హైదరాబాద్, కూకట్పల్లి, వివేకానందనగర్ కాలని, వాటర్ ట్యాంక్ పరిసరాల్లో, బిల్వవృక్ష ఛాయలలో కొలువుదీరి 33 సంవత్సరాలుగా భక్తభాగవతుల పట్ల అమేయ వాత్సల్యదైవిక వైభవంతో అలరారుతున్న శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి త్రయస్త్రింశత్ (33వ) వార్షిక పాంచాహ్నిక బ్రహ్మోత్సవ పర్వసమయ విశేషం ఆసన్నమవ్వబోతున్న తరుణంలో....
స్వామి వారి విశేషానుగ్రహంతో భక్తులెల్లరూ తరించెదరు గాక అని ఆకాంక్షిస్తూ శ్రీనివాస శ్రీపాదపద్మముల చెంత చిరుకవనకుసుమాంజలి...🙂💐
ఈ బ్రహ్మోత్సవాలకు ఏతెంచే 33 కోట్ల (గణముల) దేవతాశక్తులు స్వామివారి విశేషమహిమ్నతను విశ్వవ్యాప్తం గావించెదరు గాక...💐🪷🍨🎉🏵️🌟
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
బ్రహ్మగారికి ప్రత్యక్షంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహింపబడకున్నా, మీరు గమనించి ఉండి ఉంటే అన్ని వరిష్ఠ ఉత్సవాలు, పూజలు, వైభవాలు, ఆర్భాటాలు కూడా బ్రహ్మ గారి గౌరవగౌణగుణకంగానే ఈ లోకంలో శ్లాఘింపబడుతుంటాయ్....
ఫర్ ఎగ్సాంపుల్...
ఒక గొప్ప రుచికరమైన పాయసం వడ్డిస్తే...
"అబ్బా...బ్రాహ్మాండంగా అమృతంలా ఉంది...ఏది ఇంకొంచెం వడ్డించండి..." అని అంటారు...
ఒక గ్రాండ్ ఫంక్షన్ కి వెళ్ళొస్తే...
"అబ్బా...ఎంత బ్రాహ్మాండంగా నిర్వహించారో ఫంక్షన్...
మేము కూడా అట్లే చేద్దామని అనుకుంటున్నాము..."
అని అంటారు...
"బ్రహ్మగారిని, మరియు వారు సృష్టించే బ్రహ్మాండాన్ని మీరేమైనా చూసారా..?
మరి 'అబ్బో...బ్రహ్మాండంగా ఉంది....'
అని ఏలా అంటున్నారు...ఎందుకంటున్నారు...?
అందలి ఆంతర్యమేమి... ?"
అనే సందేహం విజ్ఞ్యులకు రాకమానదు కద....
కొంచెం అక్షరాలను అటు ఇటు చేసి చూడండి...
భ్రమ
బ్రహ్మ
సరైన ఉచ్ఛారణ లోపిస్తే ఈ రెండు పదాలు కూడా దాదాపుగా ఒకేలా అనిపిస్తాయ్...
1.
అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా...
అని అంటారు ఒక కమర్షియల్ సినీకవి...
పాతతరం 'దేవదాసు' సినిమాలో....
(భ్రాంతి, భ్రమ పర్యాయపదాలు...)
2.
"ముసిముసి నవ్వులలోనా...కురిసెను పువ్వులవాన...
బ్రహ్మఒక్కడే...పరబ్రహ్మఒక్కడే..."
అని అంటారు మరో కమర్షియల్ సినీకవి...
(మోహన్ బాబు గారి "బ్రహ్మ" సినిమాలో...యేసుదాస్ గారి ఈ అమరగానం చాలామందికి గుర్తుండే ఉంటుంది...)
ఇక్కడ 'బ్రహ్మ' అంటే, ' సృష్టికర్త ' అని పిలువబడే ఒక నిర్ణీత కాలపరిధి గల దేవలోక / సత్యలోక పదవిని అలంకరించే వారు....
ఆ పదవిని అలకరించిన వారిని "బ్రహ్మాగారు" అని సంబోధిస్తారని.. మరియు...
ఆ పదవీకాలాన్ని "బ్రహ్మకల్పం" అని సంబోధిస్తారని...
మరియు...సినిమాల్లో చూపెట్టినట్టుగా పెద్ద గడ్డం మీసం తో కాకుండా...బ్రహ్మగారు కూడా ఇతర దేవతా ఉపాధుల్లో ఉండే త్రిదశులు ఉన్నట్టుగానే....ఉంటారని...
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో వివరించడం...
కొద్దిమందికైనా గుర్తుండే ఉంటుంది....
3.
"బ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే...పరబ్రహ్మమొక్కటే..."
అని అన్నారు మన అన్నమాచార్యులు.....
వారి "బ్రహ్మమొక్కటే...." అనే సుప్రసిద్ధ సంకీర్తనలో....
ఇక్కడ "బ్రహ్మము" అనగా సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే పరమాత్మ అని అర్ధం...
ఇప్పుడు మీకు
భ్రమ,
బ్రహ్మ,
బ్రహ్మము / పరబ్రహ్మము,
అనే పదాలకు గల అంతరము, మరియు అందలి ఆంతర్యం పై అవగాహన వచ్చింది కాబట్టి..
ఇక మన అసల్ టాపిక్ గురించి చర్చిద్దాం....
ఎంతో విశేషమైన వామనావతార వైభవాన్ని వర్ణించే సుప్రసిద్ధ అన్నమాచార్యుల సంకీర్తన....
