ఇది కాదా మన భాగ్యము
మన నేత్రాలకు అందరిలాగా కనిపించనవసరం లేని పరమాత్మ... కేవలం వరిష్టులైన యోగుల మనో నేత్రాలకు మాత్రమే కనిపించే పరంధాముడు... ఏడుకొండలపై అందరికి కనిపించేలా... ఇంకా సరిగ్గా చెప్పాలంటే వారి వారి మనోక్షీరసాగర మథనజనితమైన హరిగుణగానమనే అమృతసేవనానికి అనుగుణంగా దర్శనం ప్రసాదించే పరమాత్మ... కొందరికి ఒక నామం... కొందరికి ఒక రూపం... కొందరికి ఒక విశ్వం... కొందరికి ఒక తత్వం... మరి కొందరికి సాక్షాత్ చిలిపి చేష్టల ఆ దేవకీ వసుదేవుల సుతుడు యశోదమ్మ ఇంట వెన్నముచ్చై తిరుగాడిన చిన్ని కృష్ణుడు...
మనకోసం ఇక్కడే.. ఇప్పుడే.. ఇలాగే.. కనిపించే.. అత్యంత సులువుగా.. అతి చేరువగా.. ఆ శ్రీ వేంకటాచలముపై.. భూలోక వైకుంఠం అనే ఆనంద నిలయంలో అందరికి
చెందేలా .. కొందరికె అందేలా .. గోవిందా అని పిలవగానే పలికే వాడు.. మన భాగ్యమై ఉన్నవాడు.. సప్తగిరుల తిరు వేంకటనాధుడు. :)
No comments:
Post a Comment