"శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆయుష్మాన్ భవ అఖండసౌభాగ్యసిద్ధిరస్తు....." అంటూ ,
ఇలా జీవితాంతం నమస్కరించిన వారందరిని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తు బ్రతికేది అర్చకులు / వేదవిదులు / ఆచార్యులు / గురువులు...ఏ పుట్టలో ఏ పాముందో అది బయటకు వచ్చేంతవరకు తెలియదు...అట్లే, ఏ గాయత్రి ఉపాసకుని శక్తి ఎంత ఘనమైనదో అది వారి అనుగ్రహరూపేన ఫలించేంతవరకు ఎవరికి తెలియదు.....
ఇలా జీవితాంతం నమస్కరించిన వారందరిని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తు బ్రతికేది అర్చకులు / వేదవిదులు / ఆచార్యులు / గురువులు...ఏ పుట్టలో ఏ పాముందో అది బయటకు వచ్చేంతవరకు తెలియదు...అట్లే, ఏ గాయత్రి ఉపాసకుని శక్తి ఎంత ఘనమైనదో అది వారి అనుగ్రహరూపేన ఫలించేంతవరకు ఎవరికి తెలియదు.....
ఇది ఈ వేద భూమికి మాత్రమే ఉన్న వైశిష్ట్యం...! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
మనకు చిన్నప్పుడు స్కూల్లో పెద్దగా ఏమి రానప్పుడు, అలాకాదుర..ఇలా చదవాలి..ఇలా రాయాలి...., అని పలక బలపం పట్టించి లౌకిక విద్య నేర్పిన గురువులు మనకు సదా గుర్తుండిపోతారు...మన భావి జీవితంలో ఎన్ని పై చదువులు చదువుకున్నప్పటికీ, ఆ మొట్టమొదట అక్షరానుగ్రహం అందించిన వారిని మనం అస్సలు మరచిపోలేము. ఎందుకంటే వారు అనుగ్రహించిన ఆ చిన్న చిన్న అక్షర బిందువులు జాగ్రత్తగా అందిపుచుకున్న మనం, ఆ తర్వాత విశ్వవిద్యాలయ చదువుల వరకు కూడా వెళ్ళగలిగాం...
నాసిక్ త్రయంబక్ లోని బ్రహ్మగిరి పర్వతసానువుల్లో, చిన్నగా గోముఖం నుండి రాలే నీటిబిందువులే, క్రింద త్రయంబకేశ్వరాలయంలో గుప్తగోదావరి గా ప్రభవించి, భద్రాచాలం / రాజమహేంద్రి / ధవళేశ్వరం వచ్చేసరికి సువిశాల అఖండ గోదావరి గా భారతదేశపు 2 వ అతిపెద్ద జీవనది గా రూపాంతరం చెందినట్టుగా...!![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
నాసిక్ త్రయంబక్ లోని బ్రహ్మగిరి పర్వతసానువుల్లో, చిన్నగా గోముఖం నుండి రాలే నీటిబిందువులే, క్రింద త్రయంబకేశ్వరాలయంలో గుప్తగోదావరి గా ప్రభవించి, భద్రాచాలం / రాజమహేంద్రి / ధవళేశ్వరం వచ్చేసరికి సువిశాల అఖండ గోదావరి గా భారతదేశపు 2 వ అతిపెద్ద జీవనది గా రూపాంతరం చెందినట్టుగా...!
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
అదే విధంగా ప్రతి ఆస్తికజీవుడికి అధ్యాత్మ విద్యా ఒనమాలు నేర్పిన వారు కూడా అలా ఎప్పటికి గుర్తుండిపోతారు....
స్తోత్రాలు, సూక్తాల నుండి, వేదాంతవర్ణనలు వరకు రావాడానికి ముందు, మనకు ఏమి తెలియని రోజుల్లో, సహాయం చేసిన వారు కూడా అలా చిన్ననాటి స్కూల్ టీచర్ల లాగ గుర్తుండి పోతారు....
స్తోత్రాలు, సూక్తాల నుండి, వేదాంతవర్ణనలు వరకు రావాడానికి ముందు, మనకు ఏమి తెలియని రోజుల్లో, సహాయం చేసిన వారు కూడా అలా చిన్ననాటి స్కూల్ టీచర్ల లాగ గుర్తుండి పోతారు....
గత ~ 20 సంవత్సరాల నుండి రెగ్యులర్ గా వెళ్ళే మా ఇంటిదెగ్గరి సాయిబాబా గుడిలో, అధ్యాత్మవిద్యా విషయపరిజ్ఞ్యానం ఏమి లేని ఆ చిన్ననాటి రోజుల్లో, అంటే నా 7త్ / 8త్ క్లాస్ నుండి బి.టెక్ తదుపరి రోజుల వరకు, కేవలం వెళ్ళడం, బాబా సన్నిధిని శుభ్రపరచడం, బాబా ఉయ్యాల లో ఉండే హారతి బుక్ తీస్కొని మధ్యాహ్న / సంధ్యా / శేజ్ హారతి చదవడం, బాబా పల్లకి సేవ లో పాల్గొనడం, బాబా చాలీసా పారాయణం చేయడం..... ఇలా చేసే రోజుల్లో, రాజాస్వామి గారు అనే ఒక ఆచార్యులు బాబా ఆలయంలో కొత్తగా ఆర్చకులుగా వచ్చారు.... వారు వచ్చాకే నాకు ఆ గుడిలో బాబా సత్చరిత్ర పారాయణ అనుగ్రహం లభించింది... బాబా నిత్యారాధనలో ఎక్కడా ఏ విధమైన లోటురాకుండా, అన్నీ పద్దతిగా, సక్రమంగా, అక్షరదోషాదులు లేకుండా, ఓపికతో అర్చించే వారిని చూసినప్పుడల్లా నాకు మహల్సాపతి గుర్తుకువచ్చేవారు....
