Thursday, September 27, 2018

బ్రహ్మ శ్రీ చాగంటికోటేశ్వరరావు గారు - నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం


'ఈ తెలుగు నేలపై పుట్టడం' లేదా 'తెలుగు భాషను విని అర్ధం చేసుకోవడం' అనేవి మనకు లభించిన సర్వోత్కృష్ఠమైన వరములు అని, గురువుగారి ప్రవచనం "మనసు పెట్టి" విన్న ప్రతి మనిషికి అనిపిస్తుంది.
అందుకే అన్నారు "న గురోరధికం న గురోరధికం.."
Brahmasri Chaganti Koteswara Rao Garu. is with Priyanka Priya and 7 others.
నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం మన గురువు గారు..
బ్రహ్మ శ్రీ చాగంటికోటేశ్వరరావు గారు.
ధర్మ మార్గాన నిష్టగా.. నడిచే అతి కొద్ది మందిలో మహాను భావులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు..వారి ధర్మా ఆచరణ..సనాతనధర్మప్రచారం...ఆయని నడవడిక..విలువ కట్టలేని అనంతమైనది..
ఎన్తో నీతి నిజాయితీలతో వారి ఆధ్యాత్మిక పయనం సాగిస్తున్నారు..రాష్ట్ర..దేశ వ్యాప్తంగా తిరుగుతూ..పురాణాలు,మానవీయ కోణాలు ,దర్మం, సమాజం,ఇతిహాసములు,వేదములు,నీతి అంశాలు ఎన్నిటినో ..ప్రవచనం చేస్తూ సరస్వతి పుత్రునిగా..లక్షలాది..భక్తుల జీవితాలను..సన్మార్గం లో నడిచే భోధనలు చేస్తూ గురువు గా..హృదయ పీటం ను అధిష్టించారు..ఆయన అనుకుంటే..కోట్ల రూపాయలు ఇచే వాళ్ళు ఉన్నారు..కాని ధనాన్ని విస్మరించారు..అవసరానికి మాత్రమే..వినియోగిస్తూ..పూర్తి గా ఉచిత ప్రవచనాలు చేస్తున్నారు..ఒక్కోసారి ప్రవచనాల కు వెళ్ళే .ప్రయాణ ఖర్చులు ,భోజన ఖర్చులు..కూడా వారే స్వయం గా పెట్టుకుని ధర్మ ప్రవచనాలకు వస్తుంటారు..కొద్ది మంది .భక్తులు ఎగ బడుతుంటే స్వామిజిగా అవతారం ఎత్తే ఈ రోజుల్లో అటువంటి మహానుభావులు..కూడా వున్నారని గమనించండి...ఆయన ప్రవచనానికి వచ్చిన ప్రాంతం లో భక్తుల మధ్య తారతమ్యాలు,చిన్నా పెద్దా .. చూడరు...అందరిని భాగా పలకరిస్తారు..చిత్త శుద్ధి లేని వారు కోట్లు డబ్బులు..ఇస్తానన్నా..వారికి ప్రవచనం చెప్పేందుకు వెళ్లారు...భక్తిశ్రద్దలు..,మంచి ని కొలమానం గా చూసి ప్రవచనాలు చేస్తుంటారు...
అంతే కాదు..ఎన్ .అర్ .ఐ .వాళ్ళు ఆయన ప్రవచనాలు విని కుప్పలు కుప్పలు గా డబ్బులు..పోస్తాము మాదెశమ్ రమ్మంటే..మాదెశమ్ రమ్మన్నమన తెలుగు వాళ్ళు ఉన్నారు...కాని వారు..వేదం చదువుకున్నవారు దేశం దాటకూడదన్న నియమంతో.. విదేశాలు కూడా వెళ్ళడం మానేశారు.
ప్రవచనానికి వచ్చి కనీసం పైసా కూడా తీసుకోరు..
ఎవరినైనా సమస్తితిలోనే పలకరిస్తారు..
ప్రవచనములో అశ్లీలత., వ్యక్తి గత విమర్శలు,రాజకీయఅంశాలకు చోటు ఇవ్వరు .
కేవలం భక్తి,మానవత విలువలు,పురాణము, వేదము,ధర్మసూత్రాలను మాత్రమే వింపుగా చెప్తారు..
సన్మానాలు..,సత్కారాలకు దూరంగా ఉంటారు. స్వర్ణ కంకణాలు తోడుగుతానని చెప్పిన ఒప్పుకోరు.ఒక వేల ఎవరైనా బలవంతంగా సత్కారం చేసి బిరుదులిచ్చినా వాటిని పరమేస్వరునికే అంకితం చేస్తారు..(మరుసటి రోజు సంధ్య వందనములోవదిలేస్తారు.)
ప్రవచనాలు చెప్తూ ప్రెస్ పబ్లిసిటి కి దూరం గా ఉంటారు..
ఎన్నో ప్రవచనాలు చేసారు కాని కొద్ది పాటి నెలజీతం తోనే గడుపుతారు..
ఎంతో మంది వారికి .కారు కొనిపెడతామన్నారు.దానికి ఒప్పుకోలేదు..
