Wednesday, March 20, 2024

నువ్వు విజ్ఞ్యుడైన ఫలాన వ్యక్తిచే గౌరవింపబడాలని అనుకుంటే....మొదట నువ్వు ఆ విజ్ఞ్యుడిని, విజ్ఞ్యుడి మాటలను గౌరవించాలి...


ఫర్ ఎగ్సాంపుల్..సాంబార్ అనే వంటకంలో...

నీళ్ళు ఎక్కువైతే అది కేవలం రసం అనిపించుకుంటుంది...
కూరగాయలు తగినంతగా ఉడకనివ్వకుండా వేస్తే అజీర్తి సమస్యలు...
పచ్చిమిరప, కారం ఎక్కువైతే బి.పి, అల్సర్, విరేచనాలు మొదలైన సమస్యలు...
పులుపు ఎక్కువైతే అసిడిటి సమస్యలు...
ఉప్పు ఎక్కువైతే కిడ్నీ సమస్యలు....
సాంబార్ తగినంతగా మరిగించకపోతే వెగటు...
ఇత్యాదివన్నీ విజ్ఞ్యులకు తెలిసిందే...

కాబట్టి ఏఏ పదార్థాలు ఎంతమోతాదులో ఉంటే అది ఆరోగ్యకరమైన సాంబార్ అనే వంటకం అనిపించుకుంటుందో ఆయా విధంగా కలిపి ఒక పద్ధతిగా వండితేనే అది స్వీకరించయోగ్యమైన సాంబార్ అనిపించుకుంటుంది....కద...

ఇవన్నీ స్కూల్ కి వెళ్ళే ఒక చిన్నపిల్లాడికి ఎట్లు తెలియును...తెలియదు కాబట్టే ఇంట్లో పెద్దలు పద్ధతిగా సాంబార్ తయారుచేస్తే, పిల్లలు వాటిని ఇడ్లీ టిఫిన్ లోకి, లేకపోతే మధ్యాహ్నం భోజనం లోకి, తగినంతగా కలుపుకొని భోజనం చేసి ఆరోగ్యంగా ఉంటారు....కద.....

ఆఫ్ట్రాల్ ఒక్కపూట టిఫిన్ / భోజనానికే సాంబార్ ఇంత పద్ధతిగా, అనగా ఒక మాస్టర్ షెఫ్ అనుసరించే పాకశాస్త్రబద్ధంగా కాకపోయినా, తగురీతిలో ఆరోగ్యకరమైన విధంగా రుచికరంగా, శుచికరంగా ఉండాలి అని కద ఎల్లరి సర్వసాధారణ అభిప్రాయం...

( పప్పుచారు సరిగ్గా వండలేదని, మొత్తం నీళ్ళే ఉన్నయని, అన్నంతో ఉన్న ప్లేట్ ని ఎన్నోసార్లు విసిరికొట్టిన ఒక అత్యంత పాపిష్టి మూర్ఖుడికి, ఎవ్వరి అభివృద్ధినీ ఓర్వని వాడికి, 
వాడిని సమర్ధించే ఇతర చదువుకున్న మూర్ఖులకు, ఈ క్రింది చిన్నచిన్న ప్రశ్నలు తగురీతిలో జ్ఞ్యానోదయం కలిగించుగాక ... )

మరి మనిషి యొక్క యావద్ జీవితాన్ని శాసించే ఎన్నో అంశాలు కూడా, ఒక సాధారణ మనిషికి స్వతహాగా వాటిపై అవగాహన ఉండదు కాబట్టి, విజ్ఞ్యులైన వివిధ మహర్షులు, కోవిదులు వాటిని మనకు వివిధ శాస్త్రాల రూపంలో అనుగ్రహించారని, వాటిని పాటిస్తే శ్రేయస్సు, విస్మరిస్తే వివిధ సమస్యలు సంభవిస్తాయనే కనీసజ్ఞ్యానం, వాటిని యధావిధిగా తెలుసుకొని ఆచరించాలనే ఇంగితం, అల్పులైన మనుష్యులకు ఎట్లు కలుగును...?

1. శాస్త్రాన్నైనా చదవాలి, చదివినది ఆకళింపుజేసుకోవాలి,
అది జీవితానికి అన్వయించుకొని తరించాలి...

