శ్రీకరమైన శ్రీ శోభకృత్ మాఘ బహుళ త్రయోదశి ప్రయుక్త రాబోయే 2024 మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు....🙂
శ్రీఆదిశంకరాచార్యులవారు ఎందరో దేవీదేవతలపై ఎన్నో మహాత్భుతమైన మహిమాన్వితమైన సంస్కృతస్తోత్ర సారస్వతాన్ని అనుగ్రహించతదుపరి, ఎంతో ప్రౌఢ అధ్యాత్మకావ్యపటిమతో చాలా సరళమైన పదాలమాటున ఎంతో సారసభరిత సర్వేశ్వరత్వాన్ని శివతత్త్వంగా అనుగ్రహించింది వారి ఈ క్రింది " నిర్వాణషట్కం " స్తోత్రంలో....
*********** *********** *********** ***********
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం
మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే ।
న చ వ్యోమ భూమిర్-న తేజో న వాయుః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 1 ॥
న చ ప్రాణ సంజ్ఞో న వైపంచవాయుః
న వా సప్తధాతుర్-న వా పంచకోశాః ।
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 2 ॥
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః ।
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 3 ॥
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః ।
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 4 ॥
న మృత్యుశంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః ।
న బంధుర్-న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 5 ॥
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ ।
న వా బంధనం నైవర్-ముక్తి న బంధః ।
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 6 ॥
శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం, శివోఽహం శివోఽహం
*********** *********** *********** ***********
ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రంలోని ఈ క్రింది నాల్గవ చరణాన్ని విశ్లేషిస్తూ, ఆ ఈశ్వరుడు అనుగ్రహించినంతమేర శివతత్త్వాన్ని కవనపరుస్తాను.....
*********** *********** *********** ***********
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః ।
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోఽహం శివోఽహమ్ ॥ 4 ॥
అర్థతాత్పర్యం ::
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
*********** *********** *********** ***********
మీరెప్పుడైనా రాజేంద్రప్రసాద్ గారు నటించిన
"ఆ నలుగురు" సినిమాను చూసారా...?
చూడకపోతే ఒకసారి చూడండి...
పేరుకు కేవలం మరో సినిమా అని అనిపించినా....
ఆ సినిమాలో ఉన్నంత ప్రాక్టికల్ వేదాంత తత్త్వం మరియు ఈ ప్రపంచం యొక్క నిజస్వరూప విశ్లేషణ మరే సినిమాలో లేదేమో.....
Line 1:
పుణ్యపాపాలు ఉండేవి ఎవరికి..?
సకల మనుష్యకోటికి...ఎందుకంటే
"కర్మసంచితంలో, మొత్తం పుణ్యమే ఉంటే దేవతా ఉపాధి...
మొత్తం పాపమే ఉంటే తిర్యక్ (జంతు/సరీసృప/అండజ/కీటకాది అధోముఖ) ఉపాధి...
పుణ్యపాపముల మిశ్రమం ఉంటే మనుష్య ఉపాధి... "
అని శ్రీచాగంటి సద్గురువులు వివరించడం శ్రద్ధాసక్తులతో
ప్రవచనాలను ఒక శ్రౌతయజ్ఞ్యం లా (శృణ్వన్ తపః)
అందుకున్న చాలా మంది విజ్ఞ్యులకు గుర్తుండే ఉంటుంది...
సుఖదుఃఖాలు ఉండేవి ఎవరికి..?
ప్రాపంచిక చట్రంలో భాగమైన సకలప్రాణికోటికి....
[
ప్రపంచం = ప్ర పంచం = ప్రహృష్టమైన
(జన్మించుట,
పెరుగుట,
మార్పుచెందుట,
తరుగుట,
లయించుట,
అనే)
పంచ తత్త్వములతో అలరారే చేతనాచేతనాత్మక సమూహం
]
Line 2:
మంత్రము, తీర్థము, వేదము, యజ్ఞ్యము...ఎవరికి....?
మననముతో సమ్రక్షింపబడుటకు సాధనం మంత్రం....
పానముతో శ్రేయస్సును పొందుటకు సాధనం తీర్థం....
వల్లెవేయడంతో / ఆమ్నాయం గావించడంతో అమేయబుద్ధివైభవం సమకూరడానికి సాధనం వేదం...
సకలధార్మిక ఈప్సితములు ఈడేరుటకు సాధనం యజ్ఞ్యం...
Line :3
భోజనం - భుజింపబడు పదార్ధం
భోజ్యం - భుజింపబడుట
భోక్త - భుజించువాడు
ఫర్ ఎగ్సాంపుల్...
"గతసంవత్సరం వచ్చినప్పుడు, వయసులో ఉన్నప్పటి నుండి నాకు తెలిసిన ఒక ముసలాయన ఇక్కడ స్వామివారి కళ్యాణకర్తగా ఉండి స్వామివారి అమేయానుగ్రహానికి పదేపదే బాగా నమస్కారాలు పెడుతూ ఉండేవాడే...
ఆయాసపడుతున్నా సరే ఆలయానికి వచ్చే ఆయన ఈసారి భోజనాల దెగ్గర కూడా కనిపించడం లేదే...."
అని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అడిగినప్పుడు...
" ఈనాటి అల్ట్రామాడర్న్ కాలంలో కూడా ప్రాచీన ఆహార్యం తో తిరిగే, ప్రాచీన ఆహారాన్ని ఇష్టపడే, ప్రాచీన ఆచారవ్యవహారాలను, ఆచార్యులను, గౌరవించే ఆ ముసలాయన ఈ మధ్యే కైవల్యాన్ని గడించారంట..ఇప్పుడు ఆయన పిల్లలు కళ్యాణకర్తలుగా ఉండి స్వామిని సేవిస్తున్నారంట......"
అని ఒక వ్యక్తి సమాధానమిస్తే అందలి అర్ధం ఏంటి..?
"సంచితం అనబడే కర్మసంచయంలోని ఫలానా కర్మలను ప్రారబ్ధం గా మొసుకొచ్చి, ఈశ్వరానుగ్రహంతో సదరు వ్యక్తి గా జన్మించి, వాటి తాలూకా పాపపుణ్య ఫలితాలను జీవితంలో సుఖ దుఃఖాలుగా అనుభవిస్తూ, కొత్తగా ఆచరింపబడే కర్మలను ఆగామికర్మలుగా సంచయపరుస్తూ, ఒకానిక సమయంలో ఈశ్వర శాసనంగా తనువు చాలించాడు..."
అనేది అందలి అర్ధం...
కార్యాకారణ సిద్ధాంతానుగుణంగా,
ఇక్కడ కారణం సదరు జీవుడి జన్మాంతరార్జిత కర్మసంచయం...
కార్యం జన్మాంతర్గతంగా కర్మఫలానుభవం...
మరి ఈ యావద్ కర్మచట్రంలో ఈశ్వరుడి పాత్ర ఏంటి...ఎక్కడ...ఎందుకు...ఎలా...?
అనే సందేహం విజ్ఞ్యులెల్లరికీ రాగల సందేహమే....
"నేను అది కాదు..ఇది కాదు...ఏదీ కాదు...
నేను చిదానంద స్వరూపమైన శివుణ్ణి..."
అని పరమేశ్వరుడు వచించడంలోని ఆంతర్యమేమి...?
[ కాలడి శంకరులు భువిపైనడయాడిన సాక్షాత్తు కైలాస శంకరులే అనేది అధ్యాత్మ జగత్తుకు విదితమైన సత్యమే కాబట్టి.....శంకరుల వాక్కు, శివుడి వాక్కే...కాబట్టి....'పరమేశ్వరుడు వచించడం' అని సంబోధించాను....]
మీరెప్పుడైనా ఒక ప్రధానన్యాయమూర్తి యొక్క పాత్రను గమనించారా...?
