోకమును జేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమినాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడిట్లు పలికెను. ఓయీ! నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోను ఉత్తమోత్తమమైనది. పాపవంతులుగాని, దురాత్ములు గాని, సాధువులు గాని, ఎవరైనను హరిపరాయణులై ఈనాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును జేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణుప్రీతికొరకై జేయవలెను. ఈచాతుర్మాస్యవ్రతమును పునిస్త్రీగాని, విధవ గాని, శ్రమణిగాని, లేక సన్యాసిని గాని తప్పకజేయవలెను. మోహముచేత చాతుర్మాస్య వ్రతమును జేయకుంిన యెడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు బొందును. మనోవాక్కాయములను శుద్ధము చేసికొని చాతుర్మాస్యమునందు హరిని బూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు కోటి జన్మములందు కల్లుద్రాగువాడు పొందెడి గతిని బొందును. సందేహము లేదు. పరమాత్మతుష్టిై చాతుర్మాస్య వ్రతమాచరించని వాడు గోహత్య చేసిన వానిఫలమును పొందును. ఈ ప్రకారముగా వీలు చేసికొని ఏవిధముగానైనను చాతుర్మాస్య వ్రతమాచరించు వాడు నూరు యజ్ఞములఫలమొంది అంతమందు విష్ణులోకమును జేరును. జ్ఞానసిద్ధాదులిట్లు హరియొక్క మాలను విని చాతుర్మాస్య వ్రతమును జేసి వైకుంఠలోక నివాసులయిరి.

ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకోనవింశాధ్యాయస్సమాప్తః

Kartika Puranam - 18 - పద్దెనిమిదవ అధ్యాయము

Kartika Puranam - 18

కార్తిక పురాణము - పద్దెనిమిదవ అధ్యాయము
ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా! నేననుగ్రహించబడితిని. నీదర్శనముయొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓమునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరయిరి. పాపవంతుడైన నేనెక్కడ. ఇట్టి సద్గతి యెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైన కార్తీకమాసమెక్కడ? ఈమునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ధ సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించునుగదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను. అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆకర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరి చేయవలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కును వజ్రాయుధముచేత నాపాప పర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదవినుము. అనిత్యమైన ఈదేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వందములు లేవు. అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మనుజేయవలెను. దానితో చిత్తశుద్ధిగలిగి తద్ద్వారా జ్ఞానమునుబొంది దానిచేత ఆత్మను యథార్ధముగా తెలిసికొనవలెను. దేహధారియయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలనుభక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతఃస్నానమాచరించలేనివాడు తులా సంక్రాంతి యందుకార్తీకమాసమందును, మకరమాసమందును, (మేష) వైశాఖమందును స్నానము చేయవలెను. ఈమూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానము చేయు వాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి గలుగును. చాతుర్మాస్యాది ;పుణ్యకాలములందును, చంద్రసూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. ౧. స్నానము ౨. సంధ్యాజపము ౩. హోమము ౪. సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తికమాసము ఈకార్తికము ధర్మార్థకామ మోక్షములనిచ్చును. ఈకార్తికముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు. కేశవునితో సమానమైన దేవుడు లేడు. కార్తికమాసముతో సమానమయిన మాసము లేదు. కర్మ స్వరూపమును దెలిసికొని కార్తికమాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞలమును బొంది వైకుంఠమందుండును.
ఉద్భూతపురుషుడడిగెను. అయ్యా! చాతుర్మాస్య వ్రతని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆవ్రతవిధి ఎట్లు? ఆవ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును? ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము. అంగీరసుడిట్లు పల్కెను. ఓయీ! నీవు ఈమనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును జెప్పెదను. సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాఢ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును. తిరిగి కార్తికశుక్ల ద్వాదశిరోజున లేచును. ఇది చాతుర్మాస్యము. అనగా నాలుగు మాసములు చేయువ్రతము. ఈనాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది గనుక యిది పుణ్యకాలము.ఈపుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈనాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును జెప్పెదను వినుము. ఈవిషయమందు నారదునకు హరిచెప్పినదొక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర ఖేచరోరగగణములచేతను, స్వగణభృత్యుల చేతను సేవింపబడుచుండెను. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చివచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములఓ ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను. హరియు నారదుని జూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనెను.
ఓ నారదా! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్ములందున్నారా? ఈవిషయమంతయు ఈసభలో జెప్పుము. నారదుడు ఆమాటను విని ఆనందించి నవ్వుచు హరితోనిట్లనియె. ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని. వేదత్రయమందు జెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు దెలియకున్నది. కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహంకార వర్జితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగా నున్నారు. కాబట్టి ఓ దేవా! ఏదయినా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు, సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను జేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారము చేయరైరి. కొందరు అభిమానవంతులైరి. కొందరు గర్వముతో ఉండిరి. కొందరు కామాంధులై యుండిరి. కొందరాయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రతపరాయణులైయుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి. కొందరు ఏకాదశ్యు[అవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందరాచారవంతులుగానుండిరి. కొందరాత్మచింతజేయుచుండిరి.
బ్రాహ్మణ రూపధారియైన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు దెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను. అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠమునుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపువంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, మకరకుండల విరాజితుడును, అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును, అనేక సూర్య కాంతింతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి హరి పాదములము నమస్కారము చేసి వారిముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాణరీతిగా స్తుతించిరి.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టాదశాధ్యాయస్సమాప్తః

