Thursday, September 27, 2018

" గోప్త్రీ గోవిందరూపిని " = "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ..." అనే కీర్తనలో "సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు...." ...!

తెలుగు నేలపై ఆషాఢ ఆనంద హేల వెల్లివిరిసే వేళ, భాగ్యనగరపు [సికింద్రబాద్] మహంకాళి అమ్మవారినుండి , భీమవరపు మావుళమ్మ వరకు, పరాశక్తిగా దక్షిణాయన నాయకి గా పాలన సాగించే వైష్ణవి తత్వం, మరియు ఉత్తరాయణ సమాప్తి తో యోగ నిద్రలోకి జారుకున్న జలజనాభుడైన విష్ణుతత్వం రెండు ఒక్కటే అని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆరాధనయందు ప్రబలంగా మనం చూడవచ్చు...
ప్రతి గురువారం స్వామివారికి జరిగే అన్నకూటోత్సవం [తిరుప్పావడ సేవ], శుక్రవారాభిషేకం [పూరాభిషేక సేవ], స్వామి వారి ఆనంద నిలయంపైగల అష్టదిక్కుల సింహాలు, స్వామి వారి ఏడు కొండలకు గల సప్తశక్తుల రక్షణకవచం, ఇలా మరెన్నో నిగూఢమైన సశాస్త్రీయ తార్కాణాలు కోకొల్లలు.... వైదిక వాంగ్మయం లోకి తరచిచూసినా సరే ఎన్నో చోట్ల ఈ విషయం విదితమే...
వశిన్యాది వాగ్దేవతా విరచిత లలితలో " గోప్త్రీ గోవిందరూపిని " అనడంలోని ఆంతరము, ఆన్నమాచార్యుల వారు "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ..." అనే కీర్తనలో "సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు...." అనడంలోని ఆంతరము, ఒక్కటే కాబోలు !
సరే అయితే, matter simple గా చెప్పాలంటే ,
మన స్వామి షోడశకళాప్రపూర్ణుడై, ఎవరికి ఎలాకావాలంటే అలాగే కనిపించే multi-role super star అనేది నాఫీలింగ్ అన్నమాట ...
-- శ్రియఃపతి శ్రీనివాస శ్రీచరణాలచంత ఓ వినయ పూరిత చిరు కవనకుసుమం... 
YOUTUBE.COM
Enta matramuna evvaru talachina song by Sri balakrishna prasad. He sung this song at the time of Laksha galarchana Lyrics: ఎంత మాత్రమున ఎవ్వరు…

No comments:

Post a Comment