శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేదనిశం
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
💐💐💐💐💐💐
🙂
నీ వక్షస్థలకమలంలో కొలువుతీరిన శ్రీవ్యూహలక్ష్మి అమ్మవారి మహిమ్నతను తద్వారా శ్రీశ్రీనివాసుడిగా ఆనందనిలయ అష్టదళపద్మపీఠంపై వీరస్థానకధృవమూర్తిగా కొలువుతీరిన
నీ మహిమ్నతను, నీ కరుణను, నీ అనుగ్రహాన్ని కొనియాడాలంటే....
భూమి అంతా కాగితం అవ్వాలి...
జీవనదులు మరియు సప్తసముద్రాలు సిరా అవ్వాలి...
శ్రీవ్యాసమహర్షి వారు సరస్వతీ నదీతీరంలో మళ్ళీ ఒకసారి ఆసీనులవ్వాలి.....
వినాయకుడు కలం పట్టాలి...
అప్పుడు నీ అశేష అప్రతిహతవైభవమంజరుల కావ్యదొంతరలు ఈ లోకానికి శ్రీవేంకటేశ్వర ప్రపత్తి యొక్క ప్రాభవాన్ని వివరించడమనే అద్భుతఘట్టం అవిష్కృతమవ్వాలి...☺️
ఎందుకంటే...
వేంకటాద్రిసమంస్థానం బ్రహ్మాండేనాస్తికించన
వేంకటేశసమోదేవో నభూతోనభవిష్యతి
శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షపరమాత్మగా కొలువుతీరి ఉన్న శ్రీవేంకటాద్రి యొక్క మాహాత్మ్యము అనిర్వచనీయము అని
మహాతపస్విని శ్రీ తరిగొండవెంగమాంబ విరచిత శ్రీవేంకటాచలమాహత్మ్య గ్రంథం (ఈ పోస్టుకు జతపరచబడిన రెండు ప్రతుల్లోని వివరణ ప్రకారంగా) వివరిస్తోంది కాబట్టి .....🙂
వినావేంకటేశం ననాధోననాధః సదావేంకటేశం స్మరామిస్మరామి
హరేవేంకటేశ ప్రసీదప్రసీద ప్రియంవేంకటేశ ప్రయచ్ఛప్రయచ్ఛ
🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల హృదయంలో ఆ మధురిమ ఈ విధంగా ఒక సుప్రసిద్ధ సంకీర్తనయై పరిఢవిల్లింది...
చ::
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ
ప1::
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులేయేరులైనది
కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ
శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ
ప2::
సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ
ప3::
వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/79katteduraa-vaikuntamu.html?m=1
No comments:
Post a Comment