Kartika Puranam - 17 - పదిహేడవ అధ్యాయము

Kartika Puranam - 17

కార్తిక పురాణము - పదిహేడవ అధ్యాయము
అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు. స్థూల, సూక్షమములు, ఈజంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీవిషయము పూర్వమందు కైలాసపర్తమున పార్వతికి శంకరుడుజెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెడను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహము లేదు. దేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా! మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహంబ్రహ్మేతి(నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈవాక్యార్థ బోధకు హేతువయిన పదార్థజ్ఞానము నాకు తెలియలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను.ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్య స్వరూపమునై ఉన్నది. ఇట్టి ఆత్నము నీవెందుకు తెలుసుకొనుట లేదు. సచ్చిదానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము. ఈదేహమనెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటమువలే రూపము గల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు. ఇదిగాక ఈదేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలనబుట్టినది. గనుక దేహము వికారము కలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు, ఆత్మవస్తువులు కావు. దేహేంద్రియాదులన్నియు ఎవరి సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని=ఆత్మయని తెలిసికొనుమని భావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుముకు అయస్కాంతమణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను=ఆబ్రహ్మనని తెలిసికొనుము.
ఎవనియొక్క సాన్నిధ్యమాత్రముచేత జడముైన-కదలికలేని దేహేంద్రియమనః ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆబ్రహ్మను నేను అని తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో అట్లుగానే దేహాదులను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను జాత్మ అని తెలిసికొనుము. ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్రమిత్ర ప్రియప్రియాది భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము. సాక్షియు బోధరూపుడగు వాడే నీవని యెరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయిన వాడును ౧. పుట్టుటా=జనిమత్వ, ౨. ఉండుట=అస్తిత్వం, ౩. వృద్ధిగతత్వ=పెరుగుట, ౪. పరిణామత్వ=పరిణామము చెందుట, ౫. కృశించుట, ౬. నశించుట ఈ యారు వికారములు లేనివాడు. వికారములు ఈఆరు భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థముు ఇట్లునిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విధిముఖముగాను తచ్ఛబ్దార్థమునుజ్ దెలిసికొనవలయును.
శ్లో. అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేనచ!
వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరాచార్య సుభాషితమ్!!
తచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము. ఆతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము. వ్యావృత్తియనగా ఇదిగాది ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిది బ్రహ్మయని భావము. సాక్షాద్విధిముఖమనా సత్యం జ్ఞానమనంతంబ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలును అని భావము. ఆత్మ సంసారలక్షణ విశిష్టముగాదనియు, సత్య స్వరూపనియు, దృష్టిగోచరముగాదనియు, తమస్సుకు పైదనియు అనుపమానందరూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. ఆతద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను తెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనై అర్ధము. వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో వాకే నేనని తెలిసికొనును. మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తుజ్ఞానము చేత సర్వవిజ్ఞానము దేనిచే కలుగునని శ్రుతులందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి.
వేదములందు ఎవ్వనికి "తదనుప్రవిశ్య" ఇత్యాది వాక్యములచేత జీవాత్మరూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను, ఆజీవులను గురించి నియంతృత్వమున్ను జెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము జెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈప్రకారముగా "తత్, త్వం" అను పదములు రెండును నిశ్చయించబడివి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును జెప్పెదను. వాక్యార్థమనగా తత్త్వం పదములకు ఐక్యము=ఏకత్వము చెప్పబడును. ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ. పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము. తత్త్వమసి అనా తత్, త్వమ్, అసి, ఈవాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టులయి జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినయెడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈలక్షణావృత్తి మూడు విధములు. అందులో యిచ్చటభాగలక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణయనబడును. తత్త్వమసియందు సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించినయెడల అభేదము సంభవించును. తత్=అది, త్వం-నీవు, అసి=అయితివి. అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును యిట్లే బోధచేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడొక్కడే భాసింును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును. నేను బ్రహ్మనను వాక్యార్థ బోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది నిరతిశయానందముతో ఉండును. కాబట్టి ముందు చిత్త శుద్ధికై కర్మను జేయవలెను. ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆపుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియై కర్మబంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేము లేదు.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తదశాధ్యాయస్సమాప్తః

శ్రీకరమౌ శ్రీరామనామం...! ఈశ్వర నామమే ఈశ్వరుని ఇహపర ఉనికి..!! :)

