Wednesday, March 20, 2024

శ్రీ శోభకృత్ 2024 మాఘ శుద్ధ పంచమి / సౌమ్యవాసర ప్రయుక్త శ్రీపంచమి పర్వదిన శుభాభినందనలు....💐

శ్రీ శోభకృత్ 2024 మాఘ శుద్ధ పంచమి / సౌమ్యవాసర ప్రయుక్త శ్రీపంచమి పర్వదిన శుభాభినందనలు....💐
శ్రీసరస్వతి అమ్మవారి విశేష ఆరాధనకు అనాదిగా ఖ్యాతిగడించిన ఉత్సవం మాఘశుద్ధ పంచమి / శ్రీపంచమి పండగ...🙂

ఒక్క వాక్యంలో శ్రీసరస్వతి అమ్మవారి వైభవం / ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే...
"ఈ భువిపై ఉండే సర్వోన్నతమైన నదిగా తనకు కూడా వరం కావాలి అని పరమాత్మను అడిగిన సరస్వతీదేవికి, 
"ఇదివరకే గంగానదికి ఆ వరం ఇవ్వబడిన కారణంగా, అందుకుప్రతిగా అత్యంత మహిమోపేతమైన తిరుమల శ్రీస్వామిపుష్కరిణీ తీర్థం యొక్క బ్రహ్మస్థానంలో, అనగా మధ్యలో,  
(ఎనిమిది దిక్కుల్లో ఆవహించి ఉండే ఎనిమిది వివిధ సూక్ష్మరూప తీర్థాలకు అదనంగా) సర్వోన్నతమైన తీర్థంగా అలరారేలా కొలువైఉండే వరాన్ని అందుకున్న అత్యంత శక్తివంతమైన శ్రీసరస్వతీ అనుగ్రహాన్ని....ప్రత్యక్ష సరస్వతీదేవిగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీతిరుమలేశుడు తన బ్రహ్మోత్సవ తిరువీధి వాహనోత్సవ సేవల్లో కచ్ఛపి అనే వీణను ధరించిన హంసారూఢసరస్వతి అమ్మవారి గా భక్తులకు దర్శనమిచ్చేంతటి వైభవం...."
అనేది భక్తులందరికీ విదితమైన విశేషమే....

కాస్త కుంకుమతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కరుణించేస్తుంది శ్రీపార్వతీదేవి....
కొంత పరిశ్రమ గావించి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కరుణిస్తుంది శ్రీలక్ష్మీదేవి....
ఎంతో కఠోర పరిశ్రమ గావించి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తేనే కరుణించును శ్రీసరస్వతీదేవి....

ఎందుకంటే 

1. వస్తూపోతూ ఉండేది పార్వతమ్మ అనుగ్రహం....,

"మొన్నటివరకు నేనే దొంగలందరికీ దొరను అని అడవిలో తిరిగిన ఒక పొగరుబోతు తోడేలు, ఇప్పుడు నేను కూడా అందరిలో ఒకణ్ణి...అని అంటున్నదంట...."
అనే మాటలు వినే ఉంటారు....

2. ఎప్పుడైననూ, ఎట్లైననూ లభించగలది..
ఎప్పుడైననూ, ఎట్లైననూ లుప్తమవ్వగలది..
లచ్మమ్మ అనుగ్రహం....,

"మొన్నటివరకు వారానికొక ఫంక్షన్ పేరుతో మంది సొమ్ముతో జల్సాల్లో మునిగితేలిన సదరు పొగరుబోతు,
ఇప్పుడు అందరి చుట్టూ అప్పులకోసం తిరుగుతున్నాడంట..."
అనే మాటలు వినే ఉంటారు....

3. వచ్చి ఎప్పటికీ ఉండి సదరు వ్యక్తి యొక్క శాశ్వత వైభవానికి అద్దంపట్టే అమరసిరి సరస్వతమ్మ అనుగ్రహం...

"ఆ రోజుల్లో MBBS డాక్టర్ గా రోజుకు పదిమంది పేషెంట్లకు వైద్యం అందించే సదరు డాక్టర్ గారు ఇప్పుడు M.D / FRCS (లండన్) చదువులు చదివి, ఒక కార్పొరేట్ హాస్పటల్ కి హెడ్ గా వందలాది పేషెంట్ల వైద్యానికి సారధిగా ఉన్నారంట..."
అనే మాటలు వినే ఉంటారు....

చదువైనా, సంగీతమైనా, సాహిత్యమైనా, మరే లలితకళైనా సరే, శ్రీశారదానుగ్రహాన్ని సముపార్జించుకున్న ధన్యజీవుల రసనపై నర్తించే గీర్వాణి యొక్క అధీనంలోనే ఉంటుంది యావద్ ప్రపంచంలోని శ్రీవైభవం...

