చతుర్విధ పురుషార్ధ ఫలప్రసాదినియై , భవబంధవిమోచనియై, భవ పంకజభవాదిసురనుత శ్రీహరిలీలా తరంగినియై, పంచమ వేదమై, పావన పంకజనాభ పాదారవింద సన్నిధికి సులభతర మార్గమై , సమస్త వేద శాస్త్ర పురాణ సంగ్రహరూపమై ఒప్పారుచున్న ఒకే ఒక పెన్నిధి , తెలుగునేలపై పుట్టినవారి భాగ్య పరిపాకమైన అమూల్యాక్షరనిధి శ్రీ పోతనామాత్యకృత " భాగవతం " ..!
భాగవతం చెవులార వినాడానికి ఉండవలె కోటిజన్మ సుకృతం.!
భాగవతం నోరార నుడువడానికి ఉండవలె శతకోటిజన్మ సుకృతం..!
భాగవతం మనసార ఆస్వాదించడానికి ఉండవలె సహస్రకోటిజన్మ సుకృతం...!
భాగవతం జీర్ణించిన జీవులకు మరి ఇకలేదు మరోజన్మం....!
భాగవతం జీర్ణించిన జీవులకు మరి ఇకలేదు మరోజన్మం....!
ఆ తిరుసప్తగిరులపై తిరుగాడే శ్రీపాదాలు, ఈ భాగవతం లో తేలియాడు పద్యపాదాలు..!
ఆ గౌతమీతట వరభద్రగిరిపై కొలువైన వైకుంఠ రామబాణం, ఈ భాగవతం లోని గద్యగీర్వాణం..!
భాగవతం తో కరుగును మన కష్టాలు , కలుగును జీవనమధురిమలు, కనిపించును కైవల్యసోపానాలు ..!!
No comments:
Post a Comment