Thursday, November 1, 2018

వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా! రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!!

Vinay Kumar Aitha shared a photo.
 24 June 2014
వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!!
No automatic alt text available.
లంకానగర దహన సమయంలో హనుమ ఎలా ఉన్నారో చూసి పైనుంచి దేవతలు, క్రిందినుంచి రాక్షసులు కొన్ని మాటలనుకున్నారు అని వ్రాస్తారు వాల్మీకి. ఇక్కడ మంత్రరహస్యాలు చూపిస్తున్నారు మహర్షి.
"వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమోవా వరుణోనిలోవా!
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో న వానరో అయమ్ స్వయమేవ కాలః!!"
ఇతడు వానరుడు కాడు. స్వయముగా కాలస్వరూపుడే. కాలమే ఎవరు యేం పని చేస్తున్నదీ గమనించుకుంటూ ఉంటుంది. ఎంత పాపాత్ముడికైనా ప్రస్తుతం రోజులు బాగానే వుంటాయి. వాడి పాపం ఎప్పుడు పండుతుందనేది గమనించుకునేది కాలం. దానిని బట్టి ఫలితమిస్తుంది. అలాగ ఎవరికి ఎప్పుడు యే ఫలమివ్వాలో గమనించుకునే కాలమే ఈ రూపం ధరించి వచ్చింది. అంటే కాలాగ్ని రుద్రుడితడు అని ధ్వనినిస్తున్నాడిక్కడ.
నవానరోయం స్వయమేవ కాలః - వానరుడు కాడు స్వయంగా కాలరూపమే. వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా- ఈ మాటలు చెప్పడంలో వాల్మీకి హృదయం మనం తెలుసుకోవాలి. వజ్రము ధరించినటువంటి దేవపతియైన ఇంద్రుడా లేక యముడా లేక వరుణుడా లేక వాయువా లేక ఈశానుడా లేక అగ్నిదేవుడా లేక కుబేరుడా లేక సూర్యుడా లేక చంద్రుడా అన్నారు. ఎంతమంది దేవతల పేర్లు చెప్పారు జాగ్రత్తగా ఆలోచిస్తే. పదిమంది దేవతలొచ్చారు చూడండి. అష్ట దిక్పాలకులని చెప్పాడు, సూర్యచంద్రులని చెప్పాడు. వీళ్ళేగా ప్రధానం. హనుమంతునిలో వీళ్ళకి స్ఫురించిన రూపం అష్టదిక్పాలకులైన ఇంద్రాది దేవతల రూపములు గోచరించాయి. ఐంద్రాస్త్ర వారుణాస్త్ర ఆగ్నేయాస్త్ర శక్తులన్నీ ఆంజనేయ స్వామివారిలో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి దర్శనమిచ్చాయి. ఒక దేవత తనయొక్క ప్రతాపాన్ని ప్రకటించినప్పుడు విజృంభించి ఉగ్రమూర్తి అయిపోతాడు. ఉగ్రమూర్తి అయినప్పుడు విశ్వరూపమే గోచరిస్తుంది. హనుమంతుడిలో ఉన్న సర్వదేవతాత్మక స్ఫురణ ఈ శ్లోకంలో వాల్మీకే మనకు స్వయంగా అందించారు. అందుకు సర్వదేవతాత్మకుడిగా కనపడ్డాడు.

No comments:

Post a Comment