2. లేకపోతే ఎంతో కష్టపడి అలా బుద్ధివైభవంతో జీవించే ఉత్తముల పట్ల / విజ్ఞ్యుల పట్ల గౌరవమరియాదలతో మసులుకొని, వారి అనుగ్రహంగా తెలుసుకొని, జీవితానికి అన్వయించుకొని తరించాలి...

ఒక ఊరపందిలా తిని ఊరిమీద పడితిరగడమే బ్రతుకైతే, జీవితం కూడా బొరదలో బొర్లే పంది బ్రతుకులానే ఉండిపోతది....
పశువుల్లా గడ్డి కాకుండా మనుషుల్లా అన్నం తినే భాగ్యాన్ని కలిగించిన భగవంతుడు ప్రసాదించిన బుద్ధిని ఉపయోగిస్తూ..

(నీకు తెలియకపోవడం తప్పు కాకపోవచ్చు...)
నీకు మంచి చెప్పేవారున్నా సరే, వినిబాగుపడే యోగ్యతను సంతరించుకోకపోవడం తప్పు....

మనలా మన పిల్లలు కూడా బురదలో బొర్లే పందులలాంటి బ్రతుకే బ్రతకాలి అని అనుకోవడం తప్పు...

మనలా కాకుండా మన పిల్లలు గొప్పగొప్ప ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, సివిల్ సర్వీస్ ప్రొఫెషనల్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, అవ్వాలని ఆశించకపోవడం తప్పు...

ఇంకో పదో, ఇరవయ్యో ఏళ్ళకు తెల్లారిపోయే జీవితాలు గల సీనియర్ సిటిజెన్స్ హోదాలో విశ్రమించే వారు...
ఇంకో డెబ్బై, ఎనభై ఏళ్ళ బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవిస్తూ, మీరు గతించిన తర్వాత మీకు శ్రద్ధాభక్తులతో దినాలు, ఆబ్దీకాలు పెడుతూ అభివృద్ధిచెందవలసిన మీ భావితరాల అభ్యున్నతి పట్ల, ఇర్రెస్పాన్సిబిల్, స్ట్యూపిడ్, సెన్స్లెస్, ఫూల్ లా ప్రవర్తిస్తూ, మీ భావితరాల మనఃశాంతికి ఇబ్బంది కలిగించే ఒక నికృష్టపు నల్లిలా, ఒక మాయదారి పిల్లిలా, ఒక గుంటనక్కలా, బ్రతకడం తప్పు...

నువ్వు గతించిన తదుపరి నీ భావితరాల వారు...

"హమ్మయ్య మొత్తానికి పోయాడు...
వీడి మూర్ఖత్వాన్ని భరించలేని దరిద్రం వదిలింది...."
అని అనుకుంటారా...

లేకపోతే,

"అయ్యో పెద్దాయన ఇంకోన్నాళ్ళు ఉంటే ఎంతబావుండు...
మా ఆధునిక బ్రతుకులకు ఒక పాతతరపు బాధ్యతాయుతమైన పెద్దదిక్కులా ఉండేవాడు...."
అని అనుకుంటారా...

అనేదే ఏ పెద్దమనిషికైనాసరే వారి ఈనాటి గౌరవానికి కొలమానం....

ఏది భుజిస్తే ఆరోగ్యానికి మంచిదో..
ఏది స్వీకరిస్తే ఆరోగ్యానికి హానికరమో...
తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు మంచి గురించి బోధించేది ఏముంటుంది...??

ఏది కాకరకాయో....
ఏది బీరకాయో...
తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు వంట గురించి బోధించేది ఏముంటుంది...??

ఏది ఉత్తరవాయవ్యమో....
ఏది పశ్చిమవాయవ్యమో...
ఏది తూర్పాగ్నేయమో..
ఏది దక్షిణాగ్నేయమో..
తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు వాస్తు గురించి బోధించేది ఏముంటుంది...??

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణం లో
ఏవి వేటికి ఉపయుక్తమో...
ఏవి వేటికి ఉపయుక్తం కాదో....
తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు పంచాంగం గురించి బోధించేది ఏముంటుంది...??

సూర్యుణ్ణి ఎట్లు ఎందుకు ప్రార్ధించాలో....
చంద్రుణ్ణి ఎట్లు ఎందుకు ప్రార్ధించాలో....
నక్షత్రాలను ఎట్లు ఎందుకు ప్రార్ధించాలో....
తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు ఆధ్యాత్మికత గురించి బోధించేది ఏముంటుంది...??