శ్రీకరమౌ శ్రీరామనామం...!
ఈశ్వర నామమే ఈశ్వరుని ఇహపర ఉనికి..!! 
శ్రీరామ అనేది ఒక మూడక్షరాల నామమే అయినా, అది సంధించి సాధించబడిన ఘనకార్యములు కోకొల్లలు...
నీటిపై రాళ్ళను నిలిపి లంకకు వారధి కట్టిన నలనీలురకు అది కేవల నామం కాక..సాక్షాత్ తారకమంత్రమై వర్ధిల్లింది....
శ్రీరామ శ్రీరామ అని అనునిత్యం ఉపాసించిన వానరోత్తమున్ని, 'రామాయణమహామాలా రత్నం వందే అనిలాత్మజం...' అంటూ భవిష్యద్ బ్రహ్మనేచేసింది....
మేఘనాథ అనే పేరుకు తగ్గట్టే, మేఘాల చాటున దాక్కొని చేసే మాయా యుద్ధంలో ఆరితేరిన అరివీరభయంకరుడై, మొత్తం శ్రీరామ వానరసేననే నాగాస్త్రం తో సమూలంగా తుడిచేసి, ఎన్నెన్నో అమోఘ శస్త్రాస్త్రాలకు సైతం లొంగని ఇంద్రజిత్ ని నిలువరించుటకు సాధ్యం కాక, చివరకు శ్రీరామ నామమే ' అస్త్ర మంత్ర కీలకం ' గా, అంటే అనుసంధించబడే అస్త్రం యొక్క ప్రాణశక్తిగా చేసి,
" ధర్మాత్మాసత్యసంధశ్చరామోదాశరధిర్యది పౌరుషేచాప్రతిద్వంద్వశరైనంజహిరావణిం ...! "
అనే జయమంత్రాన్ని అభిమంత్రించి సంధించిన శరం తో రావణకుమారున్ని హతమార్చిన, లక్ష్మణస్వామికి, ఆ యుద్ధ చివరి ఘడియల్లో కాపాడింది శ్రీరామ నామమే కదా....!
ఒక గజదొంగ గా జీవనం సాగిస్తున్న ఆటవికున్ని, రామ నామాన్ని
' మరామరామరామరామరామరా ' అని భక్తి తో తెలియక తిరగేసి చదివినా, ఒళ్ళంతా పుట్టలుపట్టేలా తపమాచరించినందుకు, ' శ్రీ వాల్మీకి మహర్షి ' ని చేసి, భూతకాలపు సంఘటనలను, ఆ ఘటన తాలూకు వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను సైతం ప్రత్యక్షంగా వర్తమాన దర్పనం లో చూడగలిగేలా బ్రహ్మ గారిచే వరంపొంది, జరిగిన రామ కథను యథాతథంగ, 24 బీజాక్షరాల గాయత్రి మహామంత్ర శక్తిని నిక్షిప్తం చేసిన 24000 శ్లోకాలతో ' శ్రీమద్రామాయణం ' గా , లోకానికి లవకుశుల ద్వారా అందించింది ఆ శ్రీరామ నామమే కదా....!
( అంటే ఏది పడితే అది తిరగేసి చదివితే మనం కూడా చదివి మహర్షులమైపోతామా అనడం భావ్యం కాదు.
ఇక్కడ ' మ ' అంటే విష్ణుశక్తికి ప్రతీక అయిన బీజాక్షరం... ' రా ' అంటే అగ్నిశక్తికి ప్రతీక అయిన బీజాక్షరం కాబట్టి, అవి తెలియక తిరగేసినా, కేవలం మొదట మరియు చివర మాత్రమే, పూర్వాపర అక్షర బంధనం లుప్తమైనాసరే, మధ్యలో మొత్తం రామ నామమే శబ్దించింది కాబట్టి అది ఫలించిది... )
మన దైనందిన లౌకిక జీవితంలో కూడా ఎన్నో ఉదాహరణలు చూస్తుంటాం....
ఒక చిన్న కొవ్వుపదార్ధం, గుండె యొక్క రక్తనాలాల్లో అడ్డుగా చేరినప్పుడు అది గుండెపోటుకి కారణమైనట్టు....
' స్టెంట్ ' అనే ఒక చిన్న పరికరం, ఆ అడ్డుని తొలగించే సాధనమై స్వస్థత ని చేకూర్చినట్టు...
ఘనీభవించిన ఒక చిన్న రక్తపు చుక్క (బ్లడ్ క్లాట్), మెదడు యొక్క కణజాలా పనితీరుకి అడ్డంకి గా మారి మనిషినే కుప్పకూలిపోయేల చేసినట్టు...
అత్యంత జాగ్రత్తగా అతి చిన్న న్యూరోసర్జికల్ డివైజ్ తో అది తొలగించి మనిషి ప్రాణాన్ని నిలిపినట్టు....
చిన్నది అయినా అందులోని చిత్శక్తి పెద్దదే, అనేలా మనకు బోధించే లౌకిక తార్కాణాలే ఎన్నో ఉన్నయి కదా ...!
" చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినుర వేమ " అన్నట్టుగా...వేమన శతకం లోని, పై పద్యం లో చెప్పినట్టుగా, కొంచెమైనంత మాత్రన అది కొదువ కాదనే సత్యం చిన్నప్పుడే మనకు స్కూల్లో బోధించినా అది చాలా మంది మర్చేపోతాము....
బక్కగా / చిన్నగా ఉన్నంత మాత్రాన చిన్నతనంతో చూడడం, లావుగా / పెద్దగా ఉన్నంత మాత్రాన గొప్పదనం ఆపాదించడం, నేతిబీరకాయలో నెయ్యిని గ్రహించిన వైనం లా ఉంటాయి....
కాబట్టి ఎదురుగా ఉన్న ఒక వస్తువు కాని, వ్యక్తి కాని, పదార్ధం కాని, మరేదైనా సరే, కేవలం వాటి యొక్క లౌకిక పరిమాణమే కాకుండా, వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మసలుకోవడం మాన్యులకు ఔచిత్యం గా ఉండి, అదే సదరు వ్యక్తి యొక్క పెద్దరికానికి కొలమానం అనిపించుకుంటుంది.
