Vinay Kumar Aitha is with Paritala Gopi Krishna and 11 others.
శ్రీవారి సేవానంతర 2014-మార్చ్-16-ఫాల్గుణ పౌర్ణమి నాటి తిరుమల శేషాచల అభయారణ్యంలో నెలకొన్న తుంబురు తీర్థయాత్ర విశేషాలు...!
భాగవతార్ శ్రీమాన్ గోపికృష్ణ గురువుగారి నేతృత్వంలో స్వామివారి అనుగ్రహవిశేషంగా నాకు జీవితంలో 2వ సారి లభించిన 7 రోజుల తిరుమల శ్రీవారి సేవ ముగించుకొని, శ్రీ రేణుకుమార్ గారి ఆధ్వర్యంలో అప్పటి సేవకులందరం కలిసి అత్యంత మహిమాన్వితమైన తుంబురు తీర్థ యాత్రకు సమాయత్తమవుతున్న సందర్భం అది....
కొమ్మా తిరుప్పాల్ గారు అనే ఒక తి.తి.దే ఉద్యోగస్థులు మా టి.బి.పి శ్రీవారి సేవాబృందంపైగల అభిమానం తో సేవ అయినతర్వాత అందరికి తిరుమల గురించిన, సామాన్య భక్తులకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు విచిత్రాలు వివరిస్తూ తిరుమల శేషాచల అభయారణ్యంలో కొలువైన వివిధ మహిమాన్వితమైన తీర్థాల గురించి కూడా వివరించి, అనుకోకుండా కలిసివచ్చిన ఆ మరునాటి తుంబురు తీర్థ ముక్కోటి గురించి వివరించి వీలైన వారందరిని వెళ్ళమని చెప్పగా, చాలమంది కలిసి ఒక జట్టుగా వెళ్ళడం శ్రేయస్కరం అని చెప్పగా అందరం కలిసి శ్రీ రేణుకుమార్ గారి ఆధ్వర్యంలో వెళ్ళడానికి సిద్దమై పాపవినాశనం వరకు ఆర్.టి.సి బస్సుల్లో వెళ్ళి అక్కడ కొంతసేపు అందరు సేవకులు వచ్చేంతవరకు వేచి ఉన్నాం.... నా ఆధ్యాత్మికం బ్యాట్చ్ ఫ్రెండ్స్లో విజయి రాజ్ అనే నా మితృన్ని కూడా రమన్ని ముందే చెప్పగా, తను హైదరబాద్ నుండి ఆ సమయానికి తిరుమలకు వచ్చేసాడు.... అప్పటికే అక్కడ లలిత పారాయణం చేస్తూ మా సేవాబృందంలోని భాగవతులు శ్రీ కరుణశ్రీ అమ్మ గారు, శ్రీ ధుళిపాల లక్ష్మిగారు, ఇంకా కొందరు భాగవతులు కూర్చొనిఉండగా, నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి మధ్యలో జాయిన్ అయ్యి పారాయణం పూర్తి చేసి మిగతా అందరు భాగవతులు వచ్చాక, ఇక మా తుంబురు తీర్థ యాత్రకు శ్రీకారం చుట్టాం...
[ స్వామి అనుగ్రహంగా తను ఆరోజు రాకపోతే నాకు నిజంగా ఆ యాత్ర చాలా కఠినంగా అయ్యుండేది...మధ్యలో ఇంకనావల్ల నడవడం అవ్వదని ఆయాసంతో అలిసిపోయి కూర్చుండిపోయినప్పుడు, 'ఇలా అయితే అందరు ముందుకు వెళ్ళిపోతారు...పౌర్ణమి ఘడియలు కూడా వెళ్ళిపోతాయి... మనం మాత్రం ఇక్కడే అడివిలో ఉండిపోతాం అన్నయ్యా అని ధైర్యంచెప్పి నన్ను కొంచెంసేపు 'చల్ చల్ గుర్రం...చలాకి గుర్రం...' అనే చిన్నపటి ఆటలా తన భుజాలపై మోసుకొని మరి తీస్కెళ్ళాడు నా ఫ్రెండ్....!శ్రీవారి సేవానంతర 2014-ఫాల్గుణ పౌర్ణమి తిరుమల శేషాచల అభయారణ్యంలో నెలకొన్న తుంబురు తీర్థయాత్ర విశేషాలు...!