శివుడుకి అభిషేకమే ఎందుకో...
విష్ణుమూర్తికి పుష్పార్చనే ఎందుకో...
పరాశక్తికి కుంకుమార్చనే ఎందుకో...
తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు భగవత్తత్త్వం గురించి బోధించేది ఏముంటుంది...??

ఎక్స్.ఎం.ఎల్ అంటే ఏంటో...
హెచ్.టి.ఎం.ఎల్ అంటే ఏంటో...
వాటికి గల భేదం ఏంటో తెలియని మూర్ఖుడవు నీవైతే..
ఇక నువ్వు ఇతరులకు కంప్యూటర్ మార్కప్ ల్యాంగ్వేజ్ పార్సర్స్ గురించి బోధించేది ఏముంటుంది...??

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ అనంతం....

ఒక్కమాటలో చెప్పాలంటే...
ఫలాన మాట / ప్రశ్న / సలహా గురించి అవతలి వ్యక్తి దెగ్గర ప్రస్తావిస్తే...

అవతలివారిచే....

"చెప్పుతీస్కొని కొడ్తా...."
"ఎగ్గిరి తంతే అక్కడ పడ్తవ్..."
"నువ్వా చెప్పేది...?"
"నీకు అవసరమా..?"
"నీకెందుకు...?"

అనే మాటలే సమాధానాలుగా వస్తాయా...

లేకపోతే...
"ధన్యవాదాలు...."
"ఓహ్ అవునా సరేసరే..."
"మీరే చెప్పాలి..."
"మీరు చెప్పండి.."
"ఫలాన అందుకా..."

అనే మాటలు సమాధానాలుగా వస్తాయా...

అనేది అలోచించి మాట్లాడడంలోనే మనిషి యొక్క విజ్ఞ్యత ఉండును....

ఇంకా చాలా చాలా సింపుల్ గా చెప్పాలంటే...

నువ్వు విజ్ఞ్యుడైన ఫలాన వ్యక్తిచే గౌరవింపబడాలని అనుకుంటే....
మొదట నువ్వు ఆ విజ్ఞ్యుడిని, విజ్ఞ్యుడి మాటలను గౌరవించాలి...

అలా కాని పక్షంలో హుందాగా స్వాభిమానంతో నీ గౌరవాన్ని కోల్పోకుండా ఉండేలా మౌనాన్ని పాటించాలి, లౌక్యాన్ని అవలంబించాలి, విజ్ఞ్యతను ప్రదర్శించాలి.....

ఇవి రెండూ కుదరకపోతే, ఎవ్వరి పరిధిలో వారు, ఎవ్వరి దారిలో వారు, ఎవ్వరి జీవితంలో వారు...
ఎవరికి వారుగా హుందాగా ఉండాలి...

చివరగా ఒక చిన్నమాట....

నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం లోకాన్ని చుట్టి వస్తుంది అనేది ఒక సామెతైతే.....

నిప్పురవ్వంత సత్యం, ఎవరెస్ట్ పర్వతమంత అసత్యాన్ని ఏనాటికైనా సమూలంగా దహించివేస్తుంది...
ఒక దూదిపర్వతాన్ని దహించే దావానలంలా....
అనేది ఇంకో సామెత.....

"
మీ మూర్ఖత్వం వల్ల మీరు బాధపడితే దానికి బాధ్యతే మీదే ఔతుంది...
కాని
మీ మూర్ఖత్వం వల్ల నా భావితరాలు బాధపడితే దానికి బాధ్యత నాదే ఔతుంది....

అందుకే ఇన్నిసార్లు పదేపదే మీ పరిధిని మీకు గుర్తుచేయడం, నా హక్కులను నేను సమర్ధించుకోవడం, నా మనఃశాంతిని నేను సాధించుకోవడం అనే ప్రయాసలో మీ మూర్ఖత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం ఆవశ్యకమౌతున్నది...

ఈశ్వరుడు మీకు సద్బుద్ధిని ప్రసాదించి, మనఃశాంతితో జీవించగల విజ్ఞ్యతను అనుగ్రహించుగాక....
"


No comments:

Post a Comment