Thursday, September 27, 2018

మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం |

కొందరి ధోరని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం మరియు అసహ్యం కలిగి వాళ్ళను పలకరించకుండా మౌనంగా ఉంటే, " వీడికి ఎంత పొగరో, పాత చుట్టాలమైన మాకంటే ఆ కొత్త పరాయి వాళ్ళే ' ఎక్కువై ' పోయారు..." అంటూ వెకిలి భావాలు మొదలు పెడ్తారు ...
" రా తెగ సంపాదిస్తున్నావంటా " అని ఎప్పుడు వక్ర బుద్దితో ఏడిచే చుట్టం ఎక్కువా ?
లేక
"దేవుడి దయతో ధర్మబద్ధంగా సంపాదించి జీవితంలో బాగా స్థిరపడు బాబు" అని పలకరించే పరాయి వాళ్ళు ఎక్కువా ?
"ఎంత సేపు దేవుని చుట్టూ తిరిగడం time & డబ్బులు waste చేయడం బాగా వచ్చు కాని మా ఇంటికి రాడానికి మాత్రం time దొరకదు" అని, వాళ్ళకు పెద్దగా కానుకలు ఇవ్వట్లేదని ఏడిచే చుట్టం ఎక్కువా ?
లేక
"దేవుడి దయతో మీరు బావుంటే చాలు మాకు అదే పదివేలు..." అని మనసార ఆత్మీయంగా కోరుకునే పరాయి వాళ్ళు ఎక్కువా ?
మనసులో ఆస్తులు, అంతస్తులూ, పెత్తనాలు, పెద్దరికాలు అంటూ అవతలి వారి స్థితిగతులను బేరిజు వేసుకుంటూ ఊగిపోతూ బ్రతికే "మన వారి" కంటే,
ఆత్మీయత, అనురాగం, సహాయదృక్పథం, స్నేహం, అనే వాటితో బ్రతికే "పరాయి వారే" ఖచ్చితంగా ఎక్కువ...!
ఇన్ని కోట్లు సంపాదించాం, ఇన్ని అంతస్తుల మేడలో ఉన్నాం, మా పిల్లలు కూడా బాగానే సంపాదిస్తున్నారు, ఆరు పదుల వయస్సుకు దెగ్గర పడుతున్నాం, అందుకే మేము అందరికంటే అన్నిట్లోను "పెద్దవాళ్ళం" అని అనుకోవడం లోనే మీ అసలు పెద్దరికం ఏపాటిదో చెప్పకనే చెప్పబడుతుంది...
మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం |

No comments:

Post a Comment