Thursday, November 1, 2018

ఆలయానికి వెళ్తున్నారా! అయితే ఇవ్వన్నీ తప్పనిసరి!!

Vinay Kumar Aitha shared a post.
 17 July 2014
ఆలయానికి వెళ్తున్నారా! అయితే ఇవ్వన్నీ తప్పనిసరి!!
* ఆలయ ప్రదక్షిణ చేసేటప్పుడు వేగం కూడదు.
* ఆలయంలో అనవసరంగా మాట్లాడకూడదు ... గట్టిగా మరియు పరుషపదజాలంతో అస్సలు మాట్లాడకూడదు.
* ఆవలింతలు, జుట్టు పిక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు లేక వెరేతద్విధమైన వస్తువులను నమలడం చేయకూడదు.
* తోపీలులు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
* ధ్వజస్తంభం, గోపుర స్థలాలను తొక్కకూడదు.
* ఆకర్షణీయమైన దుస్తులను ధరించకూడదు.
* నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
* దర్శనం పూరి అయ్యాక వెంటనే వీపు చూపి నడవకుండా వెనుకవైపు కాస్త దూరం నడిచిన తరువాత తరిగి వెళ్ళాలి.
* ఒక చేత్తో నమస్కారము చేయకూడదు.
* ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
* బలిపీఠంలో ఉన్నా సన్నిధికి మ్రొక్కకూడదు.
* ఆలయ ఆస్తులను లేక వస్తువులను అపహరించకూడదు.
* అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్ధి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
* ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
* మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
* ఆలయానికి వెళ్లొచ్చిన వెంటనే కళ్ళను కడగకూడదు, కాసేపు కూర్చొన్న తరువాతే ఇటువంటి పనులు చేయాలి.
* ఆలయంలో ప్రవేశించిన దగ్గరనుంచి తిరిగి వచ్చేంతవరకు నిదానమే ప్రదానంగా ఉండాలి.
* గోపుర దర్శనం తప్పక చేయాలి.
* ఆలయంలో మర్రి చెట్టు ఉంటే, సాయంత్రం 6 గంటల తరువాత ప్రదక్షిణలు చేయకూడదు.
* మన మాటాలుగాని, చేష్టలు గానీ ఇతరులకు ఆటంకంగా మరియు ఇబ్బందిగా ఉండకూడదు.
శ్రీ కనకదుర్గప్రభ, జులై 2014

No comments:

Post a Comment