Wednesday, March 20, 2024

శ్రీబాలరాముడు అయోధ్యా శ్రీరామమందిరంలో ఎంతో వైభవంతో కొలువైన శ్రీశోభకృత్ నామ సంవత్సర 2024 పుష్య శుద్ధ ద్వాదశి శుభవేళ...భారతావని నగుమోముపై చిరునవ్వుల ఆనందదివ్వెలు వెలిగేవేళ...యావద్ ప్రపంచలోని శ్రీరామ భక్తులకు, హనుమద్ భక్తులకు శుభాభినందనలు...☺️💐💐💐🌟🍿✨🪷🍕🍨🍇🎉🇮🇳🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

శ్రీబాలరాముడు అయోధ్యా శ్రీరామమందిరంలో ఎంతో వైభవంతో కొలువైన శ్రీశోభకృత్ నామ సంవత్సర 2024 పుష్య శుద్ధ ద్వాదశి శుభవేళ...
భారతావని నగుమోముపై చిరునవ్వుల ఆనందదివ్వెలు వెలిగేవేళ...
యావద్ ప్రపంచలోని శ్రీరామ భక్తులకు, హనుమద్ భక్తులకు శుభాభినందనలు...
☺️💐💐💐🌟🍿✨🪷🍕🍨🍇🎉🇮🇳
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

శ్రీవిశ్వామిత్ర మహర్షి వారి అభ్యర్ధన మేరకు అటు ఇచ్చిన మాటను తిరస్కరించలేక ఇటు తన గారాల 16 సంవత్సరాల కౌమార ప్రాయ కొడుకును అడవికి రాక్షసులతో యుద్ధానికి పంపించలేక సతమతమవుతున్న ఆనాటి దశరథుడి స్థితిలా ఉన్న ఈనాటి అయోధ్యలో, ఆనాటి బాలరాముడి లా ఉన్న మూర్తి కొలువైన ఈ సమయం, కలియుగ అయోధ్యాపురికి, తద్వారా యావద్ భారతావని వైభవానికి ఒక కొత్త శ్రీకారం చుట్టబడినట్లుగా ఉన్నది కదు ఈ బాలరాముడి మూర్తి యొక్క సోయగం...🙂

ఈ భారతావని నిత్యం ఆరాధించే దేవీదేవతలు ఎందరో ఉన్నా కూడా, శ్రీరాముడిది అప్పుడు ఇప్పుడు మరియు ఎల్లప్పుడు ఎంతో ప్రత్యేక వైభవం....ఎందుకంటే..
నరవానరులు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవలసిన జాతులు కాదులే...అనేంతటి చులకనభావనతో ఆనాడు పౌలస్త్యుడు బ్రహ్మాగారితో పలికినమాటలను విన్న పరమాత్మ,
ఒక అనన్యసామాన్యమైన సాధారణ నరుడిగా జన్మించి, 
ఏ నరవానరులను అంత చులకనచేసి మాట్లాడి బ్రహ్మగారి ముందు తన గర్వాన్ని ప్రదర్శించాడో అట్టి నరవానరులుగా ప్రభవించిన వివిధ దేవతా శక్తుల చేతిలో హతుడైన రావణుడి కథనం శ్రీలంకలో ఇప్పటికీ వారి దేశాన్ని పాలించిన రాజు యొక్క గాథగా ప్రాచుర్యంపొంది ఉండగా,
మన దేశంలో ఇన్నాళ్ళకు ఆ శ్రీరాముడి అయోధ్యలో శాశ్వత శ్రీరామవైభవానికి ప్రత్యక్ష చిహ్నంగా వెలసిన ఈ బాలరాముడి మూర్తి, సనాతనభారతీయ ఇతిహాస వైభవసిగలో అలంకరింపబడిన మరో కలికీతురాయి..

అయోధ్య మధుర మాయ కాశి కాంచి అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికాః

అనే అత్యంత ప్రాచుర్య ఆర్షవాంగ్మయంలోని 7 మోక్షపురాల్లో....

అయోధ్యకు ఎందుకంత ప్రాచుర్యం అని అడిగితే విజ్ఞ్యులైన చిన్నపిల్లలు కూడా అది శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలి కాబట్టి అని చెప్తారు....
మరి అట్టి అయోధ్యలో శ్రీరాముడి వైభవం భావితరాలకు నిత్యం తారసపడేలా ఒక భవ్యమందిరస్థాపన సర్వదా శ్లాఘనీయమే కద....!

