5 రోజుల ఆనందహేల దీపావళి పండగ...
ఒక పాత సినిమా పాటలో అన్నట్టుగా
" చీకటి వెలుగుల రంగేళి...జీవితమే ఒక దీపావళి...మన జీవితమే ఒక దీపావళి... " 😊
" చీకటి వెలుగుల రంగేళి...జీవితమే ఒక దీపావళి...మన జీవితమే ఒక దీపావళి... " 😊
ధనత్రయోదశి (ధన్ తేరస్) / నరక చతుర్దశి / దీపావళి ( దివాళి ) / బలి పాడ్యమి / యమద్వితీయ (భాయ్ దూజ్)....
ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా భారతదేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచంలో ఇతర చోట్ల కూడా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది ఈ దీపావళి...!
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల దీపావళి సంబంధిత ప్రవచానాలు విన్నవారికి తెలిసినట్టుగా, దీపముల /దివ్వెల ఆవళి ( వరుస ) ని దీపావళి అనడం పరిపాటి.... ఇక తత్ సంబంధ వివిధ క్రతువులు ఏ విధంగా జరుపుకోవాలో, వాటి వెనక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు లాంటివి సద్గురువులు తమ ప్రవచన్నాల్లో విపులంగా చెప్పడం వినే ఉంటారు అందరు....
ఏదైనా పండగ అనగానే ఎవ్వరికైనా తమ చిన్ననాటి పండగ సెలవుల అనాటి ఆపాత మధురాలు స్మృతిలో సందడి చేయడం కద్దు....
నాక్కూడా అలాగే ఉండేది ఒక అందమైన బాల్యం...
బాధ్యతలు, కర్తవ్యాలు, జీవితపు ఆటుపోట్లు, నిలదొక్కుకోవడాలు, విధిరాతలు, భావావేశాలు, ఇత్యాది పెద్ద పెద్ద పదాలు ఇంకా జీవితంలోకి ప్రవేశించని 10వ తరగతి వరకు ఉన్న మధురమైన రోజులవి.....
బాధ్యతలు, కర్తవ్యాలు, జీవితపు ఆటుపోట్లు, నిలదొక్కుకోవడాలు, విధిరాతలు, భావావేశాలు, ఇత్యాది పెద్ద పెద్ద పదాలు ఇంకా జీవితంలోకి ప్రవేశించని 10వ తరగతి వరకు ఉన్న మధురమైన రోజులవి.....
ఇంటికి ఓ 5 నిమిషాల దూరంలోనే ఉండే ' రాజధాని స్కూల్ ' లో 1 నుండి 10 వ తరగతి చదువుల మధ్య సాగిన ఆ నాటి పండగ రోజుల్లో లభించిన స్మృతుల్లో ఎన్ని అధ్యాత్మవిద్యా విషయాలు తెలియకనే తెలుసుకున్నమో ఈనాడు వాటిని నెమరు వేస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగకమానదు...!
కొత్త బట్టలు, పేనీలు / స్వీట్ డబ్బాలు, పటాకీలు, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురుచూడడం.... ఇది అన్ని సంవత్సరాల దీపావళి కి ఉండే కామన్ మెను...కొన్నే కొనిస్తే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ పటాకీలు కాల్చడం షురుచేస్తారు పిల్లలు...మళ్ళీ చెయ్యొ కాలో కాలితే అదొక తలనొప్పి ఎందుకని, పెద్ద పెద్ద కవర్ల నిండా నాన్న ని సనత్నగర్ గోకుల్ ఫైర్ వర్క్స్ నుండి అన్ని రకాల పటాకీలు తెమ్మని చెప్పేది అమ్మ....( ఎక్కువ సౌండ్ వచ్చే సుతిల్ బాంబులు లాంటివి తప్ప )... ఇక మా లిస్ట్ లో ఆల్మోస్ట్ అన్ని రాకాలు ఉండేవి... చిన్న కాకరపుల్లల / పెద్ద సుర్ సుర్ బత్తీలతో మొదలుకొని, చిచ్చుబుడ్డీలు (చిన్నవి / పెద్దవి ), పాములు, పెన్సిళ్ళు, తాళ్ళు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మిర్చి బాంబుల పాకెట్లు, రాకెట్లు, లక్ష్మి బాంబులు, గన్లోకి రీల్ డబ్బాలు,ఉల్లిగడ్డబాంబులు, 1000 వాలా లడీలు, ఇలా అన్ని రకాలతో ఇంటికి కవర్లు రావడమే ఆలస్యం, అన్నిటిని కింద కుమ్మరించి ఒక కవర్లో నేను, ఇంకో కవర్లో తమ్ముడు, అన్ని చెరి సగం సమానంగా పంచుకొని, ఎవరి అగరువత్తులు వాళ్ళు వెలిగించి, సాయంత్రం అమ్మ ఇంటి నిండ దీపాలు పెట్టగానే, ఇక మా ఢాం ఢాం షురు అయిపొయేది...
