శ్రీశోభకృత్ 2024 మాఘ బహుళ షష్టి ప్రయుక్త భృగువాసర తిరుమల పూరాభిషేకసేవ శుభాభినందనలు....
🙂💐💐💐💐💐🍊.
*********************
శ్రీశ్రీనివాసుడిగా వెలిగే కలియుగప్రత్యక్ష దైవమైన గోవిందుడిని....
దర్శించాలంటే కావలె రెండుజన్మల పుణ్యకర్మాచరణఫలం...
స్మరించాలంటే కావలె ఇరవైజన్మల పుణ్యకర్మాచరణఫలం...
నిత్యమనననిధిధ్యాసనంతో ఆనందదాయకుడిగా నిత్యం మన ఎదలోనే కొలువై ఉండాలంటే కావలె రెండువందల జన్మల పుణ్యకర్మాచరణఫలం....
ఎందుకంటే
1. ప్రతి సోమవారం స్వామివారికి నిర్వహింపబడేది "విశేషార్చన" అనబడే వారోత్సవసేవ..,
సకలదేవతాస్వరూపంగా అలరారే పరతత్త్వ విశేషాన్ని భక్తులకు తెలియజెప్పే విశేషకైంకర్యం...
[ ఒకనాటి సోమవారం నాడు అట్టి "విశేషార్చన" ఆర్జితసేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లేలా అనుగ్రహించినందుకు ధన్యుడను స్వామి..🙂]
2. ప్రతి మంగళవారం స్వామివారికి నిర్వహింపబడేది "బంగారు అష్టదలపాదపద్మార్చన" అనబడే వారోత్సవసేవ....
ఒక హైందవేతర సంప్రదాయానికి చెందిన భక్తశిఖామణి సమర్పించిన బంగారు కమలంపువ్వులతో అర్చనను స్వీకరిస్తూ అలరారే... సర్వాతీతమైన
సర్వతత్త్వస్వరూప పరతత్త్వ విశేషాన్ని భక్తులకు తెలియజెప్పే విశేషకైంకర్యం...
[ ఒకనాటి మంగళవారం నాడు అట్టి
"అష్టదలపాదపద్మార్చన" ఆర్జితసేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లేలా అనుగ్రహించినందుకు ధన్యుడను స్వామి..🙂]
3. ప్రతి బుధవారం స్వామివారికి నిర్వహింపబడేది "సహస్రకలశాభిషేకం" అనబడే వారోత్సవసేవ....,
సహస్రం అనగా అనంతం.....
అనగా అనంతమైన విభూతులతో అలరారే
అమేయ పరతత్త్వ విశేషాన్ని భక్తులకు తెలియజెప్పే విశేషకైంకర్యం...
[ ఏదో ఒక బుధవారం అట్టి "సహస్రకలశాభిషేకం" ఆర్జితసేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లేలా శీఘ్రమే అనుగ్రహించు స్వామి..! ]
4. ప్రతి గురువారం స్వామివారికి నిర్వహింపబడేది "తిరుప్పావడ సేవ" / "అన్నకూటోత్సవం" అనబడే వారోత్సవసేవ....,
అన్నం పరబ్రహ్మస్వరూపం..
అట్టి అన్నకూటోత్సవసేవానుగ్రహం తో భక్తులకు జన్మజన్మలకు మరియు జన్మాంతరంగా సాగే జీవుడిప్రయాణము నందు కూడా ఆకలిదప్పికలకు ఇబ్బంది ఉండని అన్నపూర్ణానుగ్రహాన్ని వర్షించే పరతత్త్వ విశేషాన్ని భక్తులకు తెలియజెప్పే విశేషకైంకర్యం...
[ ఏదో ఒక గురువారం అట్టి "తిరుప్పావడ సేవ" ఆర్జితసేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లేలా శీఘ్రమే అనుగ్రహించు స్వామి..! ]
5. ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహింపబడేది
"పూరాభిషేక సేవ" / "మేల్ సాత్తువస్త్ర సేవ" / "నిజపాదదర్శనం" సేవ అనబడే వారోత్సవసేవలు....,
ఈశ్వరాభిషేకం సకలతాపహరణం..
