🙏కార్తీకశుద్ధ ఏకాదశి - 19-11-2018 సోమవారం🙏🙏
కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు.
ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు.. ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.
మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్రసన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.
ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది.
"ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు, తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది.
ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి.. ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపపరిహారం జరుగుతుంది.
పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు. ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన,మరణాంతరము వైకుంఠ ప్రాప్తి..మరియు..పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయని కార్తీకపురాణం లో చెప్పబడింది.
ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు
అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు.
అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.
ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు శివుడ్ని ఆరాధించే ఆనవాయితీ కూడా ఉంది.
ఈ ఏకాదశి...శివ కేశవుల కిష్టమైన మాసంలో, ఈ ఏకాదశి సోమవారం తో..కూడి రావడం..ఎంతో విశేషమైన ఫలితాలనిస్తుంది. కార్తిక సోమవారాలూ, మాసశివరాత్రులూ శివుడికి ప్రీతిపాత్రమైనవి అయితే, కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి.
హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తిక స్నానం, దీపారాధన శ్రేష్ఠమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి, ఉసిరిచెట్టూ, రావిచెట్టూ లేదంటే తులసికోట దగ్గరో దీపం వెలిగించి, కార్తిక దామోదరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు.
ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.
సోమవారం ప్రత్యేకత, కార్తికంలో సోమవారానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పించారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. దేవతల్లో ప్రథముడైన అగ్ని, నక్షత్రాల్లో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల సోమవారాలకు మరింత విశిష్టత ఏర్పడింది. సోమ అంటే చంద్రుడు. శివుడి సిగలో వెలిగే చంద్రుని వారం కాబట్టి సోమవారం ఉపవాసానికి విశేష ఫలితం లభిస్తుందంటారు.
‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ స్తుతిస్తూ భక్తిసాగరంలో ఓలలాడతారు. కార్తిక మాసంలో ప్రతిరోజూ పరమపావనమైనదే కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కైలాసవాసం సిద్ధిస్తుందన్నది శాస్త్రోక్తి.
శివకేశవులు...ఒకరే..
విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||
అసలు విళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు.
అందుకే శ్రుతి అంటుంది
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||
శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే,విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు.
ఓం శివకేశవాయ నమః..! "ఓం నమో నారాయణాయ
లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐
💐శ్రీ మాత్రే నమః💐

No comments:
Post a Comment