కోర్ట్ / న్యాయస్థానం అనే ఒకానొక సభలో, అన్నిటికీ, అందరికీ సాక్షిగా ఉంటూ, అందరి వాదప్రతివాదనలను ఆలకిస్తూ, అందరికంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని అలంకరించిఉండే సర్వోన్నతమైన శాసక, సూచక, అనుగ్రహ, అనునయ, అధికార వినిమయాన్ని కలిగిఉండే న్యాయకోవిదుల వ్యవస్థమొత్తానికి కూడా సాధికార బాధ్యాతాయుత ప్రతినిధే ప్రధానన్యాయమూర్తి గారు.....
"ప్రజాసేవక వృత్తిలో ఉంటూ, అధికార దుర్వినియోగంతో ఫలాన వ్యక్తులను హింసించి, దాన్ని ఒప్పుకోకుండా ఇంతగా రాద్ధాంతం చేసినందుకు, అందరినీ పక్కదారిపట్టిస్తూ కోర్టువారి విలువైన సమయాన్ని వృధాచేసి అగౌరవపరిచినందుకుగాను,
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ముద్దాయిని దోషిగా ప్రకటిస్తూ, యావజ్జీవకారాగారశిక్షను విధించడమైనది....."
అనో...లేక....
"ఫలాన చర్యను ఆత్మరక్షణకై గావించాను....అని కోర్ట్ వారికి సవినయంగా విన్నవించినందుకు గాను,
ఇంకోసారి అలాంటి చర్యలు పునరావృతం కారాదు అని మందలిస్తూ ముద్దాయిని నిర్దోషి గా ప్రకటించడమైనది..."
అనో...లేక....
"ఫలాన చర్యను పొరపాటున తొందరపాటులో తెలియక గావించాడు....అని కోర్టులో నిరూపించబడినది కావున ఇంతకుముందు విధింపబడిన శిక్షను రద్దు చేస్తూ, ముద్దాయిని కోర్టు వారు నిర్దోషి గా ప్రకటించడమైనది..."
అనో...లేక....
"ఫలాన పనికిమాలిన కారణాలను నెపంగా చూపుతూ, ఫలాన వ్యక్తిని / వ్యక్తులను, ఎన్నోవిధాలుగా బాధించి, వారి వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను, గోప్యతను, అగౌరవపరిచి....,
శారీరకంగా, మానసికంగా వేధించి...,
వ్యక్తిత్వ హననంతో అవమానించి బాధించినందుకు...,
ఆ వ్యక్తిని అనునయించేందుకు, సదరు బృందానికి ఫలాన జరిమాన విధించడమైనది"
అనో...లేక....మరో విధంగానో....
ఆ సర్వోన్నత శాసక, సూచక, అనుగ్రహ, అనునయ, అధికార వినిమయాన్ని కలిగిఉండే న్యాయకోవిదుల వ్యవస్థమొత్తానికి కూడా సాధికార బాధ్యాతాయుత ప్రతినిధి గారు,
అనగా చీఫ్ జడ్జి గారు..., తీర్పును వెలువరించడం గురించి ఏదో ఒక సినుమాలో చూసే ఉంటారు కద....
అచ్చం అదేవిధంగా....
ఈశ్వరుడు కూడా చీఫ్ జడ్జి గారు...!
మనం గావించే దేవతాప్రార్ధనలే నిత్య వాదప్రతివాదనలు...
మనల్ని నిత్యం పరికించే సూర్య, చంద్ర, తారకలే సాధికార సాక్ష్యులు...
ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, దశదిక్కులు, నవగ్రహాలు, అష్టవసువులు, సప్తసముద్రాలు, షడృతువులు, పంచభూతాలు, చతుర్వేదాలు, త్రికాలాలు,
(అనగా వాటి అధిదేవతా ప్రత్యధిదేవతా శక్తులు)
ఈ వైశ్విక వ్యవస్థయొక్క విజ్ఞ్యులైన న్యాయవాదులు....
ఇక్కడ మన సద్బుద్ధే మనకు డిఫెన్స్ లాయర్....