"బ్రహ్మ కడిగిన పాదము...
బ్రహ్మము తానెని పాదము..."
ఈ సంకీర్తనలో ఎంతోమంది భక్తులకు ఎంతగానో ఇష్టమైన 3వ చరణంలోని సాహితీ సరాన్ని ఒకసారి పరికిస్తే.....
"పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము"
అని అనుగ్రహించారు శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు...
సృష్టికర్తగా బ్రహ్మ గారు నిర్వహించే ప్రక్రియను ఒక సింపుల్ ఎగ్సాంపుల్ తో వివరించాలంటే...
శ్రీచాగంటి సద్గురువులు ఉదహరించే ఒక వాక్యాన్ని ఆలంబనగా గావించి వివరించే ప్రయత్నం చేస్తాను...
"మహామయావిశ్వంభ్రమయసి పరబ్రహ్మమహిషీం..."
అనే వాక్యం యొక్క వివరణ శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో చాలామంది చాలాసార్లు వినే ఉంటారు...
ఒక hypothetical immeasurable and eternally spinning roller coaster moving at a decently slower pace so that anyone can be off-loaded at any given point in time in-order to continue with a similar roller coaster journey in a new seat from the so called yet another new beginning...
అనే ప్రక్రియను మనం ఎగ్సాంపుల్ గా తీస్కొని...
అది నడిపించేది బ్రహ్మాగారు అని...
కొత్త సీట్ అనగా ఒక కొత్త జన్మ/శరీరం అని...
మళ్ళీ కొత్తగా అదే తరహా ప్రయాణం మొదలు అని అంటే ఒక కొత్త ఉపాధి లో జన్మించడం, జీవించడం, లయించడం...అనే నిరంతర భ్రమణ ప్రక్రియ అని..
మనం సామ్యమును దర్శించగలిగితే.....
అదే నిరంతరంగా కొనసాగే జన్మాంతర జీవుడి ప్రయాణం...
ఆ జీవప్రయాణం యొక్క ఆది ఒక బండరాయ్ గా మొదలై,
సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనే
కర్మసంచయం తో ఎన్నో ఎన్నెన్నో జన్మలదొంతరల్లో కొనసాగుతూ,
ఏనాడు ఏదో ఒక జన్మలో సత్పురుష, భక్తభాగవత, యోగుల, అనుగ్రహంతో పరబ్రహ్మము యొక్క చింతన గూర్చి స్వాధ్యాయం ప్రారంభమవుతుందో...
అప్పుడు ముక్తి / మోక్షము / పరమపదము అనే సర్వోన్నతమైన ఆరామము గూర్చిన ఎరుకతో జీవిస్తూ, వాటిని సాధించుకునే దిశగా పరిశ్రమిస్తూ, జన్మపరంపరా ప్రయాణంలో కొనసాగుతూనే అభ్యున్నతి దిశగా పురోగమిస్తూ, కేవలం కొద్ది జన్మల్లోనే లేక ఈ జన్మలోనే ఈశ్వరుడు సంతసించి అనుగ్రహించే...
సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తిని బడసి తరించడం అనే గహనమైన ప్రక్రియలో బ్రహ్మగారిది ఎంతో కీలకమైన అనుగ్రహం కాబట్టే.....
బ్రహ్మాండం అనే పదం గురించి ఏమి తెలియకపోయినా సరే...
ఎంతో మంది అలా క్యాజువల్ గా
"ఓహ్ ఇవ్వాళ భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయ్...."
అని అనేస్తారు....
"అబ్బో వారిచ్చిన గౌరవాల గురించి ఏమని చెప్పాలి...
నాకు బ్రహ్మరథం పట్టారండి..."
అని అనేస్తారు....
బ్రహ్మరథం అంటే ఏంటో, బ్రహ్మగారి వైభవం అంటే ఏంటో, తద్వారా బ్రహ్మగారి అనుగ్రహం అంటే ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను.....
చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టి కార్యం గురించి చెప్పాలంటే....
ఒక సూపర్ కంప్యూటర్ ఏ విధంగానైతే క్షణంలో కొన్ని లక్షల సాధారణ గణితశాస్త్ర లెక్కలను చక్కబెడుతూ (ఫ్లిప్ ఫ్లాప్స్) మరింత గహనమైన గణితశాస్త్ర లెక్కలను సాధించే దిశగా తన సూపర్ కంప్యూటింగ్ స్కిల్స్ ని టకటక మని కనబరుస్తుందో.....
అదే విధంగా "బ్రహ్మగారు" అనే ఆ సత్యలోక పదవిలో కొలువైఉండే వారికి,
"పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ," అనే పంచవిధ స్థిత పరతత్వ విశేషంలో, "వ్యూహ" పరతత్త్వం యొక్క అనుగ్రహశక్తి వల్ల, అలాంటి అమేయ సృష్టిరచనా శక్తి సంప్రాప్తించి, ఒక జీవుడు చీమగా ఎందుకు ఎప్పుడు ఎక్కడ జన్మించాలో అనే అంశం నుండి ఒక జీవనది ఎక్కడ ఉద్భవించి ఎవ్విధంగా సాగుతూ తుదకు ఎక్కడ సముద్రంలో సంగమించాలో అనే అంశం వరకు, ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో టకటక మని మనం దర్శించే యావద్ సృష్టిని సృజిస్తూ ఉంటారు....
