శ్రీ శోభకృత్ నామ సంవత్సర 2024 పుష్యబహుళపంచమి శుభసమయంలో, శ్రీకరమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరాజరాజేశ్వర స్వామి మరియు కొండగట్టు శ్రీవీరాంజనేయస్వామి వారి దర్శనభాగ్యం....🙂💐
ధర్మానికి ప్రతిరూపం వృషభం....
అట్టి వృషభం శివుడికి వాహనం...
అట్టి శివుడు శ్రీరాజరాజేశ్వరి సమేతుడిగా శ్రీరాజరాజేశ్వరుడిగా కొలువై "కోడె మొక్కు" పేరుతో ఎద్దులతో పాటు భక్తులు తనకు ప్రదక్షిణం గావించడం సత్సంప్రదాయంగా స్థిరీకరించి, తద్వారా గోవృషభ సంతతి పరిఢవిల్లడం, సనాతనధర్మవైభవానికి ఉనికిపట్లుగా ఉండే గోవృషభ ఈశ్వరాలయ సముదాయాలు నిత్యకళ్యాణంపచ్చతోరణం గా వర్ధిల్లడం ఇందలి ఆంతర్యం.....
శివకేశవ అభేద తత్త్వానికి నిలయంగా అలరారే అపురూప ఆలయమైన శ్రీవేములవాడ ఆలయంలో, ధర్మగుండాన్ని దర్శించి, క్షేత్రపాలకుడైన శ్రీకాలభైరవుడి ఉపాలయానికి సమీపంలో ఉండే శ్రీబాలరాజేశ్వర దర్శనం ప్రథమవిధి...
ఆతరువాత ప్రదక్షిణగా ప్రాకారం చుట్టూ తిరుగుతూ కోడె మొక్కును సమర్పించి, ఆలయప్రవేశం గావించి గణపతిని, శ్రీరాజరాజేశ్వరుణ్ణి, శ్రీరాజరాజేశ్వరిని దర్శించడం క్షేత్రాచారానవాయితి..
ఆతదుపరి ఆలయపరిసరాల్లో కొలువైన శ్రీబద్దిపోచమ్మ, శ్రీభీమేశ్వరస్వామి, శ్రీనాగేశ్వరస్వామి ఇత్యాది ఆలయాలను దర్శించి, నమస్కరించి, కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్ళడం బహుపుణ్యభోగభాగ్యప్రదాయకంగా భావించడం, అనాదిగా తెలంగాణ పరిసర ప్రాంతాల భక్తులెందరో ఆచరించే సత్సంప్రదాయ భగవద్వైభవవిశేషం....
దట్టమైన అటవీప్రాంతంలో కొండపై శ్రీలక్ష్మీవేంకటేశ్వర సమేతంగా స్వయంభువుగా వెలసిఉన్న శ్రీఆంజనేయస్వామి వారిని దర్శించడంతో శ్రీవేములవాడ తీర్థయాత్ర సంపూర్ణమవ్వడం అనేది అనాదిగా ఇక్కడి పెద్దలు పాటించే
నైసర్గికాచార సంప్రదాయ వైభవం...
గ్రామీణ ప్రాంత భక్తులందరూ నిత్యం శ్రీవేంకటాచలానికి వచ్చి తనను దర్శించడం దుర్లభమైనందున, అత్యంత దయాళువైన గోవిందుడు ఇలా అక్కడక్కడా వివిధ పుణ్యక్షేత్రాల్లో,
(చిల్కూర్, కొండగట్టు, ద్వారకాతిరుమల, ఇత్యాది) వివిధ ఐతిహాసిక వైభవంతో కొలువైఉండడం భక్తుల భాగ్యవిశేషం...
ఓం హరనమః పార్వతీపతయే హరహరమహాదేవ శంభోశంకర...
ఓం హరిమర్కటమర్కటాయనమః..
ఓం శ్రీలక్ష్మీవేంకటేశపరబ్రహ్మణే నమః....
🙂💐💐
No comments:
Post a Comment