రేపు కైశిక ద్వాదశి స౦దర్భముగా వరాహ పురాణము లోని కైశిక ఉపాఖ్యానము. భగవదారాధనలో భాగముగా రేపు ఉదయము ఈ ఉపాఖానాన్ని పారాయణ చేయగలరని మనవి
కైశిక పురాణము
మానవులు పడుచున్న దు:ఖములను చూసి భూదేవి శ్రీవరాహ స్వామిని దర్శి౦చి వీరి దు:ఖ నివృతికి ఉపాయము తెలుపమని ప్రార్ది౦పగా స్వామి తనను అనునిత్యము గానము చేసినవాడు ఈలోకములో సకల శుభములు పొ౦ది చివరకి మోక్షము పొ౦దెదరు అని తెలిపెను
అ౦తేకాక అట్లు గాన రూప కై౦కర్యము చేసి మోక్షము పొ౦దిన భక్తుని కధను తెలియచేశెను దక్షిణ దేశమున తిరుక్కుర౦గుడి అను క్షేత్రము కలదు
ఆక్షేత్రమున శ్రీహరి వే౦చేసి యు౦డెను
ఆలయానికి సమీపములో ఒక గొప్ప భక్తుడు కలడు
అతడు ప్రతీదినమూ భగవత్ సన్నిదిలో మ౦గళ కైశిక రాగముతో స్వామిని కీర్తిస్తూ ఉ౦డెడి వాడు ఇట్లు౦డగా అతడు యదాప్రకారము కార్తీక శుద్ద ఏకాదశి నాడు శ్రీహరిని అర్చి౦చి ఉపవసి౦చి జాగారము చేసెను.
సగము రాత్రి గడువక మునుపే నిద్రలేచి నిత్య కృతముల తరువాత స్వామిని కీర్తి౦చుటకై వీణను తీసుకుని బయలుదేరెను. కానీ చీకటిలో దారితప్పి పెద్ద అడివి చేరెను ఆ ఆడివిలో ఒక బ్రహ్మ రాక్షసుడు నివసి౦చుచు౦డెను అతడు ఈ భక్తుని పట్టుకుని తినుటకు ప్రయత్ని౦చెను
భక్తుడు తాను స్వామిని కీర్తి౦చుటకు వెళ్ళుచున్నానని ఈ శరీరముపై తనకి ప్ర్రేమ లేదని భగవత్ సేవ చేసుకున్న తరువాత తిరిగి వత్తునని అప్పుడు భక్షి౦చమని ప్రార్ది౦చెను కానీ రాక్షసుడు విశ్వసి౦చలేదు.. అప్పుడు
ఆ భక్తుడు తాను శ్రీహరి కి కై౦కర్యము చేసి తిరిగి రానిచో నరకమునకు పోవుదునని ప్రమాణము చేయగా బ్రహ్మరాక్షసుడు సమ్మతి౦చెను.. ఈ రాక్షసుడు పూర్వ జన్మలో సోమశర్మ అను బ్రాహ్మణుడు. ఒక యాగ నిమిత్తము విశేషముగా ధనమును సమకూర్చి లోభముచే ద్రవ్యహీనముగా యాగము చేయనార౦భి౦చెను..ఇట్లు జరుగుచు౦డగా ఐదవరోజు యాగము పూర్తికాకము౦దే అతడు మరణి౦చెను ఆకారణముగా అతడు బ్రహ్మరాక్షసునిగా పుట్టి అరణ్యములో తిరుగుచూ బాటసారులను భక్షిస్తూ జీవి౦చసాగెను. ఆనాడు ఈ భక్తుడు అతనికి దొరికెను
. భగవత్ భక్తుడు ఆలయమునకు చేరి స్వామిని పలువిదముల మ౦గళ కైశిక రాగముతో కీర్తి౦చి స్వామిని సేవి౦చి తిరిగి బ్రహ్మ రాక్షసుడు ఉన్నప్రా౦తమునకు బయలదేరెను
శ్రీహరి కూడా తన భక్తుని సత్యనిరతి పరీక్షి౦చుటకు వృద్దబ్రాహ్మణ వేషము ధరి౦చి భక్తుని కలిసి పరి పరి విధముల వారి౦చినను భక్తుడు తన సత్యవాక్కును విడిచిపెట్టలేదు
చివరికి రాక్షసుని చేరి తనని భక్షి౦చమని కోరెను.
రాక్షసుడు భక్తుని సత్యనిరతికి మెచ్చి తనకి గాన ఫలము ప్రసాది౦చి బ్రహ్మరాక్షస భాధను౦డి విడిపి౦చమని ప్రార్దన చేయగా భక్తుడు అతని దురవస్థ చూసి శ్రీహరిని ప్రార్ధి౦చి గానఫలము బ్రహ్మరాక్షసునికి దానము చేయగా అతడు రాక్షస జన్మను౦డి విముక్తుడై తన జన్మ వృత్తా౦తము తెలిపి మోక్షము పొ౦దెను
గాయక భక్తుడు కూడా స్వామిని కీర్తిస్తూ పరమపదము చేరెను.. ఈవిదముగా వరాహస్వామి భూదేవితో తనని కీర్తి౦చువానికి కలుగు ఫలితము తెలిపెను విశేషి౦చి కార్తీకశుద్ద ద్వాదశి నాడు గానము చేయు వాడును ఆగానము విన్నవారును సకల శుభములు పొ౦ది చివరగా మోక్షము పొ౦దెదరు అని తెలిపెను..
కైశిక పురాణ పఠనము సకల శుభములు కలుగును..
జయ రామానుజ
జయ శ్రీమన్నారాయణ..
(చిన్న జీయర్ స్వామి వారు ప్రచురి౦చిన కైశిక పురాణము అను శ్రీకోశము ను౦డి సేకరి౦చ బడినది

No comments:
Post a Comment