చతుర్ముఖ బ్రహ్మగారి ఈ సృష్టిరచనా వైభవం ఎంత ఘనంగా, ఎంత పర్ఫెక్ట్ గా, ఎంతటి విజ్ఞ్యాన ప్రజ్ఞ్యాన ప్రౌఢిమ సమ్మిళిత సారస్వత శక్తి యొక్క రూపాంతర ప్రక్రియ గా ఉంటుందో...
మీకు చాల సింపుల్ గా అర్ధం అవ్వాలంటే...
మీరు ఎప్పుడైన తిరుమల ఆర్జిత సేవల్లో పాల్గొని ఉంటే, తి.తి.దే వారి ఆస్థాన పండితులు, ఘనాపాఠీలు, శ్రీభూసమేతమలయప్ప స్వామి వారి ముందు ఆసీనులై, నలుగురు ఘనాపాఠీలు కూడా ఒక్కరేనేమో అన్నట్టుగా ఎంతో సుస్వరమైన ముక్తకంఠంతో వేదపన్నలను, సూక్తాలను, ఘనజటలను ఆలపించి అనుగ్రహిస్తారో గమనించారా....?
ఆ వేదపఠనజనిత వైశ్విక దైవికతరంగశక్తికి సంతసించే
శ్రీమలయప్పస్వామి వారి నగుమోమును కళ్ళారా దర్శించారా...?
అటువంటి తన్మయ భరిత దైవదర్శనంలో మనలో అనగా మన ఆంతరచైతన్య శక్తి యొక్క బౌద్ధిక పరిణతలో ఎన్ని ఆశ్చర్యకరమైన విభూతులు వాటంతట అవే సంతరించుకుంటున్నాయో అంతర్ముఖులై దర్శించుకున్నారా...?
ఒక గంటసేపు మనం వేదమూర్తులు అనుగ్రహించిన అంతటి ఘనమైన సుస్వరవేదపఠనాన్ని ఆలకించి అంతగా ఆనందమగ్నులమై మైమరచామే....
మరి ఏకంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిరంతరం నాలుగు ముఖాలతో సత్యలోకంలో శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలంలో ఆసీనులై, నుడివే వేదపఠన జనిత శక్తికి ఈ విశ్వంలో ఎన్ని మార్పులు నిరంతరం సంతరించుకుంటూ ఉంటాయో ఒకసారి ఆలోచించండి....
ఒక న్యూస్ పేపర్ రీడింగ్ ని ఎగ్సాంపుల్ గా తీస్కుంటే...
రమారమి ఒక 14 పేజీల దైనందిన వార్తాపత్రికను,
అనగా అందులోని అన్నిరకాల వార్తలను...
మొదటి పేజి హెడ్లైన్స్ నుండి ఆఖరి పేజీల్లో ఉండే స్పోర్ట్స్ కాలం మరియు ఇతర ఫిల్లర్స్ లో ఉండే సంక్షిప్త వార్తాకథనాలవరకు...
నేను ఒక అరగంటలో అవన్నీ చదివేసి ఏ పేజీలో ఎక్కడ ఏముందో చెప్పేయగలను...
అదే వార్తాపత్రిక ఒకటవ తరగతి చదివే స్కూల్ పిల్లలు చదవడానికి ఎన్నో రోజుల సమయం పడుతుంది....
ఎందుకంటే నా బౌద్ధిక స్థాయిని, నా స్పీడ్ ని అందుకోవాలంటే,
ఆ పిల్లలు 10 సంవత్సరాల స్కూల్ చదువు, ఆతదుపరి 6 సంవత్సరాల ఉన్నతవిద్య, చదివి ఉత్తీర్ణులైనతదుపరి అంతటి వేగం అందుకోగలరు.....
అచ్చం అదే విధంగా ఈ భూలోకంలో వేదఘనాపాఠీలచే
పరివ్యాప్తమయ్యే వేదం యొక్క శక్తికి...
మరియు
భూలోకాన్ని, భూగురుత్వాకర్షణ శక్తిచే ప్రభావితమయ్యే రోదసీ పరిధిని దాటి...
భువర్లోక,
సువర్లోక,
మహర్లోక,
జనోలోక,
తపోలోకాలను దాటి వాటిపైన సువ్యవస్థీకరింపబడి ఉండే
సత్యలోకంలో కొలువైన చతుర్ముఖ బ్రహ్మగారు నుడివే చతుర్వదనవినిర్ముక్తవేదపఠన శక్తి యొక్క స్థాయిని, ఆ వేదశక్తి జనిత వైశ్వికదైవిక తరంగ శక్తికి అనుగుణంగా టకటక మని సృజింపబడే సృష్టి విలాసాన్ని ప్రత్యక్షంగా దర్శించడం మానవమాత్రులకు దుర్లభం....కేవలం ఈశ్వరానుగ్రహంగా ధ్యానగోచరమయ్యే ఆశ్చర్యకరమైన అంశం అది....
ఏ విధంగానైతే కొన్ని లక్షల మంది పదవతగతి విద్యార్ధుల భవిత ను ఎగ్సాం రిసల్ట్స్ అని అరచేతిలో ఇమిడే
సి.డి/డి.వి.డి/బ్లూరే-డిస్క్/పెన్ డ్రైవ్/
లో నిక్షిప్తంగావింపబడిన విశ్లేషిత సమాచారాన్ని,
వెబ్సైట్ ద్వారా రిలీస్ గావింపబడిన తదుపరి కోట్లాది మంది ఇంటర్నెట్ ద్వారా సదరు విద్యార్ధి యొక్క
"హాల్ టికెట్ నంబర్" అనే ప్రైమరి కీ తో అనుసంధానమైన సదరు రిసల్ట్ ని స్క్రీన్ పై దర్శించి ఫలితాలను తెల్సుకుంటున్నారో...