అట్టి పూరాభిషేకసేవానుగ్రహం తో భక్తులకు జన్మజన్మలయందుంటే వివిధ లౌకిక ఆర్తిని హరించి, ఈశ్వరుడిపై ఎనలేని భక్తి ప్రపత్తి భరిత జీవితాభ్యుదయానుగ్రహన్ని వర్షించే
పరతత్త్వ విశేషాన్ని భక్తులకు తెలియజెప్పే విశేషకైంకర్యాలు...
[ పలుమారు అట్టి "నిజపాదదర్శనం" ఆర్జితసేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లేలా అనుగ్రహించినందుకు ధన్యుడను స్వామి.... 🙂 ఏదో ఒక శుక్రవారం "పూరాభిషేక సేవ" /
"మేల్ సాత్తు వస్త్ర సేవ" ఆర్జిత సేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లే భాగ్యాన్ని శీఘ్రమే అనుగ్రహించు స్వామి..! ]
6. ప్రతి రోజు నిర్వహింబపడే "సుప్రభాత సేవ" / "విశ్వరూపసందర్శనం" లో, పువ్వులంటే ఎంతో ఇష్టపడే స్వామివారికి నిర్వహింపబడే "తోమాల" సేవకు ముందుగా
నిర్వహింబపడే ఈ సేవలో స్వామివారికి నైవేద్యంగా సమర్పింపబడిన వెన్నను (నవనీత నివేదనం) తమలపాకులకు అలది భక్తులకు ప్రసాదంగా వితరణ గావిస్తారు....
అనాటి ద్వాపరంలో శ్రీకృష్ణపరమాత్మ కొందరు పుణ్యాత్ములకు అనుగ్రహించిన ఎంతో దుర్లభమైన విశ్వరూపసందర్శనం యొక్క అనుగ్రహఫలాన్ని ప్రసాదించే మహత్తరమైన దర్శనంగా మహాత్ములచే కొనియాడబడే సేవ...
[ పలుమారు అట్టి "సుప్రభాతసేవ" ఆర్జితసేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లేలా అనుగ్రహించినందుకు ధన్యుడను స్వామి....🙂
ప్రాచీన స్వర్ణాభరణాల సోయగంతో వెలుగొందే స్వామివారి సుప్రభాతసేవా విశ్వరూప సందర్శన వైభవాన్ని తిలకించాలంటే ఎన్ని కళ్ళైనా సరిపోవు...ఒకసారి ఎందుకో ఏమో, ఇంకా సుప్రభాతపఠనం పూర్తవ్వనే లేదు..తెరలు ఇంకా తొలగనేలేదు....కాని ఇంతకుముందు ఒకసారి దర్శించిన విశ్వరూప సందర్శనా వైభవాన్ని మదిలో దర్శిస్తూ ఆపలేనంతగా అశ్రుధారల్లో ఉన్న నన్ను, నా పక్కనే నిల్చొని ఉన్న నా ఫ్రెండ్ విజయ్ చెరుకూరి, "ఏంటన్నయ్యా అలా ఏడుస్తున్నారు..".అని అడిగేంతవరకు ఆ ఆనందభాష్పాలు ఆగనేలేదు..ఎందుకంటే కొన్ని భావమధురిమలు వాక్కులకు అలభ్యం కాబట్టి...
]
7. సుప్రభాతసేవానంతరం నిర్వహింపబడే "తోమాలసేవ" లో
సుగంధవిరిమాలలసోయగం మాటున ఆ విశ్వరూపం నిక్షిప్తమై, ఒక సౌమ్యమూర్తిగా స్వామివారు రూపాంతరం చెంది, "సహస్రనామార్చన" లో ఎంతో శ్రద్ధతో ఆనాడు రోస్టర్ ప్రకారంగా ఏ శ్రీవైఖానస అర్చకులకు సన్నిధి సేవ లభించిందో వారు అన్ని నామాలను పఠించగా, ఒక నూతనదైవిక తేజస్సును సంతరించుకునే స్వామి వారు, రాత్రి ఏకాంత సేవ పర్యంతం ఆ తేజస్సుతో వెలుగొందుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు...
ఏదో ఒక రోజు "తోమాల సేవ" / "అర్చన సేవ" ఆర్జిత సేవా టికెట్ హోల్డర్ గా వర్ధిల్లే భాగ్యాన్ని శీఘ్రమే అనుగ్రహించు స్వామి...! ]
8. ఆ తదుపరి నిర్వహింపబడే నిత్యకళ్యాణం లో శ్రీభూసతులతో స్వామివారు భక్తులను అనుగ్రహించి,
అద్దాలమండపంలో, ఊంజల్ సేవ / డోలోత్సవ సేవను స్వీకరించి, ఆ తదుపరి ఆర్జిత బ్రహ్మోత్సవం / వసంతోత్సవం / సహస్రదీపాలంకరణ సేవలో భక్తులను అనుగ్రహించి, తిరుమాడవీధుల్లో ప్రదక్షిణ గావించి, స్వామిపుష్కరిణి యొక్క తూర్పుప్రవేశద్వారం వద్ద కుంభహారతిని స్వీకరించి, ఆలయంలోకి వేంచేయడంతో ఆనాటి శ్రీభూసమేతశ్రీమలయప్పస్వామి వారి
(తిరుమల పంచబేర సంప్రదాయంలో 'ఉత్సవబేర' సేవ)
సేవావిశేషాలు సంపూర్ణమైనట్టుగా కైంకర్యపట్టిలో నమోదవ్వగా, ఆనాటి రాత్రి ఆఖరిసేవగా నిర్వహింపబడే ఏకాంతసేవలో స్వామివారు ఆనందనిలయంలో సేదతీరి యొగనిద్రలోకి అలా జారుకుంటారో లేదో, ఇలా కుంచకోలతో మరునాటి సుప్రభాతసేవ ప్రారంభమవుతూనే ఉంటుందంటే, ఆ ప్రత్యక్ష పరమాత్మ యొక్క వాత్సల్యం ఎట్టిదో ఆలోచించండి...
ఒక్కో తిరుమల ఆర్జితసేవ యొక్క ఘనమైనఫలితం ఒక్కో విధంగా, భక్తుణ్ణి ఘనంగా ఉద్ధరించడం, కోట్లాది భక్తుల మనసులకు తెలిసిన విశేషమే...!
నిత్యకళ్యాణం మినహా మిగతా అన్ని నిత్యోత్సవాల్లో
(ఊంజల్ సేవ, ఆర్జితబ్రహ్మోత్సవ సేవ, వసంతోత్సవ సేవ, సహస్రదీపాలంకరణ సేవ) లో ఎన్నో సార్లో పాల్గొనే అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు ధన్యుడను స్వామి...🙂
నిత్యకళ్యాణ సేవను ఎన్ని సార్లు వేడుకున్న కూడా,
ఇంటిదెగ్గరి ఆలయంలో మరియు తిరుచానూర్ అమ్మవారి సన్నిధిలో శ్రీపాంచరాత్రాగమోక్త కళ్యాణోత్సవానుగ్రహాంగా ప్రసాదించావ్ ..మరి తిరుమలలో ఎప్పుడు స్వామి....?
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు...
"చేరి యశోదకు శిశువితడు..."
అని ఆనాటి యశోదమ్మ భాగ్యాన్ని ఎంత గొప్పగా కొనియాడారో,
ఈనాటి కలియుగభక్తుల భాగ్యాన్ని కూడా అంతే గొప్పగా..
"చేరి కొల్వరో ఇతడు శ్రీదేవుడు..." అనే సంకీర్తనతో కొనియాడారు...🙂🙏
https://pedia.desibantu.com/cheri-kolvaro/
నాయొక్క ఇన్ని తిరుమల యాత్రలకు కూడా మకుటాయమాయమైనది,
[ ఈ పోస్ట్ యొక్క కామెంట్స్ లో జతపరచబడిన ]
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాంతర్గతంగా లభ్యమైన స్కాందపురాణాంతర్గత తొమ్మిదవ అధ్యాయంలోని "శ్రీవేంకటాచలాధిరోహణ స్తవం" మరియు అమేయ జ్ఞ్యానదాయకమైన శ్రీవరాహపురాణాంతర్గత "భూదేవిసహితవరాహమూర్తి స్తవం"..🙂
No comments:
Post a Comment