ఉండే ఇల్లు కాకినాడలో 2 గదుల చిన్న ఇల్లు మాత్రమే అది కూడా అపార్ట్ మెంట్ ..
చాలామంది ధనవంతులు ఆయన పాదాలకు మోకరిల్లుతారు ..వాళ్ళు కోట్లు ఇవ్వతానికైన సిద్దమే..కాని గురువు గారు కనీసం పైసా కూడా తీసుకోరు.
గురువుగారు బజారులో కనిపిస్తే అభిమానులు..భక్తులు,శిష్యులు చుట్టుముట్టేస్తారు.అందుకోసం వారు జనం గుర్తు పట్టకుండా తలకు హెల్మెట్ పెట్టుకుని అయన పాత స్కూటరు పై సంతృప్తిగా వెళ్తారు..అదే వారికి ఇష్టం..
గురువు గారిని దర్శించేందుకు సిని పెద్దలు ఎందఱో వస్తుంటారు అందులో సిని పెద్ద హీరో లు కూడా ఉన్నప్పటికీ కనీసం ప్రచారానికి ఇష్టపడని గొప్ప వ్యక్తిత్వం..
{మరోకరేవరైనా అలాంటి ఛాన్స్ వస్తే డైలీ పేపర్ లో కనిపించి దొరికినకాడికి దండుకొంటారు..}
మాట ఇస్తే ఖచ్చితం గా ఆ మాట నెరవేరుస్తారు..ప్రవచనం చెప్పటానికి వస్తానని రాకుండా ఉన్న సంఘటనలు ఒక్కటి కూడా లేవంటే అతిశయోక్తి కాదు.
గొప్ప భక్తి తత్పరులు..నిరంతర దైవ స్మరనులు..కర్మానుస్టానులు..స్థితప్రజ్ఞుడు .(కర్మయోగం +. భక్తియోగము =స్థితప్రజ్ఞుడు )
ఆ మహాను భావులను టి.టి.డి దేవస్థానం గౌరవిస్తూ.ఆలయ కార్య నిర్వాహక ప్రధాన సలహాదారునిగా నియమించింది.
ఈ సందర్భం గా టి.టి.డి.వారికి శ్రీ వారి తరపున పెద్ద మొత్తములో నగదు అధికార లాంఛ నములను పంపించగా వారు వాటినితిరస్కరించి కేవలం సలహాదారునిగా ఉంటానని సెలవిచ్చిన మహా వ్యక్తి ఆయన..
స్వామి వారి సన్నిదిలో సలహాదారుని గా ఉండడాన్నిగురువు గారు మహా అదృష్టం గా భావిస్తున్నారు..
గురువుగారు అన్ని కోరికలను జయిన్చాలనే మార్గం లో నడుస్తున్నారు..
వారు తలుచుకుంటే రాష్ట్రం లోనే కాదు దేశం లో గొప్ప పదవిని అలంకరించగలరు..అవేవి..వారికి అవసరం లేదు...ధర్మాన్ని పాటించడమే వారికి తెలుసు..
ఇటువంటి ఉదాహరణలు అనేకము..ఆయని జీవితం లో..భక్తి లో అమ్మవారే ఆయనచేత ప్రవచనం చెప్పిస్తుందని భక్తుల విశ్వాసం ..అలా ఉంటాయి వారి ప్రవచనాలు..
సాక్షాతూ ఈ కాలము లో మనల్ని ఉద్దరించేందుకు వచ్చిన జగద్గురు.శంకరాచార్యుల అంశగా భక్తులు చెప్పుకుంటున్నారు..
నిజానికి అంత గొప్పవారే గురువు గారు..విజయవాడ లో నేను పెట్టిన మహా సభలో వారు ప్రవచనం చేసిన రోజులలో {వర్షాకాలం}నిజానికి అందరు వర్షం పడుతుంది అనుకున్నారు.కాని చినుకైన రాలలేదు..3వరోజుప్రసంగం పూర్తైన 10 నిమిషాలకు భయంకరమైన వర్షం 3 రోజుల పాటు కురిసింది.{ఇది ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల లో జూన్ 13,14,15, -2012 లో జరిగినది}
అంతే కాదు అదే నెల విజయవాడ లో ఫై.బి.సిద్దార్ధ కళాశాలో వారు ప్రవచనాలు ,25,26,27,28.29 తేదిలలో చేసారు .ఆసమయం లో రెండవ రోజు ప్రవచనం జరుగుతుంది..విజయవాడం తా పెద్ద వాన కురుస్తుంది..ప్రవచనం చెప్పే ప్రాంతాలలో వర్షం కురవలేదు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉండదు..వారి ..భక్తి శీలతకు
ఇంతటి మహాను భావునిశిష్య పరమాణు వులో ఒకని గా ఉండటం నా జన్మ కు వరం .
నేనైతే..నా జీవితం లో ఇంత గొప్ప వారిని దర్శిస్తానని నమ్మలేదు ...మీరు వారి ప్రవచనాలు ఒక్కసారి విని మంచి సనాతన ధర్మాన్ని తెలుసుకోండి మన జీవనయానం ఎలా చేయాలో తెలుసు కావచ్చును..

ఇట్లు
మీ అడ్మిన్

No comments:

Post a Comment