అదే విధంగా చతుర్ముఖ బ్రహ్మగారు నుడివే అనంతవేదసాగరాన్ని,
12. ద్వాదశ ఆదిత్యులు,
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
11. ఏకాదశ రుద్రులు,
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%8F%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81
10. దశదిక్కులు,
( తూర్పు East, పడమర West, దక్షిణము South, ఉత్తరము North, ఆగ్నేయము, South East, నైఋతి South West, వాయువ్యము North West, ఈశాన్యము North East, ఊర్థతము Sky, అధోభాగము Earth.)
9. నవగ్రహాలు (అధ్యాత్మ సంబంధమైనవి)
సూర్యుడు (Sun)
చంద్రుడు (Moon),
అంగారకుడు (Mars)
బుధుడు (Mercury)
శుక్రుడు (Venus)
గురుడు (Jupiter)
శనైశ్చరుడు (Saturn)
(ఛాయాగ్రహాలు)
రాహువు, (Rahu)
కేతువు (Ketu)
8. అష్టవసువులు,
(అపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు. అనిలుడు, ఆనలుడు, ప్రత్యూషణుడు, ప్రభాసుడు )
7. సప్తసముద్రాలు, (అధ్యాత్మ సంబంధమైనవి)
లవణ(ఉప్పు), ఇక్షు(చెరకు రసము), సుర(కల్లు), సర్ఫి(నెయ్యి), దధి(పెరుగు), దుగ్ధ(పాలు), జల(నీరు)
6. ఆరు ఋతువులు,
(వసంతఋతువు, గ్రీష్మఋతువు, వర్షఋతువు, శరదృతువు, హేమంతఋతువు, శిశిరఋతువు)
5. పంచభూతాలు,
(ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి)
4. నాలుగు యుగాలు,
(సత్య/కృతయుగం, త్రేతాయిగం, ద్వాపరయుగం, కలియుగం)
(కృతేతు నరసింహ భూత్రే తాయాం రఘునందనః
ద్వాపరే వాసు దేవశ్చ కలౌ వేంకటనాయకః )
3. మూడు కాలాలు,
(భూత, past, వర్తమాన, present, భవిష్యద్ future )
(దినము = 30 ముహుర్తములు, మాసము = 30 దినములు, ఋతువు = 2 మాసములు, ఆయనము = 3 ఋతువులు, సంవత్సరం = 2 ఆయనములు, దేవతల దినము = 1 సంవత్సరం, దైవత యుగము = 12,000 దేవ సంవత్సరములు...)
అనగా వాటి యొక్క అధిదేవతలు, ప్రత్యధిదేవతలు.....
చతుర్ముఖ బ్రహ్మగారి వేదపఠన జనిత శక్తికి,
సదరు జీవుడి సంచితం యొక్క లెక్కల నుండి స్వీకరింపబడిన,
సదరు ప్రారబ్ధానుభవానికి,
సదరు ఉన్నతమైన జన్మగా, సదరు జీవుడు మనిషిగా,
ఉత్తమజన్మను ఎత్తడానికి....
సదరు ఆదిత్యుడి ఆజ్ఞ్యగా, సదరు రుద్రుడి అనుగ్రహంగా, సదరు దిశగా రోదసీ ప్రయాణం సాగించి,
నవగ్రహాలచే శాసింపబడే సదరు జాతకచక్రంతో జన్మించేందుకు, అష్టవసువులూ అనుకూలించి సప్తసముద్రాలను దాటి, సదరు ఋతువులో సదరు వ్యక్తి యొక్క వీర్యశక్తి బీజంగా పంచభూతాల అనుగ్రహంతో సదరు మనిషి గా పాంచభౌతిక శరీరం తో ప్రభవించేందుకు, ఓషధీ శక్తి నుండి సదరు కర్మసంబంధం గల వ్యక్తి యొక్క వీర్యశక్తిగా రూపాంతరం చెంది, మేఘమండలం నుండి భూమండలానికి సాగే సదరు జీవుడి యాత్రను దర్శిస్తే ఎంతగా ఆశ్చర్యపోతారంటే ఒక సూపర్ కంప్యూటర్ యొక్క గణకప్రక్రియను దర్శించినప్పుడు కలిగేంతటి ఆశ్చర్యం...
అదేంటి ఎక్కడో సుదూరాకాశంలో ఎక్కడో ఉండే ఒక సూక్షరూప మెరుపు లాంటి జీవుడు, ఒక మనిషిగా metamorphosis చెందే ప్రక్రియ ఇంతటి అలౌకిక + లౌకిక ప్రయాణం తో ఇమిడి ఉంటుందా...?
Doesn't it sound strange to say so...?
అనే సందేహం కొందరు ఇరుడైట్ ఇంటెలెక్చువల్స్కు రావచ్చు...
హాల్ టికెట్ నంబర్ ఒక సింపుల్ వెబ్ పేజ్ లో ఎంటర్ చేయగానే....
