Brahmasri Chaganti Koteswara Rao Garu
ఇది కృష్ణదేవరాయలు తన అష్ట దిగ్గజములను అడిగిన ప్రశ్న ఎవరు బదులు చెప్పలేక పోయిరి. అప్పుడు తెనాలి రామలింగడు ముందుకు వచ్చి రాజా మీ సందేహమునకు నేను బదులు చెపుతాను అని అన్నాడు. రాజు సరే అన్న తర్వాత ఒక కొవ్వు వత్తి అంటించి రాజా ఈ వత్తి జ్వాల ఎటు పక్క ఏ దిశగా మండుతూ ఉన్నది అన్నాడు రాజు ఊర్ధ్వముగా అయితే ఈ దిశను చూపడం లేదు అన్నాడు. సరి అని కొవ్వు వత్తిని పైకి కిందికి ఇటు అటు తిప్పి వుంచి ఇప్పుడు చెప్పండి అన్నాడు రాజు ఎటు ఏ విధముగా ఉంచినాను జ్వాల ఊర్ద్వాముగా నే ఏ దిశను చూపకుండా మండుతూ వుంది అంటాడు అప్పుడు తెనాలి రామలింగడు రాజా మనము దీపమును అంటే జ్వాలను సాక్షిగా తీసుకొని భగవంతుడు మనకు పైన సదా ఉన్నాడు అంటాడు.
రెండవది మీరు దేవుడు ఎలా ఉంటాడు అని అడిగారు కదా దీనికి నేను బదులు చెప్పాలి అంటే నాకు ఒక చిన్న గిన్నెలో కొంచెము పాలు తెచ్చిపెట్టండి అంటాడు తర్వాత ఈ గిన్నెలోని పాలలో కొంచెము పెరుగు కలపితే ఏమవును అంటాడు రాజు పెరుగు అవును అంటాడు సరి ఆ పెరుగు చిలికితే ఏమవును అంటాడు రాజు మజ్జిగ వచ్చును అంటాడు మరి మజ్జిగను చిలికితే అంటే వెన్న వచ్చును అంటాడు వెన్నను కాచితే ఏమవును అంటాడు రాజు వెన్నె నేయిగా మారును ఇందులో మీకు వేరే అభిప్రాయము లేదు కదా అని అడుగుతాడు రాజు ససేమిరా లేదు అంటాడు
అయితే ఈ గిన్నెలోని పాలులో పెరుగు, మజ్జిగ వెన్నె నేయి వుంది అని చెపుతారు కదా పాలలో ఏ భాగములో పెరుగు, మజ్జిగ, వెన్న నేయి ఏ ఏ పాళ్ళలో వుంది చెప్పండి అంటాడు అప్పుడు రాజు అది ఎలా చెప్పగలము అన్ని ఒకటిలో ఒకటి అంతర్లీనమై వున్నది కదా అంటాడు అప్పుడు రామలింగడు రాజా భగవంతుడు కూడా సర్వాంతర్యామి అంతటా అన్నిట్లో వ్యాపించి వున్నాడు మనము ధ్యానముతో అతనిని చూడ వలెను అతను ఎక్కడ ఎలా ఉంటాడు అనేది చెప్పడం జ్ఞానులకు సైతం సులభతరం కాదు అప్పుడు రాజు సరే రెండింటికి బదులు చెప్పావు మూడవ దానికి కూడా చెప్పు అంటాడు

అప్పుడు రామలింగడు రాజా నీకు నేను రెండు ప్రశ్నలకు సరైన సందేహ నివారణ చేసినందువల్ల నీకు గురువును అవుతాను, మీరు శిష్యుడు అవుతారు. గురువు కింద శిష్యుడు పైన వుండటం సరికాదు అన్నాడు. మీరు సింహాసనము వదిలి కింద వచ్చి నిల్చొండి నేను సింహాసనము నందు కూర్చొని మీకు సమాధానము చెపుతాను అంటాడు. రాజు అలానే అని రామలింగని సింహాసనముపైన కూర్చోపెట్టి తాని కిందకు వచ్చి భవ్యముగా నిలబడతాడు. అప్పుడు రామలింగడు ఎవరక్కడ! ఈ మతిలేని మహారాజును చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేయండి అని ఆజ్ఞాపిస్తాడు. రామలింగని ఆజ్ఞను చూసి రాజు మరి రాజ సభలోని అందరు దిగ్భ్రమకు గురి అయ్యి నోరు మెదపలేక పోయారు. అప్పుడు రామలింగడు రాజా సందేహము వద్దు బయపడవద్దు నేను రాజుగా నటించాను అంతే అంటాడు. కొంచెం సేపటికి ముందు మీరు అధిష్టించిన సింహాసనమున భగవంతుడు నన్ను కూర్చోపెట్టి మిమ్ములను నా ఆజ్ఞకు బద్ధుడు అయ్యే సాధారణ వ్యక్తిగా మార్చాడు ఇదిదా భగవంతుడు ఇప్పుడు చేసిన పని రాజును సామాన్యుదిగాను సామాన్యుని రాజుగాను భగవంతుడు ఒక్కనివల్లె మార్చడానికి కుదురును ఇప్పుడు మీ సందేహము నివృత్తి అయిందా అంటాడు. రాజు అయ్యింది అని ఒప్పుకొని రామలింగనికి అనేక బహుమతులు ఇచ్చి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు
ఇది రామలింగడు రాజుకు మట్టుకే చెప్పింది కాదు మన అందరికి కూడా....
No comments:
Post a Comment