రామరావణ యుద్ధంలో రాముడిచేతిలో రావణుడు పరాభవం చెందాడు అని అందరూ అంటుంటారు.....
కాని నిజానికి శ్రీరాముడు 16 వత్సరముల కుమారుడిగా ఉన్నప్పుడే జనకమహారాజు గారు నిర్వహించిన సీతాస్వయంవరంలోనే రావణుడు రాముడి ముందు పరాభవింపబడెను అనేది జగమెరిగిన సత్యమే....
ఆ రాముడిలోకే కదా పరశురాముడి తేజస్సు లయించినది...
ఆ రాముడి కోదండ టంకారానికే కద దండకారణ్యంకోని రాకాసిమూక గడగడలాడినది...

ప్రౌఢయవ్వన ప్రాయంలోని శ్రీరాముడిగా, అయోధ్య నగరం రాజధానిగా, కోసల మహాసామ్రాజ్య చక్రవర్తిగా 500 నదుల జలాలతో పట్టాభిషిక్తుడయ్యేసరికే శ్రీమద్రామాయణం అంతా కూడా బాల, కౌమార, యవ్వన ప్రాయంలోని శ్రీరాముడి కథనంగా రూపుదిద్దుకుంది...

దశవర్షసహస్రాని దశవర్షశతానిచ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి...

అనే శ్రీమద్రామాయణ శ్లోకం ప్రకారంగా 11000 సురాజ్యపరిపాలనానంతరం శ్రీరాముడు సరయునదీ ప్రవేశంతో ఈ భూలోకాన్ని వీడెను...
అనే అంశంలో మనం గమనించవలసింది....
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా, కేవలం రావణసమ్హారం మాత్రమే లక్ష్యంగా ఉండిఉంటే యుద్ధకాండ తర్వాత కొన్ని సంవత్సరాలకే శ్రీరాముడు తన అవతారప్రయోజనం సిద్ధింపబడినది కాబట్టి తన దైవిక మానుష దేహాన్ని త్యజించడం అనే ఘట్టం జరిగి ఉండేది...

అట్లు కాక...

ఒక ఆదర్శ కొడుకుగా...
ఒక ఆదర్శ అన్నగా...
ఒక ఆదర్శ భర్తగా...
ఒక ఆదర్శ మితృడిగా...
ఒక ఆదర్శ ప్రభువుగా...

మనిషి ఎంతో గొప్పపేరును గడించగలడు అని ఈ భూలోకవాసులకు తన జీవిత కథనంగా తెలియజెప్పిన ఒక ఆదర్శ వ్యక్తిత్వంగా...ఈ భువిపై నడయాడిన అప్రతిహత సుక్షత్రియవీరుడిగా, వినుతికెక్కిన శ్రీరాముడి ధర్మపయనం శ్రీమద్రామయణ ఇతిహాసమై, ఆనాటి త్రేతాయుగం గడిచి ఇప్పటికీ మూడుకోట్ల పైచిలుకు సంవత్సరాలు గడిచినా సరే....చెక్కుచెదరని వైభవంతో పరిఢవిల్లే ఆర్షవాంగ్మయంగా, గౌరవించి విశ్వసించేవారిని తరింపజేస్తున్న వేదోపబృహ్మణంగా శ్రీమద్రామాయణం విజ్ఞ్యులకు బహుధా ప్రీతికరమై ఉండే ఆదికావ్యం...!

శ్రీచాగంటి సద్గురువులు పలికినట్లుగా, మీరు కేవలం ఒక నరుడి కథగా విన్నా కూడా ఎంతో అనుగ్రహాన్ని వర్షించే మహత్వభరిత కావ్యం శ్రీమద్రామాయణం...
ఇక శ్రీరాముడు సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి దిగివచ్చి అవతరించిన శ్రీమహావిష్ణువు అనే విశ్వాసంతో సావధానచిత్తులై ఆలకించినచో ఆ అనన్యసామాన్యమైన శ్రీవైష్ణవతేజస్సు యొక్క కథనం వర్షించే అనుగ్రహం కూడా అనన్యసామాన్యమైనదిగానే ఉండును....
అది ఆనాటి రామరావణ యుద్ధానంతరం దేవతలు వర్షించిన పుష్పవృష్టి నుండి శ్రీచాగంటి సద్గురువులు ఎంతో నిష్టాగరిష్ఠులై ఒక మండల దీక్షగా స్వాధ్యాయంతో నుడివిన సంపూర్ణశ్రీమద్రామాయణ ప్రవచనాలప్పుడు మేఘమండలోపరిస్థిత దేవతలు కురిపించిన వర్షానుగ్రహం వరకు....ఈ లోకానికి విదితమైన సత్యం...