[ స్వామి అనుగ్రహంగా తను ఆరోజు రాకపోతే నాకు నిజంగా ఆ యాత్ర చాలా కఠినంగా అయ్యుండేది...మధ్యలో ఇంకనావల్ల నడవడం అవ్వదని ఆయాసంతో అలిసిపోయి కూర్చుండిపోయినప్పుడు, 'ఇలా అయితే అందరు ముందుకు వెళ్ళిపోతారు...పౌర్ణమి ఘడియలు కూడా వెళ్ళిపోతాయి... మనం మాత్రం ఇక్కడే అడివిలో ఉండిపోతాం అన్నయ్యా అని ధైర్యంచెప్పి నన్ను కొంచెంసేపు 'చల్ చల్ గుర్రం...చలాకి గుర్రం...' అనే చిన్నపటి ఆటలా తన భుజాలపై మోసుకొని మరి తీస్కెళ్ళాడు నా ఫ్రెండ్....!
ఆ క్లిష్ట సమయంలో అలిసిపోయిఉన్న నాకు అంతటి సహాయం చేసి పౌర్ణమి ఘడియల్లో పావనతీర్థం సేవించేలా చేసిన నా ఫ్రెండ్ కి ఎన్ని థాంక్స్ చెప్పినా సరిపోవు కాబట్టి, నా యాత్రలోని సగం పుణ్యం తనకే చెందుగాక అని తీర్థంచేరుకున్నాక సంకల్ప సహితంగా ప్రార్థించా స్వామిని.. :) ]
' చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి...', అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడమే తప్ప అలాంటి అడివిలోకి వెళ్ళడం జీవితంలో అదే మొట్టమొదటి సారి..! సంవత్సరంలో కేవలం ఆ తీర్థముక్కోటి రోజున మాత్రమే తిరుమల సెక్యురిటి / విజిలన్స్ అధికారులు భక్తులను అడివిలోనికి వెళ్ళేందుకు అనుమతిస్తారు..మిగతా రోజుల్లో నిషిద్దంకావడంతో ఎవరు పెద్దగా ఆ సాహసం చేయరు. (అప్పుడప్పుడు బృందాలుగా కొందరు అధికారుల అనుమతితో వెళ్తారని చదవడం/వినడం తెలుసు కాని, అది అంత శ్రేయస్కరం కాదని పెద్దల ఉవాచ)
మొదట్లో, అదేదో ఆకాశగంగా, పాపవాశనం లాగా పక్కనే ఉండే మరొక తీర్థమేమోలే అని అనుకున్నాను...బస్ సౌకర్యం లేకపోవడంతో నడుచుకుంటూ ఇలా వెళ్ళి అలా వచ్చేయొచ్చు అని అనుకున్న....తీరా వెళ్ళాకా తెలిసింది మేము ఈ ప్రపంచానికి సుదూరంగా 7+ గంటలు అడవిలోపలికి నడిచి మరో ప్రపంచానికే చేరుకున్నామని...!
వినువీధిలో ఫాల్గుణ పౌర్ణమి చంద్రుడు తన అమృతకిరణాలను వర్షిస్తుండగా అవి తుంబురు కోనలోని తీర్థ జలాలు తమలోకి స్వీకరించి తుంబుర తీర్థముక్కోటి ఘడియల్లో విశ్వంలోని అన్ని తీర్థాలు సూక్ష్మ రూపంలో తమ శక్తిని తుంబురు తీర్థ జలాల్లో నిక్షిప్తం చేసిన సమయం లో, వాటిని గురోక్త సంకల్ప సహితంగా ప్రార్ధించి,సేవించి, పానముచేసి, ఆ తీర్థముక్కోటికి మాత్రమే ఉండే అమేయమైన ప్రాణశక్తిని మన అణువణువులోకి స్వీకరించి శాశ్వతానుగ్రహం పొందడం అక్కడికి వెళ్ళే భక్తుల అప్పటి లక్ష్యం...
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల సారం జీర్ణంచేసుకున్న వారికి తెలిసినట్టుగా, మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తే, ఏ తీర్థయాత్ర కి వెళ్ళొస్తున్నరు అని అడుగుతారు తప్ప, ఏ క్షేత్రయాత్రకి వెళ్ళొచారు అని ఎవరు అడగరు... తీర్థానికి ఉన్న శక్తి అటువంటిదని మన పెద్దలు చెప్పడం పరిపాటి...