పెసరుపప్పు పై అమితమైన యావతో బ్రతుకుతూ, ఆఖరికి గతించే సమయంలో కూడా పెసరుపప్పు తినడం గురించే ఆలోచిస్తూ తనువుచాలించిన వ్యక్తి పెసరుపప్పులో కీటకంగా పునర్జన్మను పొంది పెసరుపప్పును భుజించడమే జీవితంగా ఉండే కథనం గురించి, శ్రీచాగంటి సద్గురువులు ఒకానొక ప్రవచనంలో చమత్కరించడం గురించి కొందరిలోకొందరికైనా గుర్తుండేఉంటుంది......
అట్టి సందర్భోచిత విశ్లేషణ యొక్క స్మరణగా, శ్రీచాగంటి గారి మధురమైన పలుకుల్లో ఎన్నో సార్లు ఒలికిన ఈ శివానందలహరి (శ్రీఆదిశంకరవిరచితం) లోని 10వ పద్యం యొక్క స్ఫురణ చాలామందికి గుర్తుండే ఉంటుంది......
నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానన్ద లహరీ
విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా || (10)
ఓ పరమశివా! మనుష్య జన్మకానీ, దేవ జన్మకానీ, పర్వతారణ్యములయందు మృగముగాకానీ, పశువు, దోమ, కీటకములు, పక్షులు ఇత్యాది జీవులలో దేనిగా నేను జన్మించినప్పటికీకూడ, నీ పాదాంబుజముల నిరంతర స్మరణమనెడి పరమానంద ప్రవాహములో విహరించుటయందు ఆసక్తి కలిగిన హృదయము నాకు కలిగినట్లయితే, ఎటువంటి శరీరములో జన్మను తీసుకుంటేమాత్రమేమి? (ఓ ఈశ్వరా! నాకు ఫలానా జన్మనే ప్రసాదించమని నిన్ను కోరను; పూర్వ కర్మానుసారము ఏ జీవిగానైననూ జన్మించెదనుగాక, కానీ పైన తెల్పినట్టి గుణములు కలిగిన హృదయమునుమాత్రము నాకు ప్రసాదించవలసినదిగా నిన్ను ప్రార్ధించుచున్నాను.)
కాబట్టి...
చాలా చాలా సింపుల్ టర్మినాలజి లో ఈశ్వరవైభవం గురించి వివరించాలంటే...
ఒక కీటకం గా జన్మించవలసిన కర్మఫలం సదరు జీవుడిదైతే....
ఈశ్వరభక్తి కారణంగా, రోడ్డుపైన దుమ్ముధూళిలో ఉండే కీటకంగా కాకుండా....
ఏ పురి, తిరుమల ఆలయ వీధుల్లో భక్తులు భుజించిన ప్రసాదశేషంపై వాలే కీటకంగానో...
లేక
ఏ మహానుభావుడి త్రికాలగాయత్రి శక్తిని అలదుకున్న ఆహారశేషంపై వాలే కీటకంగానో...
జన్మింపజేసి, సకలకర్మక్షయాన్ని కలిగించి, మరుజన్మలోనే
సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షాన్ని బడసి తరించేలా అనుగ్రహించే వైభవం ఆ ఈశ్వరుడిది....
ఆ ఈశ్వరానుగ్రహవైభవాన్ని అందుకొని తరించే సౌభాగ్యం సదరు జీవుడిది...
ఇదే భగవద్భక్తి యొక్క గొప్పదనం...!
" చిదానందరూపః శివోహం శివోహం "
అనే వాక్యం యొక్క అసలైన అర్ధం ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించారా...?
ఆనందం ఎక్కడ ఉన్నది...?
శరీరంలోనా...?
శివపుత్రుడు సినిమాలో విక్రం లా స్నానం చేయకుండా ఉంటే ఆనందం సంగతి దేవుడెరుగు...మన మనసే దుఃఖపడుతూ వెళ్ళి స్నానం చేసిరా మహాప్రభో అని ప్రభోధిస్తుంది....
శరీర స్పందనలను శాసించే మనసులోనా....?
ఎప్పుడు ఎందుకు ఎట్ల వ్యవహరిస్తదో తెలియని చంచలమైన మనసులో అననందమెక్కడుండును...?
ప్రతిస్పందించే మనసు ఆశించే భౌతిక సంపద లోనా..?