"మెరిసేటి మిగతా మామూలు రాళ్ళమాదిరి కాకుండా...అవి వజ్రవైఢూర్యాలు పొదగబడిన మేలిమి బంగారు నగలు..." అని తాతానానమ్మలు వారి కాలం నాటి ఏడువారాల నగలగురించి చెప్తే అవి ఈనాటికి కూడా కొందరు ఎంతో గొప్ప గౌరవమరియాదలతో భద్రంగా చూసుకుంటారు...ఎంతో వైభవంగా అలంకరించుకుంటారు...కద...

అచ్చం అదే విధంగా, శ్రీమద్రామాయణభారతభాగవతాలు కూడా మన పూర్వీకులనుండి ఎంతో గౌరవమరియాదలతో పరంపరాగతంగా భావితరాలకు అందివ్వబడుతున్న అమూల్యమైన ఆర్షవిజ్ఞ్యాన సారస్వతసిరులు..అని విజ్ఞ్యులచే నుడవబడినప్పుడు వాటిని అంతే గౌరవమరియాదలతో అందుకొని తరించడంలోనే వైభవం, శ్రేయస్సు ఉండును...

శ్రీమద్రామాయణాంతర్గత
ఆదిత్యహృదయం,
జయమంత్రం,
సుందరకాండ,
పట్టాభిషేకసర్గ,

బుధకౌశికముని విరచిత శ్రీరామరక్షాస్తోత్రం,
తులసీదాసకృత హనుమాన్ చాలీస,

ఈ ఆర్షసారస్వతసిరులు ఎంతటి మహిమోపేతమైనవో విజ్ఞ్యులకు తెలిసినదే...

కాబట్టి శ్రీరాముడు భారతదేశవైభవానికి ప్రతీకగా అలరారిన, అలరారే, ఒక అద్భుతసుగుణనిధిగా పరిఢవిల్లిన దైవిక వ్యక్తిత్త్వం...
అందుకే ఇప్పటికీ ప్రతీ పునర్వసు నక్షత్రపర్వోత్సవంగా,
ఈ కలియుగప్రత్యక్ష దైవమైన శ్రీతిరుమలేశుడు, తన గర్భాలయంలో కొలువైఉండే శ్రీకోడందరామమూర్తి గా తన ఊరెరిగింపు సేవలో అలనాటి త్రేతాయుగ శ్రీరామవైభవాన్ని 
ఎల్లరికీ ఎరుకపరుస్తూ అలరారుతున్నాడు...
తిరుమల ఆలయ దక్షిణప్రాకారంలో, భక్తులకు తీర్థవితరణ గావించే ప్రదేశంలో కొలువైఉండే ఆజ్ఞ్యాపాలక హనుమ మూర్తిగా, ఇప్పటికీ ఆ మారుతి తన వినయంతో శ్రీవేంకటరాముడి వైభవాన్ని ఇనుమడింపజేస్తూనే ఉన్నాడు..🙂

అదే కోదండం...అదే శరం...అదే చిన్మయసోయగం...
అదే కారుణ్యకటాక్షవీక్షణం...
దక్షిణ అయోధ్యగా భాసిల్లే శ్రీభద్రాచల ఆలయస్థిత శ్రీసీతారామచంద్రమూర్తి యొక్క వైభవం స్వామివారు కూర్చున్న శైలిలో కొలువైఉంటే....
అయోధ్య శ్రీరామమందిర స్థిత శ్రీబాలరాముడి వైభవం స్వామివారు నిల్చున్న శైలిలో కొలువైఉన్నట్టు ఉంది కదు...🙂

భర్జనంభవబీజానాం ఆర్జనంసుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం 

శ్రీరామచంద్రం శ్రితపారిజాతం
సీతాముఖాంభోరుహచంచరీకం
సమస్తకళ్యాణగుణాభిరామం
నిరంతరంశుభమాతనోతు

శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏



No comments:

Post a Comment