ప్రతి గురువారం సంధ్య హారతి అయ్యాక, ఢాం అని నేలకేసి గట్టిగా ఒక కొబ్బరికాయ పగలగొట్టి, బాబా పల్లకి సేవ ప్రారంభించి, భజనలతో బాబా పల్లకిని చిత్తారమ్మ గుడిమీదుగా ప్రదక్షిణపూర్వకంగా తీస్కెళ్ళడం, రాజాస్వామి గారు అర్చకులుగా వచ్చాక అక్కడ స్థిరీకరించబడిన సంప్రదాయం...
వారు ఒక పాట...నేనొక పాట..ఇతర భక్తులు ఒక పాట, అలా చిడతలు వాయిస్తూ వెళ్ళే ఆ రోజుల్లోనే, భజన సంప్రదాయంలో భగవంతుని సులువుగా సాధించవచ్చనే విషయం నాకు బోధపడిన ఆ తొలి అధ్యాత్మ బీజమే నా చిరకాల జ్ఞ్యాన నేస్తమై అన్నమయ్య కీర్తనలపై మక్కువ కలిగించి, తదంతర కాలంలో అన్నమార్యుల కృతులలో గల గహనమైన భగవద్ తత్వాన్ని సులభగ్రాహ్యం చేసింది...![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
వారు ఒక పాట...నేనొక పాట..ఇతర భక్తులు ఒక పాట, అలా చిడతలు వాయిస్తూ వెళ్ళే ఆ రోజుల్లోనే, భజన సంప్రదాయంలో భగవంతుని సులువుగా సాధించవచ్చనే విషయం నాకు బోధపడిన ఆ తొలి అధ్యాత్మ బీజమే నా చిరకాల జ్ఞ్యాన నేస్తమై అన్నమయ్య కీర్తనలపై మక్కువ కలిగించి, తదంతర కాలంలో అన్నమార్యుల కృతులలో గల గహనమైన భగవద్ తత్వాన్ని సులభగ్రాహ్యం చేసింది...
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
సంగీత నేపథ్యమున్న ఒక గాయని గారు ఆ రోజుల్లో, బాబా సన్నిధిలోని సాయంత్రం భజనలో, ' చిన్ని చిన్ని అడుగులు వేస్తు..సాయి రావయ్య..సాయి బాబా రావయ్య.....' అనే పాట ఎంతో మధురంగా అలాపిస్తునప్పుడు, మహల్సాపతి లా రాజాస్వామి గారు చేసిన అర్చనకు, లక్షీబాయి లా ఆలపించిన ఆ గాయనిమణి గీతానికి, నిజంగా ఆ సాయి బాబా యే షిరిడినుండి కదిలి వచ్చి మా ఎదుట వీరాసనం వేసుకుని కూర్చున్నారు అని అనిపించేది.... నాకైతే నిజంగానే నమ్ముకున్న ఆ సాయి బాబా యే తదంతరకాలం లో శ్రీ చాగంటి సద్గురువులుగా జీవితంలోకి ప్రవేశించి , వారి సద్ బోధలే జ్ఞ్యాన దిక్సూచియై అప్పటినుండి నా అధ్యాత్మ ప్రయాణానికి అలుపెరగని నేస్తంగా ఉండి, దిటవైన ఆలంబన అందించి ప్రార్ధనలు సఫలీకృతమయ్యేలా చేసిన ఆ స్మృతులు సదా స్మరణీయములు....
ఏ విధంగా ఆకాశానిది ఒక నిర్ధిష్టమైన పరిధి, రూపు, రంగు, ఇత్యాది మరేవిధమైన ఇతర లౌకికమైన అంశానికి కట్టుబడని తత్వమో, సద్గురువులది, దైవానిది, కూడా అదే తత్వం....!!
అది మన యొక్క సమస్త లౌకిక సంపదలను పక్కనపెట్టి, నిర్మలభక్తి అనే పాత్రను చేబట్టి, తలవంచి గురువులకు / దైవానికి నమస్కరించి, ప్రార్ధించడం వచ్చిన వారికి మాత్రమే లభించే, స్వాతిచినుకు సోకిన భూగంధాఘ్రానిత మనోస్వాంతన తాలుకు జ్ఞ్యాన పరిమళం...!
గురుబోధలను / దైవానుగ్రహాన్ని, విశ్వాసం తో కాకుండా, కేవల తర్కం తో స్వీకరించాలి అనుకునే వారికి, దైవం చాలా కాలం వరకు ఒక గుడికి / బింబానికి / మూర్తికి మాత్రమే పరిమితమయ్యే అంశం....అది కొన్ని సంవత్సరాలే అవ్వొచ్చు..కొన్ని జన్మలే అవ్వొచ్చు....!
కొందరు తెలియని వారు ఆకాశాన్ని ' శూన్యము ' అని వర్ణిస్తారు...లౌకిక కొలమానాలకి అందదు కాబట్టి ...
కాని, తెలిసిన వారు అది ' పరిపూర్ణము ' అని అభివర్ణిస్తారు...మనకు అందే అన్ని లౌకిక సంపదలు ఆకాశ జనితములే అని తెలుసుకున్నరు కాబట్టి...
( చాల కాలం తర్వాత అదే గుడిలో ఆ రాజాస్వామి వారి దర్శన భాగ్యం ఇవ్వాళ లభించిన ఒక చిరు మధురస్మృతి కవనం....
)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
===============================================
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 14 ||
===============================================
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 14 ||
===============================================
No comments:
Post a Comment