శ్రీకరమైన శాస్త్రం అనేది ఎవరికి, అనేదానితో సంబంధం లేకుండా, ఫలనా చర్యకు ఫలానా ప్రతిచర్య / ఫలితం ఉండును అని మాత్రమే చెప్తుంది....అది ఏ శాస్త్రమైన సరే...
ఫర్ ఎగ్సాంపుల్, పాకశాస్త్రం / వంటశాస్త్రం ఏమని చెప్తుంది...
"తేనె మామూలుగా ఉండే రూం టెంపరేచర్ లేదా అంతకంటే తక్కువ టెంపరేచర్ వద్ద (ఫ్రిడ్జ్ లో నిలువచేసినప్పుడు), మాత్రమే స్వీకరించవలెను....హై టెంపరేచర్స్ లో వేడెక్కిన తేనె
స్వీకరిస్తే అది ఆరోగ్యాన్ని పాడుచేసే విషంగా పరిణమిస్తుంది..." అనేది ఒక సింపుల్ ఆహారసూత్రం....
ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వరకు మాత్రమే శాస్త్రం యొక్క కర్తవ్యం...
ఒకరు పాటించడం / పాటించకపోవడం అనేది శాస్త్రానికి అనవసరం...
శాస్త్రాన్ని పాటిస్తే శ్రేయస్సు...
శాస్త్రాన్ని పాటించకపోతే నష్టం...
అనేది ఆయా వ్యక్తుల విజ్ఞ్యతకు సంబంధించిన,
ఇతరులకు సంబంధించని, వ్యక్తిగత అంశం...
అదే విధంగా...
వాస్తుశాస్త్రం అనేది ఒక ప్రాచీనమైన శ్రేయోకారక శాస్త్రం...
అది విశ్వసించడమా...
విశ్వసించకపోవడమా...
పాటించడమా...
పాటించకపోవడమా...
అనేది ఆయా వ్యక్తుల విజ్ఞ్యతకు సంబంధించిన, ఇతరులకు సంబంధించని, వ్యక్తిగత అంశం...
"1. నిత్యం తూర్పు / ఉత్తరాలకు ఉండే దైనందిన నడక, సంపూర్ణ శ్రేయస్సు...
2. నిత్యం తూర్పాగ్నేయానికి / ఉత్తరవాయవ్యానికి ఉండే దైనందిన నడక, శారీరక / మానసిక ఆరోగ్య నష్టం..."
3. నిత్యం పశ్చిమ / దక్షిణాలకు ఉండే దైనందిన నడక, ప్రశాంతంగా దీర్ఘమైన శ్వాసతీసుకోవడానికి కూడా తీరికలేనంత బిజిబిజిగా ఉండే అలసట భరిత జీవితం...
4. నిత్యం నైరుతి దిశగా ఉండే దైనందిన నడక, సకలవిధమైన దరిద్రం / నష్టం / హాని..."
అనేవి ఓ నాలుగు సింపుల్ జెనెరిక్ వాస్తుశాస్త్ర సిద్ధాంతాలు...
ఇందుకు తగ్గట్టుగా ఒక చక్కని శుభప్రదమైన గృహాన్ని నిర్మించుకొని జీవిస్తామా లేక వాస్తుశాస్త్రాన్ని విస్మరించి స్వీయసిద్ధాంతాలతో ఉండే అసమంజసమైన గృహంలో ఉంటామా...
అనేది ఆయా వ్యక్తుల విజ్ఞ్యతకు సంబంధించిన,
ఇతరులకు సంబంధించని, వ్యక్తిగత అంశం...
నువ్వు నాలుగో తరగతి చదివిన వాడివైతే, మూడో తరగతి వరకు మాత్రమే నీ పాఠ్యాంశాల బోధనా పరిధి.....
నువ్వు పదో తరగతి చదివిన వాడివైతే, తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే నీ పాఠ్యాంశాల బోధనా పరిధి.....
అదే విధంగా, జీవితం అనే పాఠశాలలో,
నువ్వు పదో తరగతి కూడా సరిగ్గా చదవకుండా,
" జీవితంలో తారసపడే వివిధ మనుష్యులు మరియు వారివారి మనస్తత్త్వం / బౌద్ధిక పరిణత / విజ్ఞ్యత / శ్రేణి" అనే అంశంపై, Ph.D/M.Phil చదివే వారికి బోధించాలని చూస్తే,
హనుమంతుడి ముందు కుప్పిగంతులలా, అవి హాస్యాస్పదమైన నిరర్ధక బోధలు / శుష్కప్రయాసలు / పసలేని వాదనలు / పనికిమాలిన అరుపులు మాత్రమే అవుతాయ్....
నిత్యజీవితం అనే వైకుంఠపాళి ఆటలో నూరోగడిని చేరుకోవడానికి ముఖ్యమైన అంశం నిచ్చెనలు ఎక్కడం కాదు...పాములు మింగకుండా జాగ్రత్తగా ఉండడం...
పేపర్ బోర్డ్ & డైస్ తో ఆడే స్నేక్ & ల్యాడర్ ఆటలో అన్నీ క్లియర్ గా కనిపిస్తాయ్ కాబట్టి ఆటలో పురోగమించడం కొంత తేలికే....
కాని, జీవితం అనే వైకుంఠపాళి ఆటలో
ఏది, ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా.....
ఒక సంఘటన, ఒక వ్యక్తి, ఒక కారణం, ఒక సమయం,
ఒక తీరు...
మన జీవనమార్గంలో పాముగా, లేక నిచ్చెనగా, పరిణమిస్తుందో విశ్లేషించడం అంత తేలిక కాదు కాబట్టే "జీవితం అనేది మన పాపపుణ్యాల తాలూకా ఒక అగోచర నాటకం" అని విజ్ఞ్యులైన పెద్దలు అంటారు....
శ్రీకరమైన గోదావరి తనదార్లో తను ఎంతో గంభీరంగా, గుంభనంగా ప్రవహిస్తూ ఉంటుంది....
తీరానికి వెళ్ళి తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వమంటే దయతో ఇస్తుంది...
ఇంకొంచెం ముందుకు వెళ్ళి తీర్థస్నానానికి ప్రవాహంలో మజ్జనం గావించాలి అని అంటే దయతో కరుణిస్తుంది...
ఇంకొంచెం ముందుకువెళ్ళి అవతలి తీరానికి చేరుకోవాలి అని అంటే ఈదుకుంటూ వెళ్ళడానికి అనుమతిస్తుంది...
కాని ఏకంగా గోదావరి గమనాన్ని మార్చేందుకు నదిమధ్యలో అడ్డుగా నిల్చొని, పొగరుతో ఏదో సాధించాలని చూస్తే మాత్రం ఈడ్చేసి తనలోకి లయించివేస్తుంది....
సాధుసజ్జనులు కూడా అంతే...
ఎవ్వరికీ ఇబ్బందికలగకుండా ఉండే...
వారి దార్లో వారిని,
వారి జీవితంలో వారిని,
వారి విజ్ఞ్యతకు వారిని,
వదిలేయాలి...
కాదు కూడదు అని వారి జీవితాన్ని ఇష్టమొచ్చినట్లు శాసించాలని అనుకుంటే మాత్రం, వారి ఉగ్రగోదావరి స్వరూపాన్ని తట్టిలేపిన చందంగా ఉంటుంది...
Life is not always about just marching ahead....
It is about being vigilant enough to tread properly, so that not many corrections are required to our journey at the cost of our peace of mind, in-order to achieve the very purpose of being fruitful...
No comments:
Post a Comment