ఆ క్లిష్ట సమయంలో అలిసిపోయిఉన్న నాకు అంతటి సహాయం చేసి పౌర్ణమి పూర్ణకళల ఘడియల్లో పావనతీర్థం సేవించేలా చేసిన నా ఫ్రెండ్ కి ఎన్ని థాంక్స్ చెప్పినా సరిపోవు కాబట్టి, నా యాత్రలోని సగం పుణ్యం తనకే చెందుగాక అని తీర్థంచేరుకున్నాక సంకల్ప సహితంగా ప్రార్థించా స్వామిని.. :) ]
' చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి...', అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవడమే తప్ప అలాంటి అడివిలోకి వెళ్ళడం జీవితంలో అదే మొట్టమొదటి సారి..! సంవత్సరంలో కేవలం ఆ తీర్థముక్కోటి రోజున మాత్రమే తిరుమల విజిలన్స్ అధికారులు భక్తులను అడివిలోనికి వెళ్ళేందుకు అనుమతిస్తారు..మిగతా రోజుల్లో నిషిద్దంకావడంతో ఎవరు పెద్దగా ఆ సాహసం చేయరు. (అప్పుడప్పుడు బృందాలుగా కొందరు అధికారుల అనుమతితో వెళ్తారని చదవడం/వినడం తెలుసు కాని, అది అంత శ్రేయస్కరం కాదని పెద్దల ఉవాచ)
మొదట్లో, అదేదో ఆకాశగంగా, పాపవినాశనం లాగా పక్కనే ఉండే మరొక తీర్థమేమోలే అని అనుకున్నాను...బస్ సౌకర్యం లేకపోవడంతో నడుచుకుంటూ ఇలా వెళ్ళి అలా వచ్చేయొచ్చు అని అనుకున్న....తీరా వెళ్ళాకా తెలిసింది మేము ఈ ప్రపంచానికి సుదూరంగా 7+ గంటలు అడవిలోపలికి నడిచి మరో ప్రపంచానికే చేరుకున్నామని...!
వినువీధిలో ఫాల్గుణ పౌర్ణమి చంద్రుడు తన అమృతకిరణాలను వర్షిస్తుండగా అవి తుంబురు కోనలోని తీర్థ జలాలు తమలోకి స్వీకరించి తుంబుర తీర్థముక్కోటి ఘడియల్లో విశ్వంలోని అన్ని తీర్థాలు సూక్ష్మ రూపంలో తమ శక్తిని తుంబురు తీర్థ జలాల్లో నిక్షిప్తం చేసిన సమయం లో, వాటిని గురోక్త సంకల్ప సహితంగా ప్రార్ధించి,సేవించి, పానముచేసి, బహుళ తదియకు తరిగిపోయే పౌర్ణమి చంద్రకళతో ఆ ఒకటి/రెండు రోజులు మాత్రమే ఉండే అమేయమైన ప్రాణశక్తిని మన అణువణువులోకి స్వీకరించి శాశ్వతానుగ్రహం పొందడం అక్కడికి వెళ్ళే భక్తుల అప్పటి లక్ష్యం...
( శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల సారం జీర్ణంచేసుకున్న వారికి తెలిసినట్టుగా, మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తే, ఏ తీర్థయాత్ర కి వెళ్ళొస్తున్నారు అని అడుగుతారు తప్ప, ఏ క్షేత్రయాత్రకి వెళ్ళొచ్చారు అని ఎవరు అడగరు... తీర్ఠానికి ఉన్న శక్తి అటువంటిదని మన పెద్దలు చెప్పడం పరిపాటి...
స్వామి పుష్కరిణి మొదలుకొని ఆకాశగంగ, పాపనాశనం, పాండవతీర్థం ( తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు కొలువైన దెగ్గర ), శంఖు తీర్థం, చక్ర తీర్థం, నాగ తీర్థం (గజశాల వెనుక), ధృవతీర్థం (జపాలి హనుమాన్ ఆలయానికి వెనుక కొండ పైభాగాన), జపాలి తీర్థం, ఇలా తిరుమల ఆలయానికి సమీపంలో గల కొన్ని తీర్థాలు అందరికి చేరువలో ఉండి అనుగ్రహిస్తే, మరికొన్ని తీర్థాలు గహనమైన అరణ్యమార్గాల్లో ఉండడంవల్ల అవి మామూలు రోజుల్లో వెళ్ళడానికి వీలుకావు కాబట్టి, తిరుమల ఆలయ ఆచారం ప్రకారం వాటికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తీర్థముక్కోటి ఉత్సవం జరుపబడే సమయంలో వెళ్ళి దర్శించి సేవించడం ఉత్తమం అని పెద్దల మాట...
ఆ కోవకు చెందినవే సనకసనందన తీర్థం, రామకృష్ణ తీర్థం, పసుపుతీర్థం, కుమారధార తీర్థం, శేషతీర్థం, తుంబురు తీర్థం, ఇత్యాది అభయారణ్య స్థిత తిరుమల తీర్థరాజములు...!
మిగతా అన్ని తీర్థాల్లోకెల్ల తుంబురు తీర్థం చాలా విశేషమైన ప్రాధ్యాన్యత కలది అని, మహాతపస్విని శ్రీ తరిగొండ వెంగమాంబ గారు తమ శ్రీవేంకటాచల మాహాత్మ్యం లో కొనియాడారు...
ఒక్కొక్కరు ఒక్కోలా మాటలనడంతో తిరుమలలో జనుల మధ్య తపస్సు చేసుకోవడం బాగా ఇబ్బందిగా మారిందని స్వామిని ప్రార్ధిస్తే, సాక్షాత్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆ మహాభక్తురాలికి తుంబురు కోనను సూచించి అక్కడ ప్రశాంతంగా తపమాచరించి సిద్ధిని పొందమమని వరప్రసాదంగా ఇచ్చిన చోటు తుంబురు కోన...!
శ్రీ వైకుంఠం నుండి దిగివచ్చిన శ్రీవారు భువిపై తొలి అడుగు ఈ తుంబురు కోనలో మోపి, అక్కడ నారదముని శాపంచే తన తపశ్శక్తిని కోల్పోయి ఉన్న తుంబురుడిని అనుగ్రహించి, రెండవ అడుగు ' శిలాతోరణం ' దెగ్గర మోపి, ఇప్పుడున్న తిరుమల ఆలయ ప్రదేశం లో 3వ అడుగు వేసారన్నది అక్కడి పెద్దల మాట...
తుంబురుని తపశ్శక్తి, శ్రీ తరిగొండ వెంగమాంబ గారి తపశ్శక్తి, మరెందరో యోగుల, సిద్ధుల తపశ్శక్తి తో
పరిపుష్టమైన తుంబురు కోనలోని జలపాతం, ఫాల్గుణ పౌర్ణమి నాటి తీర్థముక్కోటి రోజున విశ్వంలోని సకలతీర్థాలు తమ సూక్ష్మాంశలతో అందులోకి ప్రవేశించి ఆ తీర్థ జలాలను మరింత దైవిక శక్తితో ఉద్దీపనం గావించుటవల్ల ఆ తుంబురు తీర్థ ముక్కోటికి ఎనలేని ప్రాధాన్యత అని ఎందరో పెద్దలు చెప్పిన మాట...ఈ కలి యుగం సర్వం కల్తీలమయం కాబట్టి, ఇలాంటి మహిమాన్వితమైన తీర్థ సేవనం తో పుణ్యార్జన చేసి తరించాలని మన పెద్దల మాట....! )
పాపనాశనం దెగ్గర సాయంత్రం శ్రీ లలిత సహస్రనామ పారాయణం ముగించుకొని, మా టి.బి.పి గ్రూప్ లోని సేవకులందరు రాగానే, స్వామిని ప్రార్థించి అందరం పాపనాశనం డ్యాం గేట్ ద్వారా తిరుమల అభయారణ్యంలోకి మా యాత్రను మొదలుపెట్టాం....
ఎందరో భక్తులు వడివడిగా తమ అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళడం, ముందుగానే వెళ్ళిన భక్తులు తీర్థాన్ని దర్శించి తిరిగివస్తూ ఎదురవ్వడంతో, 'ఇంకా ఎంత దూరం ఉందండి...?' అని వారిని మేమడుగుతుంటే చిన్న చిరునవ్వుతో వాళ్ళు, 'ఇప్పుడేగా మీరు మొదలుపెట్టింది....ఫాస్ట్ గా వెళ్తే మధ్యరాత్రికల్ల చేరుకుంటారులే...' అనడంతో...
ఇదొక సుదీర్ఘ యాత్ర అని అర్ధమయ్యి, ఒక మంచి ఎండుకర్రను చూస్కొని, చేతి కర్రగా అనువుగా చేసుకొని
ఇక మొదలుపెట్టాం మా పాదయాత్ర....
కొంచెం దూరం వెళ్ళాకా, ' సనకసనందన తీర్థం ' రావడంతో అక్కడ కాసేపు ఆగి, తీర్థాని సేవించి,
ఆ పక్కనే ' కాయరసాయన తీర్థం ' అదృశ్యరూపంలో కొలువైఉంటుందని, కేవలం సిద్ధులకు మాత్రమే దర్శనం ఇస్తుందని పెద్దలు చెప్పగా, ఆ తీర్థానికి ఒక నమస్కారం చేసుకొని, కొంచెం సేపు కూర్చొని గ్రూప్ అంతా సెల్ఫీలు దిగి కొంత విరామం తరువాత మలి మజిలి అయిన తుంబురు కోనకు మొదలుపెట్టాం మా నడక...
