Wednesday, March 20, 2024

శ్రీ ఓరుగల్లు భద్రకాళి ఆలయం, వెయ్యిస్తంభాల శ్రీరుద్రేశ్వరాలయం, శ్రీ ఐనవోలు మల్లన్న ఆలయం, దర్శించిన తదుపరి మదిఫలకంపై జాలువారిన కొన్ని ఈశ్వరానుగ్రహ మధురస్మృతుల సంచయసమాహారం...🙂💐🍒🎉🍨🇮🇳

శ్రీకరమైన "ఐశ్వర్యం ఈశ్వరాదిఛ్చేత్" అనే నానుడి యొక్క వివరణను సద్గురు శ్రీచాగంటి గారి ప్రవచనాల్లో చాలా సార్లు వినడం విజ్ఞ్యులకు గుర్తుండే ఉంటుంది...
భృగు మహర్షి యొక్క క్రోధ వాక్కుల కారణంగా ఈశ్వరుడు అరూపరూపి అయిన శివలింగంగా భూలోకంలో పూజలందుకోవడం అనే పురాణకథనం చాలా మందికి గుర్తుండే ఉంటుంది....
బహు కొద్ది క్షేత్రాల్లో శివలింగం లో పాటుగా శివుడు సదరు నామరూపాత్మక సమూర్త్యారాధన కూడా గైకొనే ఆలయాల్లో ఒకటిగా, తెలంగాణ పౌరాణిక గ్రామీణ వారసత్వ సంపదగా అలరారే అరుదైన ఆలయాల్లో ఒకటిగా ఐలోని మలన్న ఆలయాన్ని భక్తులు కీర్తింతురు...

అంటే ఒకానొక చారిత్రక ఐతిహ్య కారణంగా ఈశ్వరుడు నామరూపాత్మకదైవికస్వరూపవైభవంతో అలరారిన కథనంలో భాగంగా, ఆ ప్రాంతంలో అలా వెలిశాడు అనే శ్రౌతపురాణ వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా అలరారే ఈశ్వరానుగ్రహవైచిత్రిని మనం ఇటువంటి ఆలయపరిసరాల్లో తిలకించవచ్చు....
దేశకాలవిశేషం అనేది అనాదిగా ఈ లోకంలో, ప్రత్యేకించి మూడు సముద్రాలు మూడువైపుల సరిహద్దులుగా గల బహువైభవభరిత భూలోకప్రాంతమైన భారతదేశంలో ఎంతో ప్రసిద్ధినొందిన అంశం....

పొద్దున ఇడ్లీలోకి సాంబార్ చట్ని తిన్నారుకద...
మరి ఇప్పుడు మధ్యాహ్నం అన్నం / భోజనంలోకి పప్పు కూర ఎందుకు...అదే సాంబార్ చట్నీతోనే కానియొచ్చుకద....
అని అంటే మనమిచ్చే సర్వసాధారణ సమాధానం...
"ఇంట్లో ఉన్నప్పుడు ఇడ్లీ అల్పాహారం అలా లైట్ గా చట్నీతో కానివ్వడం ఉదయం అనే దేశకాల ఆహార విశేషం...
అన్నం / భోజనం పప్పు / కూర / పెరుగు తో కానివ్వడం మధ్యాహ్నం అనే దేశకాల ఆహార విశేషం....."
ఇవ్విధమైన భోజన సంప్రదాయాన్ని మీరు ప్రత్యేకత అనే పేరుతో గౌరవించినప్పుడు...,
సర్వతంత్రస్వతంత్రుడైన ఈశ్వరుడి అవతార అర్చాది విశేషాలను కూడా భగవదనుగ్రహ ప్రత్యేకత అని మీరు నిర్వచించి గౌరవించవలసి ఉంటుంది...

అనగా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు హరిద్రాకుంకుమ తిలకం మన నొసటన అలకరించినప్పుడు, మరియు వెయ్యిస్థంభాల శ్రీరుద్రేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు విభూతిరేఖలు మన నొసటన అలకరించినప్పుడు, అక్కడ ఉన్నది మరియు ఇక్కడ ఉన్నది కూడా సర్వేసర్వత్రావ్యాపించి ఉండే పరమాత్మే...
ఒక్కోచోట ఒక్కో సంప్రదాయ వైభవంతో, నామరూపాత్మక ప్రాశస్త్యంతో, పౌరాణిక ఐతిహ్యంతో, అలరారే భగవద్ సిద్ధాంతాన్ని మీరు పరిపూర్ణత్వం అని విశ్వసించి అంటున్నారా....?
లేక మీకు తోచిన ఏదో ఒక భేదాన్ని ఆపాదించి మీకు గ్రాహ్యమైన ఏవో కొన్ని వాక్యాలను సిద్ధాంతాలుగా చిత్రికరిస్తున్నారా..?
అనే అంశమే సదరు భక్తుడి భావవైశాల్యానికి, మేధోపరిణతకు, విజ్ఞ్యతకు, వివేకానికి గీటురాయి...

సామాన్య ప్రజల సమస్యలను, విన్నపాలను ఆలకించి, 
అనుగ్రహించడానికి నేను, ఫలాన సమయానికి, ఫలాన చోట, ఫలాన ఆహార్యంతో, ఫలాన ఆంతరంగిక బృందంతో, 
ఫలాన విధంగా నా ఉనికిని వ్యక్తపరుస్తాను అని ఒక ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో సంకల్పిస్తే ఎవరు కాదనగలరు...?

అచ్చం అదేవిధంగా...,
సామాన్య భక్తుల సమస్యలను, ప్రార్ధనలను ఆలకించి, 
అనుగ్రహించడానికి నేను, ఫలాన సమయానికి, ఫలాన చోట, ఫలాన ఆహార్యంతో, ఫలాన ఆంతరంగిక బృందంతో, 
ఫలాన విధంగా నా ఉనికిని వ్యక్తపరిచి / కొలువైఉంటాను అని ఒక దేవతో, దేవుడో సంకల్పిస్తే ఎవరు కాదనగలరు...?
ఎవ్వరూ కాదనలేరు...ఎందుకంటే అది వారు అలంకరించి ఉన్న సర్వతంత్రస్వతంత్రానుగ్రహదాయక సిమ్హాసనం యొక్క శక్తి...

అవ్విధంగా ఎందరో దేవీదేవతల అనిర్వచనీయ, అగ్రాహ్య, అప్రమేయ దైవికశక్తి ఈ భారతావని నలుచెరగుల వివిధ పుణ్యక్షేత్రాలుగా, తీర్థాలుగా అనాదిగా దేశకాల విశేషానుగుణంగా కొలువైఉంటున్నది అని అనడం ఎంతమాత్రము అతిసయోక్తి కానేరదు సరికదా ఆ దైవికవైభవాన్ని గుర్తించి, దర్శించి, సమ్రక్షించి, భావితరాలకు అందించి తరించడంలోనే గొప్పదనము వైభవము శ్రేయస్సు ఉండును....

శ్రీ ఓరుగల్లు భద్రకాళి ఆలయం, వెయ్యిస్తంభాల శ్రీరుద్రేశ్వరాలయం, శ్రీ ఐనవోలు మల్లన్న ఆలయం, దర్శించిన తదుపరి మదిఫలకంపై జాలువారిన కొన్ని ఈశ్వరానుగ్రహ మధురస్మృతుల సంచయసమాహారం...🙂💐🍒🎉🍨🇮🇳


No comments:

Post a Comment