రాత్రి 12 / 1 అయ్యేవరకు కూడా కాలుస్తూనే ఉండేవాళ్ళం....లాస్ట్ కి మిగిలిన కొన్ని కార్తీక పౌర్ణమి రోజు కాల్చడానికి ఇంట్లో సజ్జపైన ఎవరివి వారు కనిపించకుండా దాచుకునేవాళ్ళం.... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
మరునాడు పొద్దున్నే లేచి వాకిలిచూస్తే మొత్తం పేపర్లమయం... నేను / తమ్ముడు వెంటనే, ఏమైనా కాలకుండా ఉండిపోయిన మిర్చి బాంబులు ఉన్నయేమో అని చూసి, అవి అన్ని ఏరి ఆ రోజు రాత్రికి కాల్చే వాళ్ళం..! 😁
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
మరునాడు పొద్దున్నే లేచి వాకిలిచూస్తే మొత్తం పేపర్లమయం... నేను / తమ్ముడు వెంటనే, ఏమైనా కాలకుండా ఉండిపోయిన మిర్చి బాంబులు ఉన్నయేమో అని చూసి, అవి అన్ని ఏరి ఆ రోజు రాత్రికి కాల్చే వాళ్ళం..! 😁
ఇంటర్ నుండి సీరియస్ గా చదువుల్లోనే మునుగిపోయిన ప్రపంచం కావడం, రాను రాను ఆ పొగ కూడా అస్సలు పడకపోవడం తో మెల్లగా అన్నిటికి దూరమై, ఏదో 2 చిచ్చుబుడ్డీలు కాల్చి వెంటనే ఇంట్లోకి వెళ్ళి ముక్కుమూస్కోని ఉండిపోవడమే దీపావళి అయిపోయింది.... అలా పటాకీలకు దూరం అయ్యాను కాని, జీవితంలోకి అవి నేర్పుతూ వస్తున్న ఆధ్యాతిక సందేశానికి మాత్రం చాల దెగ్గరై, వేదాంత రహస్యాలను అత్యంత సులువుగా వివరించే సద్గురువుల వాక్కుల లాగా అవి కూడా ప్రతి సంవత్సరం వాటి విరక్తిభాష్యాన్ని వంటబట్టిస్తూ వినువీధీలో వెలిగే అమావాస్య నాటి తత్కాల తారల్లాగ మంచి మితృలై సదా మది లోనే ఉండిపోయాయి... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
" పటాకీల్లో పరతత్వమా...? " నువ్వూ... నీ వెర్రి... కాకపోతే, అని మరీ అలా తీసిపడేయకండి....
ఒక కవి అన్నట్టుగా, తరచి చూస్తే ప్రతి అణువులో పరతత్వమే దాగుంది...అది తెలియనంతవరకే మనకు అది పరమాణువు గా విఛ్ఛిన్నమయ్యే పదార్థం...
తెలిసిన మరుక్షణం అది అచ్యుతమైన ఆత్మ తత్వమే...!
ఒక కవి అన్నట్టుగా, తరచి చూస్తే ప్రతి అణువులో పరతత్వమే దాగుంది...అది తెలియనంతవరకే మనకు అది పరమాణువు గా విఛ్ఛిన్నమయ్యే పదార్థం...
