ఈ లోకంలో దేనికైనా హద్దు ఉంటుందేమో కాని, కొందరి సంకుచిత స్వభావానికి , [ Narrow-mindedness ] మూర్ఖత్వానికి [ Foolishness ], అస్సలు హద్దు అనేది ఉండదేమో !
1. వాళ్ళకు కోట్లల్లో ఆస్తులు ఉన్నా , తమ తోటి బంధువులకు లక్షల్లో ఉంటే ఏడుపు ..
2. వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉండి నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా , తమ తోటి బంధువుల పిల్లలు స్వదేశంలోనే ఉండి నెలకు వేలల్లో సంపాదిస్తే ఏడుపు ..
3. తమకు అన్నీ ఉన్నా, పక్క వాళ్ళకు ఎన్ని ఉన్నాయో అని ఏడుపు ..
2. వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉండి నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా , తమ తోటి బంధువుల పిల్లలు స్వదేశంలోనే ఉండి నెలకు వేలల్లో సంపాదిస్తే ఏడుపు ..
3. తమకు అన్నీ ఉన్నా, పక్క వాళ్ళకు ఎన్ని ఉన్నాయో అని ఏడుపు ..
పైగా, పెద్దలకు గౌరవం, మరియాద ఇవ్వడం తెలియదు, అంటూ వేమన నీతులు చెప్పడం.
ఒక మనిషికి పెద్దరికం, గౌరవం, మరియాద వంటివి వారికున్న వయసుకు కాకుండా, నలుగురిలో తాము మాట్లాడే మాటలను బట్టి, వారికి ఉన్న సంస్కారాన్ని బట్టి మాత్రమే ఇస్తారని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో...
వయసులో 50+ ఉంది కదా అని వొళ్ళంతా ముల్లతో ఉన్న తుమ్మ చెట్టుకు నమస్కారం చేస్తామా లేక అదే వయసున్న రావి చెట్టుకు నమస్కారం చేస్తామా ?
వయసులో 5 వారాలేకదా అని గజ్జిమొక్కను ఆదరిస్తామా లేక అదే వయసున్న తులసి మొక్కనా ?
వయసు కేవలం లెక్కించడానికి తప్ప మరెందుకు పనికిరాని అంశం. వయసుతో పాటు ఇతరులకు కనీసం మాటతోనైనా ఎదైనా మంచి చేసే హృదయం ఉంటే అప్పుడు దానికి విలువ.
జీవితానికి పరమార్దం తెలియక పోయినా పర్వాలేదు , కనీసం అర్ధం తెలుసుకొని బ్రతికితే బావున్ను కొందరు "పెద్దలు"..!
No comments:
Post a Comment