Friday, November 2, 2018

శ్రీమద్ రామాయణం పై ఒక చిరు సద్ విమర్శ... :)

శ్రీమద్ రామాయణం పై ఒక చిరు సద్ విమర్శ... 
కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే...
ఉత్తిష్ఠనరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం....!!
అంటూ కొన్ని కోట్ల మందికి పొద్దున్నే వినపడే సుప్రభాత ప్రారంభ వచనం కొందరు దురాత్ములకు వినపడదేమో...!
"చిన్న జీయర్ స్వామిని ఫాలో అవుతూ శ్రీవేంకటేశ్వర స్వామిని అరాధ్య దైవంగా భావిస్తాము ...." అంటూ కూతలు కూసే తోడేళ్ళకు, అదే ఆచార్యులచే వారి దివ్య సాకేతంలో ఆరాధ్యదైవంగా పూజింపబడుతున్న శ్రీరాముని గురించి, ఇష్టం వచ్చినట్టు సామాజిక మాధ్యమంలో గ్రామసిఁహంలా భౌ భౌ అంటూ అరిచి కొన్ని కోట్ల మంది హృదయాలను గాయపరచడం, నమ్మిన ఆ గురువులను, ఆచార్యులను అవమానించడం కాదా...?
వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం మరియు వ్యాసులవారి మహాభారతం ఈ భారతదేశపు ఇతిహాసాలు అనే ఇంగిత జ్ఞ్యానం కూడా లేకుండా శ్రీరాముడు కేవలం ఒక కథలోని పాత్ర అంటూ ఇష్టం వచ్చినట్టు పేలడానికి లజ్జ లవలేశమైన లేకుండా బరితెగించి చీప్ పాపులారిటి కోసం, ఈ దేశంలో పుట్టి తిన్నింటివాసాలు లెక్కపేట్టిన చందంగా ప్రవర్తించడం కాదా మోసగాడు అనే పదానికి అసలైన భాష్యం...!
భూమికి "భారంగా" ఉంటూ, అమాయకపు గ్రామీణ ప్రజలను వ్యాపారం పేరుతో నిలువునా ముంచి, ఇప్పుడు పట్టనానికి వచ్చి పెద్ద దొరల్లాగా బ్రతికే వారే కదా మోసగాళ్ళు అంటే..!
సద్గురువులు, ఆచార్యులు, యతిపురుషులు, మొదలైన సత్పురుషులచే పురాణాల్లోని వాస్తవాలను సరిగ్గా అవగాహన చేసుకొని, అర్ధవంతమైన వ్యాఖ్యానాలు చేయడం అనేది పెద్దలకు శోభనీయం.అంతే కాని, భావప్రకటన స్వేచ్ఛ అనే ఒకేఒక కారణాన్ని సాకుగా చూపి దైవాన్ని దూషించమని ఏ మతం, ఏ శాస్త్రం, ఏ వాదం, ఏ నాస్తికవాదం, లో చెప్పబడింది..?
తిన్నది అరగకపోతే చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి.ఒంట్లో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించుకోవడం, మొదలైన వ్యాపకాలు అన్నమాట.అంతే కాని జనాలకు సాహితి విమర్శలపేరుతో విషాన్ని పంచడం సరైనదని రాజ్యాంగం లో ఏక్కడ చెప్పబడింది...?
ఇతిహాసం అనే పదానికి అసలు అర్ధం తెలిస్తే కదా అది అపహాస్యం చేయడానికి అంత చీప్ కామెంట్స్ ని చేయడం ఎంత తప్పిదమో తెలిసేది....
" ఇతి హా అసం " - ఇది ఇలాగే జరిగింది ", అని పెద్దలు చెప్పినప్పుడు అది ఒక కల్పిత రచన, అందులోని పాత్రలను విమర్శించడం భావప్రకటన అనే వెర్రి కూతలు కూసి భక్తులను బాధించడం సద్విమర్శ అవుతుందా...?
హనుమంతుని ముందు కుప్పిగంతులా అన్నట్టు, అలనాటి వాల్మీకి మహర్షి, హనుమ మొదలుకొని, ఈనాటి తులసిదాస్, మొల్ల, మొదలైన మహాత్ములెందరో తమకు కలిగిన దైవానుభూతులకు అనుగుణంగా వారి పేర రామయణాలు, వాటికి భాష్యాలు రచించారు కాని, ఇలా ఎవరైన మిడి మిడి జ్ఞ్యానం తో బాహాటంగా కుయుక్తులుకూసారా ?
ఒకసారి సద్గురువులు బ్రహ్మశ్రీ చాగంటి వారి సంపూర్ణరామాయణం విని చూడండి, అసలు రాముడి గొప్పతనం అంటే ఏంటో, రాముడి ప్రతి పని ధర్మానికి ఎలా లోబడి ఉంటుందో, 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఎందుకు అంటారో, ధర్మబద్ధమైన వాలి వధ, రావణ వధ, సీతమ్మ అగ్ని ప్రవేశం, అరణ్య ప్రవేశం, మొదలైన వివిధ సంఘటనలవెనక ఉన్న ధర్మసూక్ష్మమేమిటో సుస్ఫష్టంగా అర్ధమవుతుంది....
-----------------------------------------------------------------