మీ హాల్ టికెట్ నంబర్ యొక్క రిసల్ట్ డిస్టిన్షన్ అని...,
మీ పక్కన ఉన్న హాల్ టికెట్ నంబర్ ఫస్ట్ క్లాస్ అని...,
మీ వెనక ఉన్న హాల్ టికెట్ నంబర్ సెకండ్ క్లాస్ అని...,
ఇంకో హాల్ టికెట్ నంబర్ థర్డ్ క్లాస్ అని...,
ఇలా ఇన్ని రకాలుగా ఉన్న రిసల్ట్స్ ఒకే బ్లూరే డిస్క్ పై ఉన్న సూక్ష్మాతిసూక్ష్మైన మెరుపు రేఖల్లో నిక్షిప్తమైన రిసల్ట్స్ అలా
క్రోడీకరింపబడడానికి, ఎంత మంది ఎగ్సామినర్స్ తో ఒక్కో పేపర్ ఏవాల్యూషన్ గావింపబడి, అన్ని సబ్జెక్ట్ పేపర్ల కౌంటింగ్స్ అగ్గ్రిగేట్ గావింపబడి, అలా రిసల్ట్స్ ని క్లాసిఫై చేసారో అనేది ఎగ్సామినేషన్ / పేపర్ ఏవాల్యూషన్ డిపార్ట్మెంట్ ఫ్రెటర్నిటి కి తెలిసిన అంశం...
అచ్చం అదే విధంగా....యావద్ సృష్టి రచనా ప్రక్రియ కూడా బ్రహ్మ గారి ఆజ్ఞ్యానుసారంగా పైన వివరింపబడిన ఒక పెద్ద వైశ్విక వ్యవస్థ ద్వారా సువ్యవస్థీకరింపబడిన దైవిక ప్రక్రియ...
అది సాధికారసశాస్త్రీయ పంథాలో అర్ధం చేసుకొని ఆకళింపజేసుకోవాలంటే...
ఎంతో అధ్యాత్మ స్వాధ్యాయం, ఈశ్వరానుగ్రహం ఆవశ్యకం...
ఒకటవ తరగతి స్కూల్ పిల్లవాణ్ణి 14 పేజీల న్యూస్పేపర్ మొత్తం అరగంటలో చదవమంటే ఎట్లుంటదో...
ఎట్టి అధ్యాత్మ స్వాధ్యాయం లేకుండా,
ఈశ్వరానుగ్రహం సంతరించుకోకుండా,
అడిగే సందేహాలు కూడా అట్లనే ఉంటయ్....
కాబట్టి మన ఆర్షవాంగ్మయ విజ్ఞ్యులు నుడివే వేద పురాణ ఇతిహాస, సశాస్త్రీయ శ్రేయోకారక ప్రాచీన అధ్యాత్మ విజ్ఞ్యాన సిరులను అందుకొని జీవితాలు తరింపజేసుకోవాలంటే...
ఆలయాలను దర్శించడం, ఆలయాల్లో నిర్వహింపబడే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని భగవద్ దర్శనం / ప్రసాదం తో తరించడం, బ్రహ్మోత్సవాంతర్గతంగా నిర్వహింపబడే వివిధ క్రతువుల్లో పాల్గొని వాటిలోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకునే దిశగా స్వాధ్యాయంతో పరిశ్రమించడం....
ఇవన్నీ కూడా ఎంతో గొప్ప విషయాలు అని గౌరవించి ఆదరించి జీవితానికి అన్వయించుకొని తరించగలగడం తెలిసిఉన్నప్పుడు, ఈశ్వరానుగ్రహంగా.....
జ్ఞ్యానం విజ్ఞ్యానమై...
విజ్ఞ్యానం ప్రజ్ఞ్యానమై...
ప్రజ్ఞ్యానం సుజ్ఞ్యానమై...
సుజ్ఞ్యానం పరతత్త్వజ్ఞ్యానానుగ్రహంగా పరిణమించి....
మనిషి సంపూర్ణంగా తరించగలుగుతాడు....
బ్రహ్మోత్సవాల్లో, మొదటి రోజున ధ్వజారోహణం, చివరి రోజున ధ్వజ అవరోహణం, పేరుతో సకల దేవతాహ్వాన / దేవతా ఉద్వాసన ప్రక్రియను....
నాదస్వర విద్వాంసుల చే గావింపబడే మేళతాళ పూర్వక భేరితాడన ప్రయుక్త వేదస్వరఘోషలో....
"హే బ్రహ్మ, హంసవాహనమారుహ్య..."
అని బ్రహ్మగారితో పాటుగా...,
ఇంద్ర, అగ్ని, యమ, నిర్రుతి, వరుణ, వాయు, కుబేర, ఈశ్వర, అనే అష్టదిక్పాలకులను సవాహన, సపత్నీ పూర్వకంగా ఆహ్వానించడం...అనే ప్రక్రియను మీరు దర్శించి ధ్యానంలో ఆరాధిస్తే, ఆ బ్రహ్మగారి వైభవాన్ని మరింత గొప్పగా ఆకళింపుజేసుకోగలరు.....
" కలౌ వేంకటనాయకః .... "
అని అన్నారు మన పెద్దలు.....
కాబట్టి మీమీ ఇంటి దెగ్గర్లోని శ్రీవేంకటేశ్వరాలయాల్లో నిర్వహింపబడే వార్షిక బ్రహ్మోత్సవాల్లో,
గరుడధ్వజారోహణం మొదలుకొని
గరుడధ్వజ అవరోహణం వరకు....