చంద్రోదయం కావడంతో ఆకాశంలో పౌర్ణమి చంద్రుడే మాకు టార్చ్ లైట్ గా ఉండి, సాలిగ్రామ కొండ అయిన తిరుగిరుల్లోని ఆ కాంతి పరావర్తనమే మాకు మెరిసే రేడియం స్టిక్కర్ల లాగా దారి చూపిస్తూ ఉండగా వడివడిగా ముందుకు సాగిపోతున్నాం...
రేణుగారు, శివ కుమార్, మహేష్, నేను, నా ఫ్రెండ్ విజయ్ రాజ్, కరుణశ్రీ గారు, లక్ష్మిగారు, ఇంకొందరు ఇలా అందరం కలిసి అందరి కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటూ, స్వామి వైభవం గురించి చర్చించుకుంటూ, అలా అక్కడక్కడా ఆగుతూ, తిరుమల అటవి సౌందర్యానికి ఆశ్చర్యం చెందుతూ అలా ముందుకు సాగిపోతున్నాం...
కొద్ది సేపు ఆధ్యాత్మిక అంత్యాక్షరి ఆడుతు నడుద్దాం అని, ధుళిపాల లక్ష్మిగారు చెప్పడం తో, భక్తి సాంగ్స్ / కీర్తనలు పాడుతూ వెళ్తుండగా, ' మ ' అక్షరం మీద నేను పాడాల్సివచ్చినప్పుడు ' " మరుగేలరా..ఓ రాఘవ...మరుగేల చరాచరరూప సూర్యసుధాకర లోచన...." అనే చోట ఎత్తుగడకు ఊపిరి సరిపోక స్వరభంగమైనప్పుడు, కరుణశ్రీ అమ్మగారు సున్నితంగా వారిస్తూ, ' వినయ్ నీకు ఊపిరి సరిపోవట్లేదమ్మ...పాడడం వద్దింక..మళ్ళీ నీకు ఆయాసం ఎక్కువైతే నడవడం కష్టమవుతుంది.... సంగీతం కన్నా నువ్వు సాహిత్యం లో చాలా బాగా రానిస్తావ్....అని ఆశీర్వదిస్తూ చెప్పగా...ఇక నా పాటల దుకాణం ఆపి, నడకపై శ్రద్ధ పెట్టి అర్ధరాత్రి కల్ల తుంబురు కోనకు దెగ్గరగ చేరుకొని విశ్రమించాలి కాబట్టి, మరింత వేగంగా ముందుకు సాగిపోతున్నాం....
దారిలో ఎన్నెన్ని ఆశ్చర్యాలో....! పెద్ద పెద్ద ఎర్ర చందనం వృక్షాలు కొట్టేయగా మిగిలిన ఆ వృక్ష కాండాన్ని తాకి, కొట్టేసిన గాయం మానడానికి చెట్టు మొత్తం మెహెంది పెట్టుకుందా అన్నట్టుగ ఉన్న ఆ ఎర్రదనాన్ని వింతగా చుస్తూ, ఆ సుగంధాన్ని ఆఘ్రానిస్తూ ముందుకు వెళ్తుండగా, రేణుగారు దెగ్గరికి వచ్చి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా, కళ్ళు పెద్దవి చేసుకొని నడవండి అని చెప్పగా, ఎందుకబ్బా అని కుడివైపు చూడగా ఎంత పెద్ద అగాధమో..! పొరపాటున అడుగు సడలిందా కొన్ని వేల ఫీట్ల లోయలోకి ఇక గోవిందా గోవిందా...! వామ్మో అందుకోసమా ఈ హెచ్చరిక అని సముదాయించుకొని కొన్ని నీళ్ళు తాగి, ఆ లోయ ఉన్నంతవరకు అత్యంత జాగ్రత్తగా, శివాలయం లోని సోమప్రదక్షిణం లా, అడుగుతీసి అడుగు వేస్తూ ముందుకు సాగిపోయాం... ఆ లోయకు అవతలి వైపు చూపు సారించి చూస్తే, దూరంగా పెద్ద పెద్ద గుహలు, వాటికి సమీపంగా పారుతున్న సెలయేరు, ఎవరో అక్కడ తపస్సు చేసారనడానికి ఉన్న ఆనవాళ్ళు, అచ్చం శ్రీశైలం లో మహాతపస్విని అక్కమహాదేవి తపమాచరించిన గుహల లా కనిపించడం తో, వాటికి ఒక నమస్కారం చేస్కొని ముందుకు సాగిపోయాను....