ఒక రుగ్మత చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని కాకుండా, అది శరీరాన్ని ఎంతగా బాధిస్తిస్తుందనేదాన్ని బట్టి ఒక వైద్యుడు చికిత్స చేసినట్టుగా...
వైద్యుడు సూచించిన ఒక మందుబిల్ల / మాత్ర / గోలి, చిన్నదా / పెద్దదా అని కాకుండా అందులోని కెమికల్ కంపోసిషన్ ప్రకారంగా దాని యొక్క వ్యాధి నియంత్రణాశక్తి ని మనం గౌరవించినట్టుగా,
అదే విధంగా, ఒక దేవుడు / దైవనామం , లేదా దేవాలయం, లేదా ఒక ఆధ్యాత్మ సంప్రదాయం, కనిపించడానికి చిన్నదా / పెద్దదా అని కాకుండా, సనాతనంగా ఎందరో మన పూర్వికులచే, గురుపరంపరాగతంగా తరతరాలుగా ఆచరింపబడుతూ వస్తున్న ఏ అంశమైనా, వాటి యొక్క ఐతిహ్యంపై క్షుణ్ణంగా పరిశోధన చేసి సరైన అవగాహన పెంపొందించుకున్న తర్వాతే వాటిపై వ్యాఖ్యానాలు / చర్చలు / తీర్పులు ఇత్యాదివి వెలువరించాలి కాని కేవలం ఏదో చిన్న అంశమే కదా అని తేలిక గా చిన్న చూపు చూస్తే, తత్ ఫలితమైన పర్యవసానాలు ఉండడం తథ్యమే కదా...
మనచే ఆచరింపబడిన ఒక కర్మ ఎన్ని రోజులకు / ఎన్ని సంవత్సరాలకు / ఎన్ని జన్మలకు, దాని ఫలితం ఇస్తుంది అంటే, అది కేవలం ఈశ్వర నిర్ణయం అని మాత్రమే చెప్పగలం..
ఎందుకంటే కర్మాచరణ స్వతంత్రత మాత్రమే జీవునికి ఇవ్వబడింది కాని దానియొక్క ఫలితనిర్ణయస్వతంత్రత మాత్రం ఆ సిద్ధాంతకర్తకే, అంటే ఆ పరమాత్మకే, ఉండడం కద్దు...!
శ్రీరామ / గోవింద / కృష్ణ / శివ / భవాని / దుర్గా / జీసెస్ / ఆల్లాహ్ / వాహెగురు, మరే ఇతరమైన సరే, భగవంతుడంటే అతని నామమే...!!
నామమే నామి యొక్క శాశ్వత ఉనికి కి నిత్యమైన, సత్యమైన, సార్వకాలికమైన, సార్వజనీనమైన, సర్వశ్రేయోదాయకమైన నిర్వచనం. ఈశ్వరున్ని నమ్మడానికి తత్ సూచిత నామం కంటే ఇంకేదోకావాలి అనుకోవడం కేవలం వితర్కమే అవుతుంది తప్ప ఎన్నటికి విజ్ఞ్యానం కానేరదు...
నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరనే..రామహరే కృష్ణ హరే తవనామవదామి సదానృహరే....!!! 
===============================================
Just as the seed of a banyan tree, even though very tiny, grows into a huge tree when planted, any deed done with a good mind even when small is not to be considered small as it could yield great result.
After assimilating the nuances of several mighty spiritual scriptures and gaining mastery over a multitude of religious tenets and umpteen devotional practices, several enlightened souls born on this great unparalleled INDIAN soil, have unanimously agreed upon and conceptualized the fact that GOD is nothing but his name. And thus Annamaachaarya has rightly described that lord's name itself is the highest form of supreme soul's existence... 
===============================================
నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే ఆత్మ నిధానాంజనము
నమో నమో కేశవ నమో నారాయణ
నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదనా
నమో త్రివిక్రమా నమో వామనా
నమో నమో శ్రీధర నమో హృషీకేశ
నమో పద్మనాభ నమో దామోదర
నమో సంకర్షణ నమో వాసుదేవ
నమో ప్రద్యుమ్నతే నమో అనిరుధ్ధా
నమో పురుషోత్తమా నమో అధోక్షజా
నమో నారసింహా నమోస్తు అచ్యుతా
నమో జనర్ధనా నమోస్తు ఉపేంద్ర
నమో శ్రీ వేంకటేశ నమో శ్రీ కృష్ణ 
About This Website
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Archive Page విష్ణు నామాలతొ సాగే ఈ కీర్తనను చూడండి Audio link : Balakrishnaprasad Audio link : Sri MS Subbalakshmi నీ నామమే మాకు న...

