Thursday, November 1, 2018

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు...ఈ శతాబ్దపు సర్వోత్కృష్ట (బాలా స్వరూపాత్మక) శ్రీవిద్యోపాసకులు ...!

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు
Image may contain: 1 person, standing
శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు
శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు మహా తపస్సంపన్నులు. సన్యాస ఆశ్రమ నియమముల పాలనలో కంచి స్వామి వారెంత ధృతి, నియమము గలవారో, గృహస్థ ఆశ్రమ నియమ పాలనత్లో వీరంతటివారు. వీరి తండ్రి గారు శ్రీ అప్పయ్యశాస్త్రి గారు మొదలు పెట్టి పూర్తి చేయకయే కాలము చేసిన శ్రీరామ కథామృతము పూర్తిగావించి అచ్చొత్తించినారు. శాస్త్రి గారు తొలిరోజులలో ఎంతో దారిద్ర్యముననుభవించి, రోజు కూడా గడవని సందర్భంలో నిరాహారియై 27సార్లు కేవలము నీరు నైవేద్యముగ అమ్మవారికి లలితా సహస్రనామార్చన చేసినారట. నీరసముచే మాగన్నుగా వున్న వీరికి అమ్మవారు దర్శనమిచ్చి భిక్ష ఒసంగినది. అప్పటినుండి శాస్త్రి గారు వెనుదిరిగి చూచినది లేదు. ఒకరిని యాచించినదు. లేదు.
కంచి మహాస్వామి వారిని వీరు కలవకముందే స్వామి వీరివద్దకి, శాస్త్ర విషయమైన సందేహ నివృత్తికై మనుష్యులనంపెడివారట. స్వామివారు తెనాలి విజయము చేసి ఉన్నప్పుడు వీరి కోరికపై కేవలము వేదపండితులపై మోయబడిన పల్లకిలో (బ్రహ్మరథమని దాని పేరు) వీరి గృహమునకు విచ్చేసినారట. ఒకసారి వారు అనాచారము చూసి బాధపడి ఆత్మహత్యకు కూడా తలబోసి, స్వామి దర్శనార్థం వెళ్ళగా వారే స్వయముగా ఒక శాలువా కప్పి “నీ మీదకు వచ్చే అనాచారమునుండి నీకో క్రొత్త ఆవరణ ఏర్పాటు చేస్తున్నాన”న్నారట. “కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పనేది ఉండదు.” అని స్వామివారు వీరిగురించి ప్రస్తుత ప్రధాని పివి నరసింహారావు గార్కి పరిచయం చేశారట.
శ్రీ విద్యా సంప్రదాయమున పరమోత్కృష్టత నొందిన వీరి మహిమలనేకములు ప్రసిద్ధిలోనున్నవి. వీరి చితాగ్ని ధూమమునుండి బాలా స్వరూపము వెలువడినదని ప్రఖ్యాతి.

No comments:

Post a Comment