అక్కడి వేదమూర్తులు, ఋత్విక్కులు, పండితులతో పాటుగా,
మనం కూడా
ఏకాహ్నిక / త్రయాహ్నిక / పాంచాహ్నిక / సప్తాహ్నిక / నవాహ్నిక మానసిక దీక్షాకంకణధారులమై
(ఆయా ఆలయాచారాన్ని అనుసరించి కావింపబడే...,) ఈశ్వరానుగ్రహం తో శాస్త్రవివేచన గావించగా లభించే జ్ఞ్యానమే సర్వోన్నతమైన పరతత్త్వ జ్ఞ్యానం / ఆత్మజ్ఞ్యానం....
శ్రీవేంకటాచలం వంటి సదాచారసంపన్నభరిత క్షేత్రాల్లో నిర్వహింపబడే బ్రహ్మోత్సవాల్లో, బ్రహ్మగారి గౌరవార్ధమై, బ్రహ్మగారికి ప్రత్యక్ష ప్రతీకగా, ఒక రథాన్ని అందరికంటే ముందుగా తిరువీధుల్లో ప్రదక్షిణగా ఊరెరిగిస్తారు....
ఆ రథాన్నే బ్రహ్మరథం అని సంబోధిస్తారు...
అందుకే లోకంలో బ్రహ్మరథం పట్టారండి...అనే నానుడి వచ్చింది.
అనగా అన్నిటికంటే / అందరికంటే ముందుగా గౌరవింపబడే ప్రక్రియను 'బ్రహ్మరథం పట్టడం' అని అంటారు....
కాబట్టి భృగుమహర్షి వచనాల కారణంగా ప్రత్యక్షంగా ఆలయాల్లో ప్రత్యేకంగా ఆరాధన లేకున్నా...
ఈ లోకంలోని సర్వోన్నతమైన మరియాదను పొందే సృష్టికర్త యొక్క గౌరవార్ధమై ప్రతి సర్వోన్నతమైన విభూతిని బ్రహ్మ అనే గౌణసమ్మిళితంతో వచించడం ఆ పరమాత్మ యొక్క ప్రీతికి కారణం అవుతున్నది...
బ్రహ్మమాయకు బద్ధులైఉండే వారే ఈ సృష్టిలోని జీవులందరూ కూడా...ఎందుకంటే ఆ సృష్టికర్త సృజించిన బ్రహ్మాండాన్ని దాటి బ్రహ్మపదార్దాన్ని దర్శించే భాగ్యం కేవలం బ్రహ్మమాయను లయించి సత్యదర్శనం గావింపజేసే విష్ణుమాయకు మాత్రమే సాధ్యం...
శ్రీమద్భాగవతం లో ప్రత్యక్ష బ్రహ్మమాయను కూడా లయించివేసి తన విష్ణుమాయతో, బ్రహ్మగారు మాయం చేసిన ఏ గోపాలుడు ఎప్పుడు ఎక్కడ ఎట్ల ఉండునో అట్లే ఉండేలా గావించిన శ్రీకృష్ణపరమాత్మ యొక్క అత్యత్భుతమైన లీలల్లో ఒకటైన "కౌమారపౌగండలీల" ను శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నవారికి తెలిసినట్టుగా, పరమాత్మ మాయ యందు బ్రహ్మమాయ లయించును....అనగా ఆ పరబ్రహ్మము యొక్క స్వస్వరూపానుసందర్శనంతో, బ్రహ్మాండానికి ఆవల ఉండే శాశ్వతమైన సత్యపదార్ధాన్ని దర్శించే ప్రక్రియనే బ్రహ్మజ్ఞ్యానం అని వచింతురు....
అనేయడానికి ఏదో..
"ఒక స్పెషల్ రేంజ్ అడ్వాన్స్డ్ సుఖోయ్ F16 ఫైటర్ జెట్ ప్లేన్ లో అప్పటికప్పుడు ఎక్కి ఈ లోకం అంచులవరకు వెళ్ళి అన్నిటిని దర్శించగలగడం..." అన్నట్టుగా అనిపించినా....
బ్రహ్మజ్యాన సముపార్జన అంత తేలికమాత్రం కాదు....
నిత్యం హృదయపంచకోశాంతరమునందు చిత్తాన్ని స్థిరీకరించి భగవద్దర్శనం కోసం తపస్సును ఆచరించే వరిష్ఠయోగులు కూడా నిరంతరం ఆ బ్రహ్మజ్యానసముపార్జనలో లీనమై
ఉండే ప్రక్రియను సర్వోన్నతమైన తపస్సుగా బహిర్ముఖులైనప్పుడు వచింతురు....
అట్టి సర్వోన్నతమైన జ్ఞ్యానభూమికల్లో ఓలలాడే సౌభాగ్యం తన శ్రీపాదయుగళధ్యానం లో అనుగ్రహించే కలియుగప్రత్యక్ష పరమాత్మ శ్రీవేంకటాచలపతిని అందుకే అన్నమాచార్యుల వారు....
నీశ్రీపాదములే పరమపదము...అంటూ అంత ఘనంగా కీర్తించారు...
"
పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము
"
తిరుమల అంటే కేవలం ఆనందనిలయ అష్టదలపద్మపీఠంపై మాత్రమే శ్రీవేంకటేశ్వరుడు ఉన్నడనుకుంటే అది మన అమాయకత్వం....
"ఇన్ని సార్లు తిరుమల వెళ్ళోచ్చాం అండి అని కొందరు అంటుంటారు...
ఏది తిరుమలో మీరు ఎన్ని తీర్థాలను దర్శించారో చెప్పండి అని అడిగితే మాత్రం తెల్లమొహం వేస్తారు..."