Friday, November 23, 2018

Kartika Puranam - 16 - షోడశాధ్యాయ

Kartika Puranam - 16

కార్తిక పురాణం – 16వ అధ్యాయం

వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు బ్రీతికరమైన ఈకార్తిక వ్రతమును జేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తికమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును. వైకుంఠమునకు బోవును. కార్తికమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసినయెడల సంతానము గలుగునని భావము. కార్తికమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు. రోగము ఉండదు. దుర్మరణము ఉండదు. కార్తికమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తికమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తికమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణచేసిన వానికి గలిగెడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తికమాసమందు పూర్ణిమరోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును. కార్తికమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను.శిలతోగాని, కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈస్తంభవిషయమై పూర్వకథ గలదు. చెప్పెదను వినుము. మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణ్వాలయము గలదు. ఆయాలయముచుట్టును వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోను మాసమంతయును బూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి. వ్రతములు చేసిరి. అందులో ఒక ముని యిట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తికమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము. ఈదినము కార్తికపూర్ణిమ అయి ఉన్నది. ఈదినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తికమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరు ఆమాటవిని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము జేసిరి. ఓరాజా! ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తికవ్రత సముత్సాహులైన వారందరు కలసి ఆస్థాణువునందు శాలివ్రీహితిలసమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆసమయమున దేవాలయము ఎదుట చట చట అనే శత్బములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థాణువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయమునుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యో యని ధ్వనిచేయుచుయొక పురుషునిచూసి ఇట్లనిరి. ఓయీ! నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగా నున్నావు? ఆవిషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా! నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యమును పాలించువాడను, ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు. హరిచరిత్రను వినలేదు. తీర్థయాత్రకు పోలేదు. స్వల్పమైన దానము చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారెకెన్నడును ఏదానమును యివ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియెడల ధనములేకుండ ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి యుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావసంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు వారు. అప్పుడు సరే యిచ్చెదనని చెప్పుటయే గాని యిచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకొని స్వకార్యములను జేసికొనువాడను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆదుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి ఏబది రెండువేల మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము పదివేల మారులు కాకిగా బుట్టితిని. ఆవల పదివేల మారులు తొండగా జన్మించితిని. పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాశినైయుంటిని. ఆతరువాత కోటి మారులు వృక్షముగా నుంటిని. చివరకు కోటి మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూతదయావంతులగు మీరు చెప్పుదురు గాక. మీదర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది. ఓ మునీశ్వరులారా నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు యిట్లు చెప్పుకొనసాగిరి. కార్తికమాసఫలము యథార్థమయినది. ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు గూడ మోక్షమిచ్చినది. అందును ఈపూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును.ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తిక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపమువలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దయినను కార్తికమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టినయెడల పాపమునశించి దయాళువయిన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి యిట్లనియె. జ్ఞానవేత్తలయిన మునీశ్వరులారా! దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును? మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును? ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షోడశాధ్యాయస్సమాప్తః

Kartika Puranam - 15 - పదిహేనవ అధ్యాయము

Kartika Puranam - 15

కార్తీక పురాణము- పదిహేనవ అధ్యాయము

ఓ జనకమహారాజా! తిరిగి కార్తీక మహాత్మ్యమును జెప్పెదను.భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిరనివాసి యగును. ద్వాదశినాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తీకమాసమున శుక్ల పక్షమందు సాయంకాలమందు హరిని బూజించువాడు స్వర్గాధిపతియగును. కార్తీకమాసమందు నెల రోజులు నియతుగా విష్ణ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈమాసమందు హరి సన్నిధికిబోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని బొందును. కార్తీకమాసమందు విష్ణ్వాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవనరకమును, కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆరోజున పూజ చేసిన పుణ్యమునకు అంతములేదు. ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడిభక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, దూపముతోను, దీపముోను, ఆజ్యభక్ష్యనైవేద్యములతోను బూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని లక్షదీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందముచేత కొనియాడబడుచు విష్ణులోకమునకు జేరి సుఖించును. కార్తీకమాసము నెల రోజులు దీపమును బెట్టలేనివాడు శుద్ధద్వాదశినాడును, చతుర్దశినాడును, పూర్ణిమనాడును మూడు రోజులు పెట్టవలెను. కార్తీకమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము దీపమునుంచిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించి వాడు పాపములేని వాడు అగును. కార్తీకమాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింపజేసికొనును. ఈవిషయమందొక పూర్వపు కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన విష్ణ్వాలయమొకటిగలదు. కార్తీకస్నానార్ధము కర్మనిష్ఠుడను నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకుబోయి నూనెదెచ్చి పండ్రెండు దీపపాత్రలను దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము జేసి మెల్లగా దీపముల సన్నిధికి జేరెను. ఎలుక వచ్చినతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తిని గూడ గ్రహించెు. అంతలో జ్వాలతో యున్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తియు మండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తిక శుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆరాత్రియే అచ్చటనే మృతినొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు వచ్చితివి అని యడిగెను. ఆమాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె. పాపరహితా! నేను ఎలుకను. గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈదేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిపుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది యే పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను? ఏమి పాపమును జేసితిని? ఏపాపము చేత ఈమూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈవిషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను. ఆమాటవిని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూతపురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను. ఓయీ! నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు. బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును బెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి. ఈప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆద్రవ్మును భూమియందు దాచి చివర మృతినొందితివి. ఇట్టి పాతకములచేత నరకమనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈదేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమువలన ఈదినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి.గనుక ఆపుణ్యముచేత మూషకత్వము పోయి దివ్య రూపము గలిగినది. ఇక హరభక్తి గలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈప్రకారముగా యతిచెప్పిన మాటను విని ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞతీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికిబోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానము చేసి ఆమహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును జేసి తన్మహిమవలన అంతమందు సాయుజ్యముక్తిబొందెను. కాబట్టి కార్తీకశుద్ధి ద్వాదశినాడు భగవత్పరాణుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః

మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః | సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్.. !

"శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆయుష్మాన్ భవ అఖండసౌభాగ్యసిద్ధిరస్తు....." అంటూ ,
ఇలా జీవితాంతం నమస్కరించిన వారందరిని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తు బ్రతికేది అర్చకులు / వేదవిదులు / ఆచార్యులు / గురువులు...ఏ పుట్టలో ఏ పాముందో అది బయటకు వచ్చేంతవరకు తెలియదు...అట్లే, ఏ గాయత్రి ఉపాసకుని శక్తి ఎంత ఘనమైనదో అది వారి అనుగ్రహరూపేన ఫలించేంతవరకు ఎవరికి తెలియదు.....
ఇది ఈ వేద భూమికి మాత్రమే ఉన్న వైశిష్ట్యం...! 
మనకు చిన్నప్పుడు స్కూల్లో పెద్దగా ఏమి రానప్పుడు, అలాకాదుర..ఇలా చదవాలి..ఇలా రాయాలి...., అని పలక బలపం పట్టించి లౌకిక విద్య నేర్పిన గురువులు మనకు సదా గుర్తుండిపోతారు...మన భావి జీవితంలో ఎన్ని పై చదువులు చదువుకున్నప్పటికీ, ఆ మొట్టమొదట అక్షరానుగ్రహం అందించిన వారిని మనం అస్సలు మరచిపోలేము. ఎందుకంటే వారు అనుగ్రహించిన ఆ చిన్న చిన్న అక్షర బిందువులు జాగ్రత్తగా అందిపుచుకున్న మనం, ఆ తర్వాత విశ్వవిద్యాలయ చదువుల వరకు కూడా వెళ్ళగలిగాం...
నాసిక్ త్రయంబక్ లోని బ్రహ్మగిరి పర్వతసానువుల్లో, చిన్నగా గోముఖం నుండి రాలే నీటిబిందువులే, క్రింద త్రయంబకేశ్వరాలయంలో గుప్తగోదావరి గా ప్రభవించి, భద్రాచాలం / రాజమహేంద్రి / ధవళేశ్వరం వచ్చేసరికి సువిశాల అఖండ గోదావరి గా భారతదేశపు 2 వ అతిపెద్ద జీవనది గా రూపాంతరం చెందినట్టుగా...! 
అదే విధంగా ప్రతి ఆస్తికజీవుడికి అధ్యాత్మ విద్యా ఒనమాలు నేర్పిన వారు కూడా అలా ఎప్పటికి గుర్తుండిపోతారు....
స్తోత్రాలు, సూక్తాల నుండి, వేదాంతవర్ణనలు వరకు రావాడానికి ముందు, మనకు ఏమి తెలియని రోజుల్లో, సహాయం చేసిన వారు కూడా అలా చిన్ననాటి స్కూల్ టీచర్ల లాగ గుర్తుండి పోతారు....
గత ~ 20 సంవత్సరాల నుండి రెగ్యులర్ గా వెళ్ళే మా ఇంటిదెగ్గరి సాయిబాబా గుడిలో, అధ్యాత్మవిద్యా విషయపరిజ్ఞ్యానం ఏమి లేని ఆ చిన్ననాటి రోజుల్లో, అంటే నా 7త్ / 8త్ క్లాస్ నుండి బి.టెక్ తదుపరి రోజుల వరకు, కేవలం వెళ్ళడం, బాబా సన్నిధిని శుభ్రపరచడం, బాబా ఉయ్యాల లో ఉండే హారతి బుక్ తీస్కొని మధ్యాహ్న / సంధ్యా / శేజ్ హారతి చదవడం, బాబా పల్లకి సేవ లో పాల్గొనడం, బాబా చాలీసా పారాయణం చేయడం..... ఇలా చేసే రోజుల్లో, రాజాస్వామి గారు అనే ఒక ఆచార్యులు బాబా ఆలయంలో కొత్తగా ఆర్చకులుగా వచ్చారు.... వారు వచ్చాకే నాకు ఆ గుడిలో బాబా సత్చరిత్ర పారాయణ అనుగ్రహం లభించింది... బాబా నిత్యారాధనలో ఎక్కడా ఏ విధమైన లోటురాకుండా, అన్నీ పద్దతిగా, సక్రమంగా, అక్షరదోషాదులు లేకుండా, ఓపికతో అర్చించే వారిని చూసినప్పుడల్లా నాకు మహల్సాపతి గుర్తుకువచ్చేవారు....