# చెట్టు చాటు నుండి బాణం వేసి రాముడు వాలిని వధించుట...
వాలి ఒక వానరుడు. విశాల కోసల సామ్రాజ్యాంతర్భాగమైన కిష్కింధ ప్రదేశానికి చెందిన ఒక వానరరాజు. తన తమ్ముడైన సుగ్రీవుని రాజ్యాన్ని, రాజ కాంతలను, అన్నీ బలవంతంగా హరించి వాటిని అధర్మబద్ధంగా అనుభవిస్తున్న ఒక నేరస్తుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం, వాలికి యుద్దం లో తన ప్రత్యర్ధుల్లోని సగం శక్తిని క్షీణింప జేసి అది తను పొందగలిగే వరం ఉంది. ఆ వర గర్వం చేతనే ఎవ్వరూ తనను ఏమి చేయలేరనే కుయుక్తి తో ఇలా ఇష్టా రాజ్యంగా అన్ని నావే అన్నట్టుగా బ్రతుకుతున్న ఒక అధర్మపరుడు.
కాబట్టి, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, శరణు పొందిన సుగ్రీవునికి ఇచ్చిన అభయం మేరకు శ్రీరాముడు అడవిలో ఒక క్రూరమృగాన్ని వేటలో హతమార్చాడు. ఇక్కడ గల ధర్మసూక్ష్మం, "ధర్మానికి మనదైన శైలిలో హాని చేస్తే, అది మనకు తనదైన శైలిలో బదులిస్తుంది..". శరప్రయోగం తరువాత వాలి ప్రత్యక్షంగా శ్రీరామున్ని, నీది ధర్మమైన దండన ఎలా అవుతుందో చెప్పు అని నిలదీసినప్పుడు, రాముడు ఇచ్చిన ఈ జవాబుకి వాలి సంతృప్తి చెంది పరమపదానికి ఏగినప్పుడు, ఇది మోసం అనడానికి మనకున్న అర్హత ఏపాటిది ?
-----------------------------------------------------------------------
# సీతమ్మను అనుమానించి అగ్నిప్రవేశం గావించుట...
సీతమ్మ అగ్నిపునీత అని రాముడికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు.అయోధ్యా పట్టణ మహారాణి గా శ్రీరాముడి సరసన సింహాసనంపై కూర్చున్నప్పుడు, రాజ్యంలోని ప్రజానీకానికి సీతమ్మ పాతివ్రత్యంపై ఎటువంటి సందేహాలు ఉండకూడదు అనే ధర్మబద్దమైన దూరాలోచనతో చేయబడినది ఈ పవిత్ర కార్యం. ఇక్కడ నిఘూడమైన ధర్మసూక్ష్మం, అగ్ని దేవుని వద్ద క్షేమంగా ఉన్న అసలు సీతామాతను, ఇన్నాళ్ళు రావణుడి చెరలో సీతమ్మగా ఉన్న వేదవతిని తమ తమ స్వస్థానాల్లోకి ప్రవేశపెట్టడం.
ఒక నాడు వేదవతి, తనకు తపోభంగం చేసిన రావణుడి అహంకార చర్యలకు తీవ్రంగా బాధపడి తను రావణుడికి ఇచ్చిన శాపం, "ఇకనుండి స్త్రీ అనుమతిలేకుండ తన దరికి బలవంతంగా చేరాలని ప్రయత్నిస్తే నువ్వు ఆ స్త్రీ వల్ల నశిస్తావు...". కాబట్టి రావణుడు సీతమ్మకు తిండి పెట్టక, హింసించడం తప్ప అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అనేది సత్యం. సీతమ్మ, వేదవతి చేసిన ఉపకారానికి ప్రతిగా తనను కూడా సతి గా చేపట్టమని అడిగితే, శ్రీరాముడు, తను ఏకపత్ని వ్రతున్నని అది ఇప్పుడు కుదరదని చెప్పి, కలియుగం లో పద్మావతిగా ఈ వేదవతి అవతరించి శ్రీవేంకటేశ్వరుడిగా ఉండే తనను కళ్యాణం చేసుకుంటుందని.....
చెప్పిన మహనీయుని చర్యలను ఏ విధంగా మోసం అని అంటారు...?
---------------------------------------------------------------------------------
ఇలా ఎన్నెనో ధర్మాలను, ధర్మసూక్ష్మాలను, ఆధ్యాత్మిక, దైవిక రహస్యాలను, తనలో గుప్తంగా ఇముడ్చుకుని యుగయుగాలకు జగజగాలకు, సూర్యచంద్రులు, జీవనదులు, ఉన్నంతకాలం శుభాలను అనుగ్రహించే శ్రీమద్రామాయణ ఆది కావ్యాన్ని, భారతదేశపు వారసత్వ సంపద అయిన ఇతిహాసాన్ని, అత్యంత శక్తివంతమైన పారాయణం " సుందరకాండ " ను కలిగిఉన్న హనుమ ఆరాధ్య సారస్వతాన్ని, ఇష్టంవచ్చినట్టు వక్రీకరిస్తూఉంటే, అది భావప్రకటనస్వేచ్చ అని భావించడం ఎంతటి మూర్ఖత్వానికి, అవగాహనారాహిత్యానికి, అరిషడ్వర్గ జనిత కావరనికి, తార్కాణమో, ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే, కొంతలో కొంతైన పాపనివృత్తి అవుతుందేమో...!
శ్రీవేంకటరామచంద్ర పరబ్రహ్మనే నమః...!!
-------------------------------------------------------------------------------
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Audio link : Nedunuri Krishnamurthy Audio link : P.Suseela Archive link : Explanation by Sri Nalinikanth రామచంద్రుడితడు రఘువీరుడు...

No comments:

Post a Comment