ధవళవర్ణరంజితమైఉండే మేలిమి క్వాలిటి రాజస్థాన్  పాలరాయి తో మలచబడిన ఒక చిన్నపాటి వీణాపాణి మూర్తిగా, మా బి.వి.ఆర్.ఐ.టి, కాలేజ్ లో కొలువైన శ్రీసరస్వతీ మందిరం, మామూలుగా చూడ్డానికి ఒక ప్రాశాంతమైన ఆకుపచ్చని లాన్లో, నాలుగు స్తంభాలతో అమరిన కప్పుక్రింద కొలువైన శ్రీసరస్వతీ మందిరంలా కనిపించినా...
ఎంతటి శక్తివంతమైన వైరించికళతో కొలువై ఉంటుందో అక్కడ విశ్రమించే ఇంజనీరింగ్ స్ట్యూడెంట్స్ ఎందరికో తెలిసిన సత్యం...

నా ఫస్ట్ఇయర్లోని ప్రార్ధనలను ఆలకించి,
నా సెకండియర్లోనే ఏకంగా శ్రీవిద్యాగణపతిని సశాస్త్రీయ సవైదిక ఆగమోక్త ఆలయంలో కొలువుదీరేలా అనుగ్రహించిన కారుణ్యమూర్తిగా ఇప్పటికీ మరియు ఎప్పటికీ నేను ఆ శక్తివంతమైన శ్రీశ్వేతసరస్వతీదేవి అనుగ్రహాన్ని అందుకున్న ఎందరో బి.వి.అర్.ఐ.టి ఎన్జినీరింగ్ డిస్టింక్షన్ అచీవర్స్ లో ఒకడిగా, నా జీవితానికి ఎన్నో అనుగ్రహాలను అందించిన, అందిస్తున్న, అందించే మహాసరస్వతి గా, మా బి.వి.అర్.ఐ.టి కాలేజ్ లాన్లోని సరస్వతీమందిరం నాకు ఎప్పటికీ సదా స్మరణీయం....

"Only sky is the limit.." అనేది మా బి.వి.ఆర్.ఐ.టి కాలేజ్ స్లోగన్....

శ్రీసరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా అచ్చం అదే విధంగా ఉండునది ...

ఫలాన వ్యక్తి ఒక 500 కిలోలు లేపగల పైల్వాన్ అని మీరు ఒకరి శ్రీశర్వాని అనుగ్రహ శక్తిని మేయపరచగలరేమో....

ఫలాన టాటా, బిర్లా, అంబాని, అదాని, ఒక 500 కోట్ల శ్రీమంతుడు అని మీరు ఒకరి శ్రీలక్ష్మీ అనుగ్రహ శక్తిని మేయపరచగలరేమో....

కాని

ఫలాన మాన్యుల విద్వత్తు ఇంత అని మీరు ఒకరి శ్రీసరస్వతీ అనుగ్రహ శక్తిని ఎప్పటికీ మేయపరచలేరు...
కేవలం వారి విద్వత్ స్థాయిని ఫలాన డిగ్రీతో సూచించడం వరకు మాత్రమే మీరు చేసేది....

ఫర్ ఎగ్సాంపుల్

ఫలాన డాక్టర్ గారి విద్వత్తును మీరు MBBS అనే ఒక డిగ్రీతో సూచించగలరు కాని...వారి విద్వత్తును మేయపరచగలరా..??

అనగా...

సదరు డాక్టర్ గారు, వారి జీవితకాలంలో ఇంతమంది పేషెంట్స్ ని ట్రీట్ చేయగలరు అని మీరు మేయపరచగలరా..??

సదరు డాక్టర్ గారు, వారి జీవితకాలంలో ఎంతటి కాంప్లెక్స్ వైద్యాన్ని అందించగలరో మీరు మేయపరచగలరా..??

సదరు డాక్టర్ గారు, వారి జీవితకాలంలో ఇన్ని రకాల టాబ్లెట్స్ ని ప్రెస్క్రైబ్ చేయగలరు అని మీరు మేయపరచగలరా..??

కాబట్టి సదరు డాక్టర్ గారిలో శ్రీవైద్యనాథరూపస్థిత సరస్వతీ శక్తి ఎప్పటికీ అమేయమే...కద...

ఇవ్విధంగా శ్రీసరస్వతీ శక్తి ఎప్పటికీ ఈ లోకాన్ని శాసించే సర్వోన్నతమైన శక్తిగా ఆరాధింపబడుతూ వివిధ మాన్యుల్లో వివిధ రీతుల...
"ముఖే ముఖే సరస్వతీ..." గా కొలువై ఉండి ఈ లోకంలో శాంతియుతజీవనానికి, ఆయురారోగ్యైశ్వర్యాలకు కారణమౌతున్నది అనేది విజ్ఞ్యులెల్లరికీ విదితమైన సత్యం...

శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో,
"ఓం సచామరరమావాణి సవ్యదక్షిణసేవితాయై నమః"
అనే శ్రీలలితాసహస్రనామం యొక్క ప్రాశస్త్యాన్ని ఎంతో గొప్పగా వివరించడం చాలా మంది విజ్ఞ్యులకు గుర్తుండే ఉంటుంది....