ప్రతి గురువారం సంధ్య హారతి అయ్యాక, ఢాం అని నేలకేసి గట్టిగా ఒక కొబ్బరికాయ పగలగొట్టి, బాబా పల్లకి సేవ ప్రారంభించి, భజనలతో బాబా పల్లకిని చిత్తారమ్మ గుడిమీదుగా ప్రదక్షిణపూర్వకంగా తీస్కెళ్ళడం, రాజాస్వామి గారు అర్చకులుగా వచ్చాక అక్కడ స్థిరీకరించబడిన సంప్రదాయం...
వారు ఒక పాట...నేనొక పాట..ఇతర భక్తులు ఒక పాట, అలా చిడతలు వాయిస్తూ వెళ్ళే ఆ రోజుల్లోనే, భజన సంప్రదాయంలో భగవంతుని సులువుగా సాధించవచ్చనే విషయం నాకు బోధపడిన ఆ తొలి అధ్యాత్మ బీజమే నా చిరకాల జ్ఞ్యాన నేస్తమై అన్నమయ్య కీర్తనలపై మక్కువ కలిగించి, తదంతర కాలంలో అన్నమార్యుల కృతులలో గల గహనమైన భగవద్ తత్వాన్ని సులభగ్రాహ్యం చేసింది... 
సంగీత నేపథ్యమున్న ఒక గాయని గారు ఆ రోజుల్లో, బాబా సన్నిధిలోని సాయంత్రం భజనలో, ' చిన్ని చిన్ని అడుగులు వేస్తు..సాయి రావయ్య..సాయి బాబా రావయ్య.....' అనే పాట ఎంతో మధురంగా అలాపిస్తునప్పుడు, మహల్సాపతి లా రాజాస్వామి గారు చేసిన అర్చనకు, లక్షీబాయి లా ఆలపించిన ఆ గాయనిమణి గీతానికి, నిజంగా ఆ సాయి బాబా యే షిరిడినుండి కదిలి వచ్చి మా ఎదుట వీరాసనం వేసుకుని కూర్చున్నారు అని అనిపించేది.... నాకైతే నిజంగానే నమ్ముకున్న ఆ సాయి బాబా యే తదంతరకాలం లో శ్రీ చాగంటి సద్గురువులుగా జీవితంలోకి ప్రవేశించి , వారి సద్ బోధలే జ్ఞ్యాన దిక్సూచియై అప్పటినుండి నా అధ్యాత్మ ప్రయాణానికి అలుపెరగని నేస్తంగా ఉండి, దిటవైన ఆలంబన అందించి ప్రార్ధనలు సఫలీకృతమయ్యేలా చేసిన ఆ స్మృతులు సదా స్మరణీయములు....
ఏ విధంగా ఆకాశానిది ఒక నిర్ధిష్టమైన పరిధి, రూపు, రంగు, ఇత్యాది మరేవిధమైన ఇతర లౌకికమైన అంశానికి కట్టుబడని తత్వమో, సద్గురువులది, దైవానిది, కూడా అదే తత్వం....!!
అది మన యొక్క సమస్త లౌకిక సంపదలను పక్కనపెట్టి, నిర్మలభక్తి అనే పాత్రను చేబట్టి, తలవంచి గురువులకు / దైవానికి నమస్కరించి, ప్రార్ధించడం వచ్చిన వారికి మాత్రమే లభించే, స్వాతిచినుకు సోకిన భూగంధాఘ్రానిత మనోస్వాంతన తాలుకు జ్ఞ్యాన పరిమళం...!
గురుబోధలను / దైవానుగ్రహాన్ని, విశ్వాసం తో కాకుండా, కేవల తర్కం తో స్వీకరించాలి అనుకునే వారికి, దైవం చాలా కాలం వరకు ఒక గుడికి / బింబానికి / మూర్తికి మాత్రమే పరిమితమయ్యే అంశం....అది కొన్ని సంవత్సరాలే అవ్వొచ్చు..కొన్ని జన్మలే అవ్వొచ్చు....!
కొందరు తెలియని వారు ఆకాశాన్ని ' శూన్యము ' అని వర్ణిస్తారు...లౌకిక కొలమానాలకి అందదు కాబట్టి ...
కాని, తెలిసిన వారు అది ' పరిపూర్ణము ' అని అభివర్ణిస్తారు...మనకు అందే అన్ని లౌకిక సంపదలు ఆకాశ జనితములే అని తెలుసుకున్నరు కాబట్టి...
( చాల కాలం తర్వాత అదే గుడిలో ఆ రాజాస్వామి వారి దర్శన భాగ్యం ఇవ్వాళ లభించిన ఒక చిరు మధురస్మృతి కవనం....  )
===============================================
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 14 ||
===============================================

Wednesday, November 21, 2018

The Indian explanation of Darwin's theory of evolution analogous to Shree MahaVishnu's Dasaavataara...