తెలిసిన మరుక్షణం అది అచ్యుతమైన ఆత్మ తత్వమే...!
పటాకీలు పలు విధాలు - కాని అన్నీ చివరకు ఇచ్చేవి మాత్రం కాంతి - వెలుగులు / శబ్దం - ధ్వనులు.... పేలిన తర్వాత మిగిలేవి పేపర్ కుప్పలు...
జీవులు పలు రకాలు - కాని అన్నిటికి ఉండేవి మాత్రం నిద్రాహారాభయామైథున మనే కనీసమైన సర్వసామాన్య శరీరభావాలు...
జీవులు పలు రకాలు - కాని అన్నిటికి ఉండేవి మాత్రం నిద్రాహారాభయామైథున మనే కనీసమైన సర్వసామాన్య శరీరభావాలు...
కొన్ని సెకండ్ల పాటు కొన్ని తుస్ మని / కొన్ని ఠప్ప్ మని పేలే మిర్చిల్లా, రై రై అంటూ నింగిలోకి దూసుకుపోయే తారజువ్వల్లా, ఒక్కోపటాకీది ఒక్కో శైలి...
అట్లే, ఇలా పుట్టి అలా కొన్నెల్లకు గతించే జీవుల దెగ్గరినుండి, శతసంవత్సరాలకు పైగా జీవించే మనుష్యప్రాణి వరకు, ఈ లోకంలో ఒక్కో ప్రాణిది ఒక్కోజీవనశైలి...
కాని తుదకు అన్ని ప్రాణులకు మిగిలేది సప్త ధాతులువులతో శైధిల్యం చెందిన తనువు తునకలే...
ఏ పటాకీఅయినా పేలిన మరుక్షణం తమలోని సారాన్ని వెలుగురూపంలో వెలిబుచ్చి ఈ విశ్వకాంతిలోకి ఆ వెలుగు కలిసిపోవడమే తుది మజిలి...
ఏ ప్రాణికైనా ప్రాణోత్క్రమనం అయిన మరుక్షణం, తమ లోని జీవశక్తిని అంతటా నిండినిబిడీకృతమైన పరమాత్మ ప్రాణశక్తిలోకి లయింపజేయడమే తుది మజిలి...
అలా తరచి చూడగ ఈ ప్రకృతిలోని ప్రతి పరమాణువు మనకు ప్రతిక్షణం ఏదోఒక సత్యాన్ని బోధిస్తూ, " ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం....." అన్నట్టుగా మనచే అనునిత్యం నమస్కరించబడే ఒక సద్గురువుగా భాసించి, జీవాత్మ-పరమాత్మ ల సంబంధాన్ని ప్రకృతి(జీవుడు)-పురుషుని (పరమాత్మ) అవిభాజ్యమైన
ఆత్మబంధంగా అభివ్యక్తీకరిస్తూ తన సార్వకాలికమైన సత్య స్థిరత్వాన్ని సదా చాటుతూ, సేవించిన వారందరికి శుభాలను అనుగ్రహిస్తూనే ఉంటుంది...!!
ఆత్మబంధంగా అభివ్యక్తీకరిస్తూ తన సార్వకాలికమైన సత్య స్థిరత్వాన్ని సదా చాటుతూ, సేవించిన వారందరికి శుభాలను అనుగ్రహిస్తూనే ఉంటుంది...!!
ఈ కలియిగపు ప్రత్యక్ష పరమత్ముడిగా భువిపై శ్రీవేంకటాచలంలో శ్రీనివాసునిగా కొలువైన స్వామి యొక్క విశాలవక్షసీమను అలంకరించి ఉన్న ఆ వ్యుహలక్ష్మీ మాత, గోవిందుని శ్రీపాదశరణాగతి చేసినవారందరికి అష్టైశ్వర్యాలు తన క్రీగంటి చూపులతో సదా వర్షిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ,
అందరికి శ్రీవిళంబి నామసంవత్సర దీపావళి శుభాభినందనలు...!! 🙂
No comments:
Post a Comment