Thursday, September 27, 2018

Annual Saalakatla Brahmothsavam...!! - 2016

May Lord Govinda Perumaal bless each of us with abundance of Peace Prosperity Health & Happiness, on the occasion of VijayaDasami marking an end to the most majestic of all festive events... Srivaari Annual Saalakatla Brahmothsavam...!!
Prasanth Sagar to ఫేస్ బుక్ అన్నమయ్య.. facebook annamayya
విజయపుటమ్ము వేసె వేంకటేశుడు
విజయుని సఖుడు యీ వేదమూరితి
పాఱితెంచి దశకంఠు పదిశిరసుల మీద
ఆరికినమ్ము వేసె ఆది దేవుడు
ఆఱడి సేనలతోడ అంబుధి మీద వేసె
వేఱొకయమ్ము తొడిగి విష్ణుదేవుడు
చాలుగ ఏడుతాళ్లు సర్వము ఒక్కటిగాగ
ఆలములో అమ్మువేసె అఖిలేశుఁడు
ఆలించి రుక్మిణి పెండ్లియాడునాడు
వైరులపై జాలియమ్ము వేసెను విజయకృష్ణుడు
భజన ఇందిరగూడి పంతమున అమ్మువేసె
విజయదశమిని శ్రీవేంకటేశుడు
సుజనల దేవతల సొరిది నిందరిగాచు
విజయము చేకొనె విష్ణుదేవుడు

No comments:

Post a Comment