Follow · 6 July 2015Edited 
 
Vishnu Avatar are nothing but representation of evolution of earth , How life was first created , evolved and various.
1. Matasya Avatar - The first incarnation or avatar of Lord Vishnu was in the form of a fish and is known as ‘Matsya Avatar.’ It has now been confirmed by Science through various experiments that the first life forms evolved underwater.
2. Kurma - The second incarnation of Lord Vishnu was in the form of a tortoise known as ‘Kurma Avatar.’ Tortoise is an amphibious creature capable of living both on land and in water and it indicates the moving of life form from underwater to surface of Earth.
3. Varaha - The third incarnation of Lord Vishnu is the boar known as ‘Varaha Avatar’. Boar is a complete land animal and in this incarnation, life form has moved out of water and has adapted to land.
4. Narasimha - The fourth incarnation of Lord Vishnu is the half-man half-animal form known as ‘Narasimha Avatar.’ This incarnation starts the transformation from animal to human form.
5. Vaman - The fifth incarnation of Lord Vishnu is the dwarf or pigmy sized human being known as the ‘Vamana avatar.’ A transition from the beastly form to human form and the development of intelligence.
6. Parsuram - The sixth incarnation of Lord Vishnu is the forest dweller known as ‘Parasuram.’ He has developed weapons and axe is his first weapon. Any sharp stone can be transformed into an axe and it also indicates the first settlement of humans in forests.
7. Ram - The seventh incarnation of Lord Vishnu is Lord Ram. He civilized and has developed more superior weapons like the bow and arrows. He has cleared the forests and developed small communities or villages. He is very vigilant and protects his villages and people.
8. Balram - The eight incarnation of Lord Vishnu is Lord Balarama. He is portrayed with the plough – the beginning of full-fledged cultivation. Human civilization has developed agriculture and is no longer depended forest for food. The beginning of agrarian economy.
9. Krishna - The ninth incarnation of Lord Vishnu is Krishna. He represents the advancing human civilization. He is associated with cows, the beginning of domestication of animals and development of economy, which continues to the present day.
10. Kalki - The tenth incarnation of Lord Vishnu is Kalki and is yet to arrive. He is believed to ride on a swift horse Devadatha and destroy the world. A clear indication that human beings will bring an end to life on earth. The numerous natural calamities created by human beings and the numerous nuclear weapons stored illustrates this



Sandeep Khanagwal "Mom, I am a genetic scientist. I am working in the US on the evolution of man. Theory of evolution, Charles Darwin, have you heard of him? " Vasu asked.

His Mother sat down next to him and smiled, "I know about Darwin, Vasu. "But Have you heard of Da
shavatar? The ten avatars of Vishnu?"

Vasu replied in no.

"Then let me tell you what you and Mr. Darwin don't know.
Listen carefully-

The first avatar was the Matsya avatar, it means the fish. That is because life began in the water. Is that not right?" Vasu began to listen with a little more attention.

"Then came the Kurma Avatar, which means the tortoise, because life moved from the water to the land. The amphibian. So the Tortoise denoted the evolution from sea to land.

Third was the Varaha, the wild boar, which meant the wild animals with not much intellect, you call them the Dinosaurs, correct? " Vasu nodded wide eyed.

"The fourth avatar was the Narasimha avatar, half man and half animal, the evolution from wild animals to intelligent beings.

Fifth the Waman avatar, the midget or dwarf, who could grow really tall. Do you know why that is? Cause there were two kinds of humans, Homo Erectus and the Homo Sapiens and Homo Sapiens won that battle." Vasu could see that his Mother was in full flow and he was stupefied.

"The Sixth avatar was Parshuram, the man who wielded the axe, the man who was a cave and forest dweller. Angry, and not social.

The seventh avatar was Ram, the first thinking social being, who laid out the laws of society and the basis of all relationships.

The Eighth avatar was Balarama, a true farmer showed value of agriculture in the life

The Ninth avatar was Krishna, the statesman, the politician, the lover who played the game of society and taught how to live and thrive in the social structure.

And finally, my boy, will come Kalki, the man you are working on. The man who will be genetically supreme."

Vasu looked at his Mother speechless. "This is amazing Mom, how did you.. This makes sense!"

"Yes it does Vasu! We Indians knew some amazing things just didnt know how to pass it on scientifically. So made them into mythological stories. Mythology makes sense. Its just the way you look at it - Religious or Scientific. Your call.

( A Must Read n pass it on for the people who keep harping about western world)


HH Shree triDandi chinna jeeyar swaami's say on how to perform our worldly duties...