Sreenivasulu Somavarapu is with Sri Hari Babu and Sreenivasulu Reddy Somavarapu.
భావింప అలవికాని బంధము
భక్తితొ భగవంతుని పెనవేసుకొన్న బంధము
భక్తితొ భగవంతుని పెనవేసుకొన్న బంధము
జన్మజన్మలకు చెరగని సంబంధము
బ్రతుకంతా బంగారుమయము చేయు బంధము
బ్రతుకంతా బంగారుమయము చేయు బంధము
భవములు తొలిగించు బంధము
భావము వెలిగించు బరువు కాని బంధము
భావము వెలిగించు బరువు కాని బంధము
మోక్షానికి మార్గమైన మాయా బంధము
ఆ బ్రహ్మాండనాయుకినితొ బంగారు భక్తి బంధము
ఆ బ్రహ్మాండనాయుకినితొ బంగారు భక్తి బంధము
ఎన్నెన్ని యుగాలకైనా ఎడతెగని బంధము
ఏడుకొండల వేంకటరమణునితో ఎల్లవారలకు బంధము
ఏడుకొండల వేంకటరమణునితో ఎల్లవారలకు బంధము
ఏడుకొండల వాడా వేంకటరమణ గోవిందా గోవింద
No comments:
Post a Comment