వేలకోట్ల సంపద ఉన్నవారు హాస్పటల్లోనే ఎక్కువగా ఉంటున్నారు...ఇక సంపదలో అనందమెక్కడుండును...?
కాబట్టి అన్నింటినీ వివేచనాత్మకతో పరికించే చిత్తంలోనే ఉంటుంది ఎవరి ఆనందమైనా సరే..
అట్టి వివేచనలో కేవలం లౌకిక అంశాలే కాకుండా...అలౌకిక ఈశ్వరస్పృహ తో కూడిన ఈశ్వరానుగ్రహ వైభవ విభూతి స్మరణం అనేది మననంతో కూడిన నిధిధ్యాసనం అయినప్పుడు....
ఆ చిత్తం ఆనందానికి ఆవాసమవుతుంది...
అట్టి చిత్తములో కొలువైన ఈశ్వరస్వస్వరూపభాసయే శివం అని అనబడును....
అట్టి శివమే నీవు...
అట్టి శివమే నేను...
అట్టి శివమే సకల చరాచర విశ్వంలో నిండినిబిడీకృతమైన శివతత్త్వం..
అట్టి శివోహ స్థితిలో మన చిత్తం ఓలలాడినాడు, మన సంకల్పమే శివసంకల్పమౌను....అందుకే శ్రీరుద్రం "ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయేత్...." అని ఎంతో ఘనంగా వచిస్తోంది....
ఈశ్వరుడికి గల ఎన్నో నామాల్లో
"ఓం సుధాతనవే నమః" అనేది ఒక గొప్ప నామం...
యావద్ విశ్వం ఒక శివలింగాకృతితో అలరారుతోంది కాబట్టి, చంద్రుడు వర్షించే చల్లని అమృతసుధాధారల్లో భాసించే వ్యోవవ్యాప్త తిరుమేనితో అలరరారే పరమేశ్వర స్వస్వరూప వైభవం అని మనం నిర్వచించగలం...
మరి తత్త్వతః "ఓం సుధాతనవే నమః" అనగా ఏంటి...? ఎప్పుడు ఎక్కడ అట్టి పరమేశ్వర సందర్శనం లభించేది...?
పైన నిర్వచింపబడిన లౌకిక ఈశ్వరవైభవాన్ని, ధ్యానస్థితిలో ఈశ్వరానుగ్రహంగా ఒడిసిపట్టిన వారికి ధ్యానసిద్ధిగా లభించే సర్వేశ్వర చంద్రమౌళీశ్వర తత్త్వమే,
"ఓం సుధాతనవే నమః" యొక్క ఆంతర దర్శనం....
ఫర్ ఎగ్సాంపుల్, ఒకసారి చిదంబరం వెళ్ళినప్పుడు, ఈశ్వరుడి విశేషానుగ్రహంతో అలా మిరుమిట్లుగొలిపే శుద్ధతదియ నాటి చంద్రరేఖను ధరించిన చిదంబర నటరాజమూర్తిని దర్శించిన మనసు...ఆనాటి నుండి...
"ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-
జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః ।
అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్
ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం-విఀప్రోఽభిషించే-చ్చివమ్ ॥
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలిత-శశికలా-శ్చండ కోదండ హస్తాః ।
త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్ ॥
"
అనే శ్రీరుద్రపఠన మననంలో, ఆ మిరుమిట్లు గొలిపే చిదంబర నటరాజమూర్తి ధరించిన శుద్ధతదియ నాటి చంద్రరేఖే నాకు జ్యోతకమవుతూ ఉంటే...
అప్పుడు నా తనువంతా ఒకానొక పులాకాంకితస్థితిలో అనుభవించే అమృతసుధామయరసాస్వాదనే
" ఓం సుధాతనవే నమః" అనే ఈశ్వరనామం యొక్క నిజమైన సందర్శనం అని సదరు భక్తుడు నిర్వచించేది....
అప్పుడు ఆ కైలాస స్థిత గౌరీశంకరుడు, కాయజ శివతత్త్వములో ప్రకటితమయ్యే శివుడిగా భక్తుడు అందుకొని ఆరాధించినట్టు లెక్క.....