నా అడుగుల్లో వేగం కాస్త నా ఊపిరి కూడా అందుకొని, నేనెందుకు వేగం గా ఉండొద్దు అని అది ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది... వామ్మో ఈ ఆయాసం తో నడవడం ఇంక నావల్లకాదుర దేవుడా...గోవిందా ఇక్కడే నిద్రపోతా ఇంకా.... అని ఏదేదో గొణుగుతూఉండగా, నా ఫ్రెండ్ విజయ్ రాజ్ నాకు నచ్చజెప్పి, ఇందుకోసమా అన్నయ్య ఇంత దూరం కష్టపడినడిచింది....హుం...ఇలా అయితే ఇంకొక రోజు కూడా నడుస్తూనే ఉండిపోవాలి...కొంచెం దూరం నేను ఎత్తుకుంటా పదండి అని నన్ను చిన్న స్కూల్ పిల్లాడిలా 'చల్ చల్ గుర్రం... ' అంటూ ముందుకు తీస్కేళ్ళిపోయాడు...! ఇద్దరం నవ్వుకొని కొంచెం సేపు ఆగి, హనుమాన్ చాలీసా పారాయణం చేసి, ఇక తుంబురు కోన చేరేంతవరకు ఆగేది లేదు...హనుమ లంకా తీరానికి చేసిన సాగరలంఘనం లా, అని తమాయించుకొని, ముందుకు వెళ్ళిపోయాం....!
ముందుకు వెళ్తూ ఉండగా ఒకదెగ్గర చిన్న గుట్టలాంటి ప్రదేశం రావడంతో, అది ఎక్కి మొత్తం ఏడుకొండలు ఒకసారి చుద్దామనుకొని, పైకి ఎక్కి వెనక్కి తిరిగి చూడగా ఒక్కసారిగా నాకు మేము గంటలతరబడి నడిచిన మార్గంలోని లోయలు, పర్వతాలు అన్ని చూసేసరికి... వామ్మో మేమేనా ఇదంతా నడిచి ఇక్కడివరకు చేరుకుంది...మేమున్నది ఈ భూప్రపంచంలోనేనా మరేదైనా ఇతర జీవ గ్రహానికి వచ్చేసామా ' అవతార్ ' లాంటి సినిమాల్లో చూసినట్టుగా, అన్నట్టు పౌర్ణమి చంద్రుని చల్లని కిరణాల వెలుగుజిలుగుల్లో తణుకులీనుతున్న ఆ ఏడుకొండల ఆశ్చర్యప్రభలను వీక్షించి అలౌకికమైన తన్మయత్వానికి లోనైన ఆ సందర్భం చిరకాల వైభవస్మృతి...!
ఒక 7 - 8 గంటల నడక తర్వాత అర్ధరాత్రి 12 - 1 అయ్యేసరికి తుంబురు కోనకు సమీపంగా ఒక పీఠభూమి లాంటి చదునైన ప్రదేశానికి చేరుకున్నం...అక్కడ కొందరు తమిళ భక్తులు / చిత్తూర్ భక్తులు / టి.టి.డి కి అనుబంధంగా వచ్చిన స్వఛ్ఛందసేవకులు / బసకు ఏర్పాటు చేసినట్టుగా, చిన్నపాటి గుడారాలు, వంట సామాగ్రి, నీళ్ళు మొదలైనవన్ని ఉండగా రేణుగారు వచ్చి ఇక ఇక్కడే రాత్రికి మన బస, కొంచెం విశ్రాంతి తీసుకొని పొద్దున్నే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దెగ్గరే ఉన్న తుంబురు తీర్థానికి వెళ్ళి, పూజ/ప్రార్థనలు అన్ని చేసుకొని, తీర్థాన్ని సేవించి బాటిల్లల్లో పట్టుకొని, మరునాడు మధ్యాహ్నం అయ్యేసరికైనా పాపనాశనం చేరుకోవాలి....ఎందుకంటే సూర్యుని ప్రతాపానికి, రాత్రి ఉన్నంత హాయిగా పగలు నడక ఉండదు కాబట్టి.... అలా తిరుగు ప్రయాణం చేయాలి అని చెప్పగా, అక్కడే ఒకచోట అందరు పెద్దవాళ్ళకు అనువైన స్థలం చూపించి, మేము కూడా ఆ పక్కనే ఒక తెల్లని బండరాయికి దెగ్గరగా నిద్రకు ఉపకరించాము.... జీవితం లో మొట్టమొదటి సారి అలా దట్టమైన అడవిలో, నడిరేయిలో, పెద్ద పెద్ద చెట్ల మధ్యనుండి దోబూచులాడుతున్న చంద్రుని వెన్నెలను చూస్తూ, కొంచెం చలికి వణుకుతూ, ఆకాశమంతా శ్రీనివాసుని నీలమేనిలా ఉండి, మిలమిల మెరిసే తారకలన్ని స్వామి తిరుమేనిపై అలంకరించబడిన వజ్రాల్లా మెరుస్తూ ఉంటే అవి చూస్తూ ఇంక నిద్రేక్కడ పడ్తుంది....ఒక వైపు ఎప్పుడెప్పుడు పొద్దునే లేచి తీర్థానికి వెళ్దామా అని ఆలోచిస్తూ, మరోవైపు జీవితంలో అప్పుడు ఎదురీదుతున్న కష్టాలగురించి అలా ఏవో చర్చించుకుంటూ, అర్ధరాత్రి ఏ పులో, సిమ్హమో, ఎలుగుబంటో, అడవిపందో, వస్తే ఎట్లా.... ఇంక మన పని గోవింద గోవింద... కదా.... అని ఏవో జోకులు వేసుకుంటూ, స్వామి మీదే భారంవేసి మెల్లగా చిన్న నిద్రలోకి జారుకున్నాం నేను, నా ఫ్రెండ్ విజయ్ రాజ్, రేణుగారు...
