అనేది ఎల్లరూ, నిత్యమూ గమనించే ప్రక్రియే అయినా, చాలామందికి తగు అవగాహన లేక పంచభూతాలను సైంటిఫిక్ దృక్కోణంలో స్టడిచేసే సైంటిస్ట్ల సైంద్ధాంతిక విజ్ఞ్యతనే ప్రశ్నించే మూర్ఖులే ఎక్కువగా ఉండే దేశాల్లో ప్రశాంత జీవనం అనేది ఎల్లప్పుడూ ఎండమావిలో నీటి అన్వేషణలా సార్ధకం చెందజాలని వృధాప్రయాస...
"అన్ని కూరగాయలు మంచివే..."
అనేది ఒక జెనెరిక్ స్టేట్మెంట్....
కాని
వంకాయలు, ఆలుగడ్డలు వాత ఇబ్బందులు, కీళ్ళనొప్పులున్న వారికి తగవు....
తోటకూర ఉబ్బసం ఇబ్బంది ఉన్నవారికి తగదు...
అనేది వారివారి గ్రాహ్యాగ్రాహ్య వస్తువివేచనాత్మకతకు సంబంధించిన స్పెసిఫిక్ స్టేట్మెంట్....
"అన్ని పండ్లు మంచి ఆహారపదార్థాలే.."
అనేది ఒక జెనెరిక్ స్టేట్మెంట్....
కాని
మామిడిపండ్లు, చెరుకు, ఇత్యాది బాగా తీపిపదార్థాలు కొందరికి పడవు...
ద్రాక్ష, బత్తాయి ఇత్యాది పులుపు పదార్థాలు కొందరికి పడవు...
అనేది వారివారి గ్రాహ్యాగ్రాహ్య వస్తువివేచనాత్మకతకు సంబంధించిన స్పెసిఫిక్ స్టేట్మెంట్....
ఒక పూటకు సరిపోయే తిండి గురించే ఏది కొనుక్కొని తినాలో, ఏది కూడదో అని అంతర్నిహితమైన శ్రేయోతత్త్వం గురించి ఎంతగానో అలోచించే ఒక విజ్ఞ్యుడు, జీవితకాలపర్యంతం ధరింపబడే, భుజింపబడే, శ్వాసింపబడే, వస్తువులను స్వీకరించడంలో ఎంతో విజ్ఞ్యతతోనే ఉండగలడు అని అనుకోకుండా ఉండడానికి కుదరదు....
ఒక లిటర్ పాలకుండలో ఒక త్రాగునీటి చుక్క పడితే పర్లేదు...కాని ఒక నిమ్మరసం చుక్క పడితే అవి ఇక పాలుగా గౌరవింపబడవు.....
త్రాగునీరు, నిమ్మరసం రెండూ కూడా జలత్తత్వ పదార్థాలే....
కాని త్రాగునీరు క్షారము లేకా తటస్థము, నిమ్మరసం ఆంలము...అని ఒక సైంటిస్ట్ pH స్కేల్ పై తెలుపుతూ చెప్పినప్పుడు అది నమ్మడంలోనే విజ్ఞ్యత ఉన్నది...
ఇది విశ్వసించడానికి ఎల్లప్పుడూ ఒక pH స్కెల్ పరికరాన్ని వెంటబెట్టుకొని తిరగనవసరంలేదు...ఆ సిద్ధాంతం శాశ్వత వివేచనగా బుద్ధికి గ్రాహ్యమైఉంటే చాలు....
అదే విధంగా, ఈ లోకంలోని ఎన్నో వస్తువులకు, వాస్తవాలకు, కూడా కొన్ని స్కేల్స్, కొన్ని మెట్రిక్స్, ఉండడం అనేది ఈ పాంచభౌతిక ప్రపంచం యొక్క విశేషం....
అవి వారివారి స్వాధ్యాయం కొలది వారికి గ్రాహ్యమయ్యే సదసత్ వస్తువిచేనాత్మక శాస్త్రవైభవం......
ఒకరికి ఫలానా వస్తువు కొనుక్కొమ్మని ఒక శ్రేయోభరిత సలహా ఇస్తున్నామని ఇచ్చేవారనుకుంటే సరిపోదు....
ఆ సలహా స్వీకరించేవారి సశాస్త్రీయ తర్కానికి కూడా ఆ సలహా సహేతుకమైతేనే అది గౌరవింపబడే సలహా అవుతుంది...అనేది విజ్ఞ్యులు అలోచించవలసిన సత్యం....
No comments:
Post a Comment