అని శ్రీచగంటి సద్గురువులు తిరుమల యొక్క తీర్థాల వైభవాన్ని ఉటంకిస్తూ ఇవ్విధంగా ప్రస్తావించడం కొందరికైన గుర్తుండే ఉంటుంది...
సర్వోన్నతమైన శ్రీస్వామిపుష్కరిణి, తిరుమల ఆలయంలోని
బంగారుబావి తీర్థం, ఆనందనిలయంలో అంతర్నిహితమైఉండే విరజా తీర్థం తో మొదలుకొని...
1. శంఖుతీర్థం (సుపథం పరిసరాల్లో)
2. నాగతీర్థం (గజశాల వెనక)
3. పాండవతీర్థం (గోగర్భండ్యాం దెగ్గర, తిరుమల క్షేత్రపాలక శ్రీరుదశిల ఇప్పుడు కొలువైఉన్న చోట)
4. చక్రతీర్థం (శిలాతోరణం దెగ్గర)
5.జపాలితీర్థం (స్వయంభూ హనుమద్ ఆలయం వెనక)
6. ధృవతీర్థం (జపాలి ఆలయం నుండి కొద్దిగా పైకి అడవిలో)
7. పాపనాశనం
8. అకాశగంగ
9. సనకసనందనతీర్థం
10. తుంబురుతీర్థం
11. కపిలతీర్థం
వీటితో పాటుగా ఇంకా అడవిలోకి మున్ముందుందుకు సాగుతుంటే ఎన్నో ఎన్నెన్నో నేను కూడా ఇంకా ప్రత్యక్షంగా దర్శించని తీర్థాలు తిరుమల గిరుల్లో నిత్యం ఆ పరమాత్మ యొక్క ఎన్నో విభూతులను భక్తులకు అందిస్తూ ప్రవహిస్తూ అలరారుతున్నాయి....
ఎల్లరూ దర్శించే ఇట్టి తీర్థాలతో పాటుగా, సామాన్యంగా దర్శించలేని, కేవలం తిరుమలేశుడి విశేషానుగ్రహంతో మాత్రమే దర్శనయోగ్యమయ్యే తీర్థాలు అనేకం...వాటి అనుగ్రహం అనన్యసామాన్యం....
ఈ మర్త్యలోకంలోని జీవనదులకు, అన్ని తీర్థాలకు కూడా గంగా ఝరులే మూలం....
వామనావతారంలో శ్రీమహావిష్ణువు యొక్క త్రివిక్రమాకృతిని సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ,
"యావద్ విశ్వాన్ని కొలుస్తున్న సాక్షాత్ శ్రీమన్నారాయణుడి శ్రీపాదం, ఎల్లప్పుడూ శ్రీలక్ష్మీదేవి చే పాదసంవాహం తో సర్వంలక్ష్మీమయమై విరాజిల్లే పాదం, పరమయోగీంద్రులకు సౌదామిని సదృశమైన దర్శనంతోనే పరమును అనుగ్రహించే పావనపాదం...
ఇప్పుడు నా సత్యలోకాన్ని చేరింది..."
అని ఎంతో సంతోషించి ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు వారి కమండలం లోని సమంత్రకజలంతో అభిషేకింపగా, శ్రీహరిపాదోద్భవీం గా జనించిన సురగంగా ప్రవాహం సర్వపాపహారిణిగా, సర్వపుణ్యదాయినిగా,
సర్వోత్తమ తీర్థంగా, అలరారుతూ,
సూర్యవంశ చక్రవర్తుల పరంపరలోని భగీరథుడి తపః శక్తితో అమరలోకము నుండి ఈ మర్త్యలోకానికి ఏతెంచే క్రమంలో రుద్రజటాజూటోద్భవీం గా పేర్గాంచి యావద్ భరతఖండ వైభవాన్ని విశ్వవ్యాప్తం గావిస్తూ మందాకినిగా శ్రీకాశివిశ్వనాథుణ్ణి అభిషేకిస్తూ, భోగవతిగా పాతళానికి ప్రవహించి సగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించి వారికి ఉత్తమగతులను కలిగించిన కపిలమహర్షి ఆశ్రమానికి, ఇప్పుడు మనం తిరుపతిలో దర్శించే శ్రీకామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారికి, మరియు కపిలతీర్థం దెగ్గర ఉన్న వకుళమాతగుహ గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో చాలమంది శ్రద్ధగా వినేఉంటారు కద....
మరి అటువంటి మహత్తరమైన సురగంగా నదీ ఉద్భవించడానికి మూలకారణమైన బ్రహ్మగారి కమండలం లోని దైవికజలం ఏ దేవనదిది అని మీకు ఎప్పుడూ సందేహం రాలేదా..?
ఆ పరమపావన జలం దేవలోకాల్లో మాత్రమే లభ్యమయ్యే నిరంతర శ్రీహరి శ్రీపాద సేవకతీర్థమైన శ్రీవైకుంఠ లోకంలో లభ్యమయ్యే విరజా నదీ జలం...!
ఈ భూలోస్థిత పుణ్యజీవులైన శ్రీహరిభక్తులకు వివిధ తిరుమల తీర్థాల రూపంలో లభ్యమయ్యే అత్యంత మహిమోపేతమైన జలం ప్రాకృతమైనది కాదు....
అది సాక్షాత్తు విరజానది యొక్క వివిధ ఝరులు...!!
ఆదిశేషుడు, వాయుదేవుడు ఇద్దరూ కూడా నేనంటే నేనే గొప్ప అనే తగువులో ఉండగా, ఆ తగువును లోకోపకారకంగా మార్చేందుకు శ్రీహరి అనుగ్రహంగా శ్రీవైకుంఠముండి వాయువేగంతో దూసుకొచ్చిన క్రీడాద్రి అనే సాలిగ్రామ పర్వతం, స్వామివారి ఆజ్ఞ్యగా శేషాచలం అనే పేరుతో సువర్ణముఖరీ నదీతీరప్రాంతంలో వెలసి, ద్రావిడ దేశంలో తిరువేంగడం గా స్థిరపడింది...
ఒక సహజసిద్ధమైన వికసిత శతదళశోభనసువర్ణకమలానికి
అమోఘమైన దైవిక గంధం అలదబడితే ఎంత వైభవంగా ఉండునో....
అవ్విధముగా, మహిమాన్వితమైన శేషాచలాన్ని
సకలవిధలక్ష్మీయుతమైన తన శ్రీపాదంతో శ్రీహరి శ్రీవేంకటేశ్వరుడిగా పావనం గావించగా...
వివిధ దైవిక సంఘటనల కారణంగా....,
శేషాద్రి
గరుడాద్రి
వేంకటాద్రి
నారాయణాద్రి
వృషభాద్రి
వృషాద్రి
నీలాద్రి
గా ఆ శ్రీవైకుంఠ క్రీడాద్రి పర్వతం 7 వివిధ ప్రముఖ పేర్లతో ప్రస్తుతింపబడుతూ సప్తాచలంగా కొనియాడబడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనుగ్రహాన్ని వర్షిస్తున్నది....
రాత్రి ఏకాంత సేవానంతరం, ఆనంద నిలయ ద్వారబంధనానంతరం, యోగమార్గంలో స్వామి సన్నిధికి చేరుకునే ఎందరెందరో మనుష్యేతర పుణ్యజీవులచే నిత్యం అర్చింపబడే స్వామివారి శ్రీపాదయుగళాన్ని ఇప్పటికీ కూడా బ్రహ్మ గారు నిత్యం అర్చించడం విశేషం..! ఆ తీర్థాన్నే మరుసటి రోజున ఉదయం ప్రప్రథమ ఆరాధనగా గావింపబడే సుప్రభాతసేవలో, బ్రహ్మగారు అర్చింపగా మిగిలిన తీర్థశేషాన్ని బ్రహ్మతీర్థం గా భక్తులకు / వి.ఐ.పి సుప్రభాత టికెట్ హోల్డర్స్ కి
అనుగ్రహిస్తారు..!!
మహాయోగులచే, సిద్ధసాధ్యవిద్యాధరగంధర్వులచే, యక్షకిన్నెరకింపురుషులచే, పరస్పర ఆజన్మవైరాన్ని కూడా మరచిన నాగగరుడ జాతులచే, నిండి ఉండే ఆ తైజసిక ఆనందనిలయ పరిసరాలను దర్శించడం ఎంతటి శ్రీవేంకటేశ్వరానుగ్రహమో మాతృశ్రీ తరిగొండవెంగమాంబ గారు వారి శ్రీవేంకటాచలమాహాత్మ్యం గ్రంథంలో విశదీకరించిఉన్నారు....
ప|| ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |
ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||
చ|| ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది |
యీపాదమే కదా యీ గగన గంగ పుట్టినది |
యీపాదమే కదా యెలమి బొంపొందినది |
యీపాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది ||
చ|| ఈ పదమే కదా యిభరాజు దలచినది |
యీపదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది |
యీపాదమే కదా యీబ్రహ్మ కడిగినది |
యీపాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది ||
చ|| ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది |
యీపాదమే కదా యిల నహల్యకు గోరికైనది |
యీపాదమే కదా యీక్షింప దుర్లభము |
యీపాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది ||
కోటిసూర్యకాంతమణిసంఘాతసదృశమైన స్వామివారి శ్రీపాద ద్యుతిని అందుకే అన్నమాచార్యులవారు..
"యీపాదమే కదా యీక్షింప దుర్లభము | "
అని సంకీర్తించారు....
ఇటు లౌకికంగానూ ఆ పాదాలు దర్శించడం దుర్లభమే....
ఎందుకంటే ఎల్లప్పుడూ స్వర్ణకవచాలంకృతమై తులసీ తో ఆచ్ఛాదింపబడి ఉండి....కేవలం శుక్రవార పూరాభిషేకానంతరం మాత్రమే కొద్ది సేపు
" నిజపాదదర్శనం " గా భక్తులకు దర్శనీయమై ఉన్నవి కాబట్టి..
ఇలా చెప్తే మీకు అతిశయంగా అనిపిస్తుందేమో కాని, స్వామి వారి పాదాలపై ఉన్న మంజీరములు కూడా, ఈ లోకంలోని ఏ శిల్పి కూడా సృజించలేనంత అందంగా, ఆశచర్యకరంగా ఉంటాయి...!!
ఎన్నో సార్లు అట్టి మహిమోపేతమైన నిజపాదదర్శనం టికెట్ తో నన్ను ధన్యుణ్ణిచేసిన స్వామివారి అమేయానుగ్రహానికి, వాత్సల్యానికి, భక్తపరాధీనతకు, నేను సదా బద్ధుడను...!
🙂🙏
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం
శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీమివాసం భజేదనిశం.......