అప్పుడే, ఎక్కడో ఉండే శివుణ్ణి నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఎలా అయినా ఉంటావు, నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడైనా ఉంటావు, ఇత్యాదిగా మనం స్తుతించే శివతత్త్వానికి ఒక పరిపూర్ణత సమకూరినట్లు....
శివశక్తులు ఎప్పటికీ అద్వయంగా సంఘటితమై ఉండే దేవతా తత్త్వాలే...
ఎందుకంటే, V=IR అనే ఎలెక్ట్రిసిటి ఈక్వేషన్ సరిగ్గా అర్ధమైన వారు చెప్పేది...
మారుతున్న రెసిస్టర్ వాల్యు కి అనుగుణంగా మారే రెండు
సంఘటితమై ఉండే సైంటిఫిక్ తత్త్వాలే...వోల్టేజ్ V & కరెంట్ I.
వోల్టేజ్ శివుడైతే, కరెంట్ శక్తి...
"మీ ఇంట్లో వోల్టేజ్ మాత్రమే ఉంది..."అని ఎవరైనా ఆన్నా...
"మీ ఇంట్లో కరెంట్ మాత్రమే ఉంది.." అని ఎవరైనా ఆన్నా...
అది హాస్యాస్పదమైన వచనం అవుతుంది...
ఎందుకంటే....
మా ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి మరియు ఇతర అన్ని విద్యుత్ పరికరాలకు కూడా సరఫరా అయ్యే వోల్టేజ్ 230 V గా ఉండే స్థితి శక్తి...
ఆయా పరికరాల్లో ఉన్న రెసిస్టర్ వాల్యూ కి అనుగుణంగా నిత్యం సరఫరా అవుతూ ఉండే చరశక్తి / గతిశక్తి కరెంట్...
నా ఇంట్లో ఉన్న వోల్టేజ్ ని కొలవాలంటే మీరు వాడాల్సింది వోల్ట్ మీటర్...
నా ఇంట్లో ఉన్న కరెంట్ ని కొలవాలంటే మీరు వాడాల్సింది అమ్మీటర్...
నా ఒంట్లో ఉన్న వేడిని కొలవాలంటే మీరు వాడాల్సింది థర్మామీటర్...
నా ఒంట్లో ఉన్న బి.పి ని కొలవాలంటే మీరు వాడాల్సింది స్పిగ్మోమానోమీటర్...
మీ దెగ్గర మేయపరిచే పరికరాలు లేనంతమాత్రాన....
మా ఇంట్లో వోల్టేజ్, కరెంట్ లేనట్టు కాదుకద....
మీ దెగ్గర గ్రాహ్యపరిచే పరికరాలు లేనంతమాత్రాన....
నా ఒంట్లో వేడి, బి.పి లేనట్టు కాదుకద....
అచ్చం అదే విధంగా ఈ విశ్వమంతా నిండినిబిడీకృతమై ఉండే శివతత్త్వాన్ని, శక్తితత్త్వాన్ని, సంఘటిత శివశక్తితత్త్వంగా గ్రాహ్యపరిచే తత్త్వ సాధనములు మీకు ఇంకా సమకూరనంతమాత్రాన...
ఈ లోకంలోని శివశక్తి తత్త్వం భక్తిశ్రద్ధలతో ఆరాధించినవారికి గ్రాహ్యమవ్వకుండా ఉండడం ఉండదుకద...
ఎల్లరూ మహాదేవుడి అనుగ్రహంతో రాబోయే 2024 మహాశివరాత్రి పర్వసమయంలో, జాగరణలో / లింగోద్భవకాలంలో శివతత్త్వ స్మరణతో తరించెదరుగాక.....
ఆ శివతత్త్వస్మరణలోని మహత్తును మరో కవనకృతి / పోస్ట్ లో విశదీకరిస్తా...
*********** *********** *********** ***********
శివ మానస పూజా స్తోత్రం
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ॥ 2 ॥
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా ।
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ॥ 3 ॥
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః ।
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ॥ 4 ॥
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ ।
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥ 5 ॥
*********** *********** *********** ***********
No comments:
Post a Comment