ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న కు సమాధానం...
Q-ప్ర) ఇద్దరు వ్యక్తులు చూసింది అదే 'ఆనంద నిలయం' లో ఉన్న ఒకే గోవిందుడిని కదా, మరి ఒకరేమో
'ఆహా ఎంతటి దివ్యానుభూతి ఈ దర్శనం.. జన్మ సార్ధకం...' అని ఏవేవో మైమరిచి అంటున్నారు..
ఇంకొకరేమో "పెద్దగా ఏమీ అనిపించలేదండి. అంతా 'Normal as-usual' గానే ఉంది " అని అంటున్నారు..
'ఆహా ఎంతటి దివ్యానుభూతి ఈ దర్శనం.. జన్మ సార్ధకం...' అని ఏవేవో మైమరిచి అంటున్నారు..
ఇంకొకరేమో "పెద్దగా ఏమీ అనిపించలేదండి. అంతా 'Normal as-usual' గానే ఉంది " అని అంటున్నారు..
మరి దేవుడు ఈ 'Partiality' ఎందుకు చూపిస్తున్నాడు తన దర్శన భాగ్యం లో ? ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
A-జ) అమ్మ వండిన పాయసం, ఒకరేమో మంచి ధవళ కాంతులతో అద్దం లా మెరిసిపోతున్న వెండి గిన్నె లో, మరొకరేమో మట్టి , మురికి , జిడ్డు తో నల్లగా అయిపోయిన అపరిశుభ్రమైన వెండి గిన్నె లో తీసుకున్నపుడు , భేదం అమ్మ వడ్డించిన పాయసం లో కాని, దాన్ని స్వీకరించే వ్యక్తి లో కాని లేదు. పాత్ర యొక్క శుభ్రత వల్ల వ్యక్తి ఆస్వాదించడం లో ఉన్న భేదం తప్ప ...
అదే విధంగా , ఎంతటి వారికైనను ఏ శ్రమ అవసరం లేకుండా "అరిషడ్ వర్గం" అనే మట్టి, మురికి, జిడ్డు - మనసు - అనే పాత్ర లో ప్రతి నిత్యం వచ్చి చేరడం అన్నది సహజం.
వెండి పాత్రను ఎల్లప్పుడు " ఉప్పు-చింతపండు " అన్న సాధనం తో తోమితే వచ్చే చక్కని శుభ్రత తో పాయసం యొక్క రుచిని ఆస్వాదించడంలో ఉన్న భేదం ,
మనసు - అనే పాత్రను ఎల్లప్పుడు " గురు భక్తి - భగవద్ భక్తి " అన్న సాధనం తో శుభ్రపరిచినప్పుడు వచ్చే "చిత్తశుద్ధి" తో చేసుకున్న దైవ దర్శనం ఇచ్చే దివ్యానుభూతి కూడా అంతే ... అది అవ్యక్తం , అగోచరం , అలౌకికం , అతీంద్రియం. మన భాషలో "simply blissful" ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
No comments:
Post a Comment