( చిన్నప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్ లో భద్రాద్రి-కొత్తగుడెంలో మా చిన్న మామతో ఒకసారి కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్ళినరోజులు గుర్తొచ్చాయి, ఆ దట్టమైన అడవిని చూస్తూ.... )
నడిచి నడిచి బాగా అలిసిపోయిన తనువు కదా, అట్టే మగతనిద్రలోకి వెళ్ళిపోయింది..!
పొద్దున్నే పక్షుల కలకూజితముల మధ్య, అబ్బా... అప్పుడే తెల్లారిందా... అనుకుంటూ మెల్లగా కన్నులు విచ్చి చూడగా, ఆకుపచ్చని అడవికాంత స్వాగతం పలుకుతున్నట్టుగా, ఆ హరిత పరిసరాలను చూసి ఒక్కసారిగ ఆశ్చర్యం...!
కనుచూపు మేర ఆకాశాన్ని తాకుతున్నయా అన్నట్టుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లు, కొండలను చూడగా, రాత్రి నడిచిన అలసట అంతా మాయం...లేటైతే తిరుగుప్రయాణంలో ఎండ ఎక్కువైతుందని, గబా గబా కాలకృత్యాలు తీర్చుకొని, జలంతో ప్రోక్షణ స్నానం చేసి, అక్కడ ప్రసాదంగా పెట్టిన పొంగల్ కొంచెం సేపు అలా కూర్చొని తిని, ముందుకు వెళ్ళిపోయాం...మధ్యలో రెండు పేద్ద మహా జంట వృక్షాలు కొన్ని వందల ఏళ్ళ నాటివని, వాటిని రామలక్ష్మణ చెట్లు అంటారని అక్కడి వారు చెప్పగా, ఒకసారి నమస్కారం, ప్రదక్షిణం చేసి మరింతముందుకు వెళ్ళగా పెద్ద పెద్ద వల్మీకములను చూసి, వామ్మో ఇంత పెద్ద చీమల పుట్టలు కూడా ఉంటాయా లోకంలో...ఇందులో ఎన్ని పాములు ఉన్నాయో అని దూరంగానే వాటికి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళాం...
రానే వచ్చింది తుంబురు కోన...! ఒక మహ పర్వతాన్ని అర్జునుడు తన గాండీవంతో విల్లు ఎక్కుపెట్టి ఆగ్నేయాస్త్రంతో రెండు ముక్కలుగా చేసాడా అన్నట్టుగా, గంధపు వర్ణంలో మెరిసిపోతూ మధ్యన పాదచారులకు మాత్రమే అన్నట్టుగా సన్నని దారిని వదిలి, ప్రవహిస్తున్న తుంబురు తీర్థ జలాలు మాకు స్వాగతం పలకడం తో, హమ్మయ్య మా తుది మజిలి ఇక దెగ్గరే అని ముందుకు సాగిపోతున్నాం...ఇంకొంచెం వేగంగా వెళ్దామని అనుకుంటే, కాదు కాదు ఇక్కడ నిదానమే ప్రధానం అన్నట్టుగా దారి మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళతో, అడుగు సరిగ్గా వేయకపోతే సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ తుంబురుతీర్థ జల ప్రవాహంలో జారిపోయి ఎంత లోతుందో తెలియని నీటిగుంటల్లో పడిపోతాం కాబట్టి అత్యంత జాగ్రత్తగా అడుగులోఅడుగు వేస్తు ముందుకు వెళ్ళాం... మొత్తానికి రానే వచ్చింది ఆ తుంబురు తీర్థ ఉద్గమస్థానం... ఒక చిన్నపాటి కొండగుహను చీల్చుకొని అప్రతిహతంగా ఎగిసిపడుతున్న ఆ జలపాతం దెగ్గర అస్సలు కదలడానికి వీలులేనంతగా భక్తజనులు ఇరుక్కుపోయి బాటిల్లల్లో ఆ నీళ్ళు పట్టుకొని, అక్కడే సచేలస్నానం చేస్తూ ఉండడం చూసి చాలా మంది పెద్దలు ఆ గుంపులో, తొక్కిసలాటలో ముందుకువెళ్ళడం అసంభవం అని తలచి కొద్దిగా దూరంగానే ఉండి, కింద ప్రవహిస్తున్న జలమే స్వీకరించి అక్కడే మొక్కి వెనక్కు తిరుగుప్రయాణం బాట పట్టారు...
ఎదురుగా కొండగుహలోనుండి విరజిమ్ముకొని వస్తున్న ఆ జలపాతాన్ని చూసి, ఇంత దూరం ప్రయాసపడి వచ్చింది భూసంపర్కం పొందిన తీర్థజలాన్ని తీస్కెళ్ళడానికా...అని నసుగుతూ...6 నూరైనా సరే ఎట్లైనాసరే ఆ కొద్ది దూరం కూడా వెళ్ళి, ఆ జలధారలకిందే సంకల్పసహితంగా సచేలస్నానం చేసి, నా బాటిల్లో అవి నింపుకొని రావాలి అన్నది నా బెట్టు....ఏం కాదులే విజయ్ మనం కూడా అందరిలా తోసుకుంటూ ముందుకు వెళ్దాం పదా అని చెప్పి విజయ్ ని కూడా వెంటబెట్టుకొని ఆ గుంపులోకి జై హనుమాన్ అనుకుంటూ దూసుకుపోయాం....
అందరిని తోస్కొని కొంచెం ముందుకు వెళ్ళగా, మొత్తనికి ఆ చిన్న గుహలాంటి ప్రదేశంలోకి చేరుకొని తల ఆ జలధారలకింద పెట్టగానే ఎగిసిపడుతున్న ఆ నీటివేగానికి ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది..! మెల్లగా తమాయించుకొని కొంచెం సన్నగా ధారలు మీదపడేలా నిల్చొని హాయిగా సంకల్ప సహితంగా తీర్థస్నానం చేసి, మా బాటిల్స్ ఫుల్లుగా నింపుకొని, నేను, విజయ్ మళ్ళి అంతే వేగంగా గుంపులో అందరిని తోసుకుంటూ బతుకుజీవుడా అనుకుంటూ బయటకు వచ్చేసాం...
అక్కడ పక్కన కొంచెం సేపు కొండలకింద నిల్చొని తలతుడుచుకొని, మొత్తం తుంబురు కోనను ఆశ్చర్యంతో తిలకిస్తూ, అక్కడే ఉన్న తుంబురు మూర్తికి నమస్కారం / ప్రార్థనలు చేసి,
జీవితంలో ఎప్పుడూ చేయని అంతటి గొప్ప తీర్థయాత్రను సఫలీకృతం చేసినందుకు అడవితల్లికి, క్షేమంగా మళ్ళి తిరుమలకు చేర్చమని నమస్కరించి మెల్లగా నడుచుకుంటూ అదే బాటలో తిరుగుప్రయాణం మొదలుపెట్టి, భానుడు భగ భగ మంటూ మధ్యాహ్న మార్తండుడిగా మారకముందే, పాపనాశనానికి చేరుకోవాలి కాబట్టి త్వరత్వరగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాం.... సగం దూరం రాగా, మధ్యలో 'రామకృష్ణతీర్థానికి ' దారి అంటూ టి.టి.డి వారు ఏర్పాటు చేసిన ఒక సూచికను చూసి, స్వామి ఈ తీర్థముక్కోటికి కూడా ఇంకోసారి అనుగ్రహించవా అని ఒక నమస్కారం చేసి, పాపనాశనం, అట్నుండి తిరుమలకు చేరుకోవడంతో మా తుంబురు తీర్థయాత్రను పరిపూర్ణం చేసాడు ఆ గోవిందుడు..! :)
తమ తిరుమల యాత్రను, తిరుమల తీర్థముల ప్రాశస్త్యాన్ని కొనియాడుతూ, అన్నమాచార్యులవారు రచించిన 'కంటి అఖిలాండకర్తనధికుని కంటి...కంటినఘములు వీడుకొంటి..నిజమూర్తికంటి...!' అనే కీర్తనలో, తిరుమల వైభవమంతా గోచరిస్తుందని నా భావన...
:)

![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/fa5/1.5/16/1f642.png)
No comments:
Post a Comment