మొన్న గోదావరి అంత్య పుష్కరాలు మరియు కృష్ణమ్మ మహా పుష్కరాలకు వెళ్ళినప్పుడు, ఉత్తుంగతరంగ ఝరులై సాగరసంగమానికా ఈ హొయలు, ఈ ఉరుకులు ఈ పరుగులు, అన్నట్లు సాగుతున్న నదీ గమనాన్ని తనివితీర ఆలకిస్తూ, చిన్నప్పుడుస్కూల్లో 'మా తెలుగు తల్లికి మల్లేపూ దండా...గలగలా గోదారి కదలిపోతుంటేను,
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయీ.....', అంటూ పాడుకున్న రోజుల్లో 'ఎలా ఉంటాయబ్బా, ఆ గలగలలు ఆ బిరబిరలు ?' అనే తుంటరి అనుమానం వచ్చిన నాలాంటి వాళ్ళందరికి, ప్రౌఢ దశలో ప్రకృతి తనంతటతానే సామాధానమిస్తుందనుకుంటా.... :)
అమ్మ చేతి గోరుముద్దలేమొ అనిపించే, ఆ పైపైన కోమలంగా సాగే తరంగ పయోలాస్యములు....
నాన్న చేతి శిక్షాస్మృతులేమొ అనిపించే, లోలోపల గగనగంభీరంగా సాగే ఊహకందని ఆ మహావేగజలఝరీ తాండవాలు, వెరసి మన మనోనేత్రానికి కలిగించే ఆ హాయి వర్ణనాతీతం...! :)

No comments:
Post a Comment