కాబట్టి శ్రీసరస్వతీదేవి అనుగ్రహంతో సమ్మిళితం కాని కేవల లక్ష్మీ అనుగ్రహం ఎప్పటికీ శ్రేయోకారకం కానేరదు....

ఫర్ ఎగ్సాంపుల్,

రోజూ ఒక 10 రూపాయలు ఖర్చుపెట్టుకోగల స్థాయిలో ఒకరికి అమరిన శ్రీలక్ష్మీ కటాక్షాన్ని, వారు రోజూ ఒక సిగరెట్ కొనుక్కునేందుకే ఉపయోగించుకుంటే, వారికి లుప్తమైన శ్రీసరస్వతీ కటాక్షం వల్ల, వారు క్యాన్సర్ కి ఆవాసంగా మారి..,
వారి, వారివారి, వారి చుట్టూ ఉండే వారి జీవితాల్లో క్యాన్సర్ కి కారకులైన నిత్యదరిద్రులే అవుతారు కాని....

నెలకు 300 రూపాయల పాకెట్ మనితో,
ఓ 100 రూపాయలు ఒక ఆలయంలో సమర్పించే, 
ఓ 100 రూపాయలు కొబ్బరిచట్నీ కోసం కొబ్బరికాయలు కొనుక్కునే, ఓ 100 రూపాయలు పల్లీపట్టీలు, నువ్వుల ఉండలు, కొనుక్కుతింటూ బ్రతికే ధన్యజీవులైపోరు...

అత్యంత సామాన్య స్థాయిలోని ఈ ఎగ్సాంపుల్ నుండి, అత్యంత సమున్నతమైన స్థాయిలో ఉండే ఏ ఎగ్సాంపుల్ వరకైనా.....సరే

జ్ఞ్యానదాయకమైన...
శ్రీసరస్వతీదేవి ఆరాధన, గణపతి ఆరాధన, శివారాధన, శివాంశసంభూతుడైన ఆంజనేయారాధన, హయగ్రీవారాధన, భూవరాహస్వామి ఆరాధన, లుప్తమైన జీవితానికి లభించే తత్కాల లక్ష్మీఅనుగ్రహం అనేది,
ఇంధనం లుప్తమైన విమానంలోని ప్రయాణం వంటిది...
అది అట్టి మూర్ఖులతో అంటకాగే వారిని కూడా సద్యోపతనం దిశగా ఈడ్చివేస్తుంది....

మా అఘ = మాఘ
పాపరహిత / పుణ్యభరిత మాసం ఈ పవిత్రమైన శక్తివంతమైన మాఘమాసం...

" పంచమిపంచభూతేశి పంచసంఖ్యోపచారిణి " అని స్తుతింపబడే ఆదిపరాశక్తికి ఎంతో ప్రీతికరమైన తిధి పంచమి...

మాఘపంచకం అనే పేరుతో పిలవబడే ఎంతో అద్భుతమైన ముహూర్తాలకు నెలవైన కాలనికి ప్రారంభసమయం ఈ మాఘమాసం....

కాశ్మీర సర్వజ్ఞ్యపీఠాన్ని అధిరోహించే సమయంలో శ్రీఆదిశంకరులతో సంవాదం గావించిన ఆ జ్ఞ్యానసరస్వతీ అనుగ్రహం ఈ భారతావని యొక్క విజ్ఞ్యులెల్లరినీ అనుగ్రహించుగాక అని ఆశిస్తూ....
ఇట్టి...మహత్వభరిత మాసంలో మహిమాన్వితమైన శ్రీసరస్వతీదేవి అమేయానుగ్రహ సముపార్జనకు గొప్ప కాలాంతర్గతమైన విశేషంగా అనాదిగా విజ్ఞ్యులచే ఆచరింపబడే మాఘ శుద్ధ పంచమి / శ్రీపంచమి పర్వదినోత్సవ శ్రీసరస్వతీదేవి ఆరాధనతో విజ్ఞ్యులెల్లరూ తరించెదరు గాక... అని ఆకాంక్షిస్తూ.......

ఇట్టి మహిమాన్వితమైన 2024 శ్రీపంచమి పర్వసమయాన్ని పురస్కరించుకొని, కచ్ఛపి అనే వీణను ధరించి, వరిష్ఠవైరించికళలతో తళుకులీనే శ్రీ వర్గల్ జ్ఞ్యానసరస్వతీ అమ్మవారి ఆలయంలో నిర్వహింపబడే సామూహిక అక్షరస్వీకార కార్యక్రమంలో పాల్గొని, మా పాప బాలప్రణవి కి అక్షరాభ్యాస సంస్కారాన్ని అందించి, శ్రీ వర్గల్ జ్ఞ్యానసరస్వతీ అమ్మవారి దర్శనానుగ్రహంతో తరించడం నా పురాకృత సుకృతం...💐🙂

భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం
లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్ ।
చలచ్చంచలాచారుతాటంకకర్ణాం
భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 

శారదే పాహిమాం...శంకరా రక్షమాం...
శ్రీశారదాంబా నమోస్తుతే...
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment