శ్రీకరమైన భారతదేశ సనాతన సత్సంప్రదాయ వైభవంలో అనాదిగా అంతర్భగామైన పితృదేవతారధన
అనేది ఎంతో మహిమోపేతమైన సదాచారసంపన్న విశేషంగా ఖ్యాతి గడించిన ఆర్షసంప్రదాయం...
పితృ, పితామహ, ప్రపితామహ, అనే 3 తరాల
(అనగా, తండ్రి, తండ్రి యొక్క తండ్రి, తాత యొక్క తండ్రి) పెద్దలు గతించినతరువాత పితృలోకంలో దేవతల స్థానంలో ఉండి వారి వంశీకులను సుఖసంపదలతో, పుత్రపౌత్రులతో,
అనుగ్రహిస్తారనే విశ్వాసం అనాదిగా ఈ భారతావని యొక్క జీవగర్రగా నిలిచిన సంప్రదాయ వైభవం.....
అందుకే వారు గతించిన చాంద్రమాన తిథిని అనుసరించి ఒక్కొక్కరు ఒక్కోలా వారివారి శక్తికొలది, విహితమైన సంవత్సరిక ఆబ్దికం మొదలుకొని వివిధ దానధర్మాల వరకు, వారి పితరుల పేర నిర్వహించడం చాలామందికి తెలిసే ఉంటుంది....
మరీ ముఖ్యంగా, నదీ పుష్కరాల సమయంలో, గతించిన వారివారి పెద్దలను ఉద్దేశ్యించి విశేష తర్పణాలు, దానాలు గావించడం అనేది ఈ భారతదేశంలో అనాదిగా ఉన్న సంప్రదాయవైభవం....
వారివారి 3 తరాలవారిని చూసి శివైక్యంచెందాలనుకునే పాతకాలం పెద్దలను చాలమంది చూసే ఉంటారు....
ఎందుకంటే, ఆ 3 తరాలవారికి కూడా, "మేము గతించినతదుపరి మా పేరుమీద జరిపించవలసిన పితృకార్యాలు శ్రద్ధాభక్తిలోపం లేకుండా తప్పకుండా గుర్తుపెట్టుకొని చేయాలి / చేయించాలి..." అనే సుద్దులు చెప్పికనుమూస్తే, 3 తరాల వరకు పితృలోకంలో ఉండే వారి అనుగ్రహంతో వారి భావితరాలు కూడా చల్లగా ఉండాలనే ఆకాంక్ష ఆ మాటల వెనక ఉండే అసలైన మతలబు అన్నమాట...
"గతించిన తండ్రి పేర వివిధ దానాలు ఎందుకు..
షోడశదానాల పేర్లు చెప్పేసి అన్నింటికికలుపుకొని, 12 నెలలమాసికాలు కూడా ఒకేసారి పెట్టేసి, పంతులుకు 500 ఇస్తే సరిపోతది....కద...."
అని అనేసే అత్యంత కౄరమైన మనస్తత్త్వాలు చూడచక్కని పెద్దమనుషుల్లా కనిపించే ఈనాటి కలియుగంలో కూడా....
పితృదేవతల ప్రాశస్త్యం, గరుడపురాణవైభవం, ఇత్యాదివాటి గురించి సవిస్తరంగా బోధించే శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు లభించడం ఈ తరానికి గల సౌభాగ్యం....
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో పితృదేవతారాధన యొక్క ప్రశస్తి గురించి ప్రత్యేకంగా పేర్కొన్న సందర్భాలు కోకొల్లలు....
గతించిన మాతృమూర్తికి గౌరవవందనంగా గజేంద్రమోక్షం ప్రవచనాలను అనుగ్రహించవలసిందిగా వారి సన్నిహితులొకరు అడిగినప్పుడు, వారి అభ్యర్ధనను మన్నించి, దోమలబెడద ఉన్నా కూడా ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొనిమరీ గజేంద్రమోక్ష ప్రవచనాలను అనుగ్రహించిన ఉదార మనస్కులు శ్రీచాగంటి గారు...
ఇక గురువుగారి శ్రీమద్భాగవత ప్రవచనాల్లోని వాలఖిల్యులు, జరత్కారుడు, జరత్కారోపాఖ్యానం, సగరపుత్రుల భస్మరాశులపైనుండి గంగప్రవహించి వారికి సద్గతులను ప్రసాదించడం కోసం భగీరధుడు గావించిన గంగావతరణం, "ఖస్థితదశరథవీక్షితరామ" యొక్క శ్రీమద్రామాయణ ప్రవచనాల్లోని వివరణ,
వరుణపాశములతో దేవతలచే బంధింపబడిన
బలిచక్రవర్తి కోసం ఆయన తాత భక్తప్రహ్లాదులవారు వచ్చి వామనమూర్తిగా ఉన్న శ్రీమహావిష్ణువుతో సంవాదించడం....,
మేఘనాథుడు సంధించిన నాగాస్త్రం తో బంధింపబడిన శ్రీరామలక్ష్మణులను విడిపించడానికి " ప్రస్తుతానికి నీ మితృణ్ణి అనుకో..." అని చెబుతూ శ్రీవైకుంఠ మూలస్థానం నుండి కదిలొచ్చిన గరుత్మంతులవారి ఘట్టం.....,
14 భువనాలు, సూర్యచంద్రనవగ్రహాది సౌరమండల వ్యవస్థను దాటి ఉండే అసంఖ్యాక నక్షత్రమండల పర్యంతం వ్యాపించి ఉండే అసంఖ్యాక ద్యులోకాలు కూడా వేటిని ఆధారంగా గావించి భ్రమణం గావిస్తాయో అట్టి సర్వోన్నతమైన ధృవమండలంగా వెలుగొందే వరాన్ని శ్రీమహావిష్ణువు నుండి బాల్యంలోనే గైకొన్న ధృవుడు, తనభూలోక జీవితం పూర్తైన తదుపరి ఆ వరాన్ని సార్ధకం గావించుకోవడం కోసం
విష్ణుపార్శ్వదులతో కూడి వారి విమానాల్లో దివికేగే సందర్భంలో, ఆ వరానికి, తపస్సుకు కారణమైన వారి మాతృమూర్తి సునీతిని కూడా తనకంటే ముందే వేరోక విమానంలో దేవతలు తీసుకొని వెళ్తున్న ఘట్టం...,
ఇత్యాదిగా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనామృత కథాసుధాలహరుల్లో ఈ లోకానికి అందిన
మాతృ/పితృదేవతా సంబంధమైన ఆర్షవిజ్ఞ్యాన సారస్వత సాహితీమంజరులు ఎన్నో....
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సమేత శ్రీకొండగట్టు వీరాంజనేయ స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతమైన కొడిమ్యాల గ్రామవాస్తవ్యులైన పూర్వీకుల పరంపరలోని....
వీరయ్య --> రామయ్య --> హనుమయ్య
అనే 3 తరాల అస్మద్ పితృదేవతల్లో...,
జమ్మికుంట గ్రామ వాస్తవ్యులుగా, వారికాలంలో అర్.ఎం.పి డాక్టర్ గారిగా ప్రసిద్ధినొందిన మా తాతగారు......
కీ.శే || శ్రీ అయిత హనుమయ్య గారి 9వ సంవత్సరిక తిథి, "మార్గశిర బహుళ విదియ" సందర్భంగా పితృదేవతావందనపూర్వకంగా చిరుకవనకుసుమాంజలి...
ఓం శాంతిః శాంతిః శాంతిః..
💐💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment